IIT-Mandi team finds plant to help fight Covid infection కరోనాపై పోరులో హిమాలయ ఔషద మొక్క బరాన్ష్ కీలకం: ఐఐటీ మండి

Iit mandi discover phytochemicals in himalayan plant that inhibit covid 19 virus

Biomolecular Structure and Dynamics, Buransh, Buransh covid, Covid inhibitor, covid inhibitors, Himalayan Buransh, Himalayan plant, Himalayan rhodendron, IIT Mandi, IIT Mandi School of Basic Science, Indian Institute of Technology Mandi, Covid Biomolecular Structure and Dynamics, Phytochemicals, Rhododendron, Rhododendron arboreum, Rhododendron covid, Rhododendron flower

Researchers from the Indian Institute of Technology (IIT), Mandi and the International Centre for Genetic Engineering and Biotechnology (ICGEB) have identified phytochemicals in the petals of a Himalayan plant that could potentially be used to treat COVID-19 infection.

కరోనాపై పోరులో హిమాలయ ఔషద మొక్క బరాన్ష్ కీలకం: ఐఐటీ మండి

Posted: 01/18/2022 10:25 AM IST
Iit mandi discover phytochemicals in himalayan plant that inhibit covid 19 virus

ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకుని అల్లాడిస్తున్న కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయడంలో ఓ మొక్క సాయాన్ని తీసుకునేందుకు శాస్త్రవేత్తలు సిద్దమయ్యారు. అదేంటి ఆ మొక్కలో ఉన్న ఆ గోప్పదనం మేంటి.. అది ఎక్కడ ఉంది.? అది కరోనాపై ఎలా పోరాటాన్ని చేస్తుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయా.? నిజమే.. హిమాలయాల్లో లభించే ఓ మొక్క పుప్పుల రెక్కలతో కరోనాపై యుద్దాన్ని చేసేుందుకు సిద్దమయ్యారు శాస్త్రవేత్తలు. హిమాలయాల్లోని ‘రోడోడెండ్రాన్ అర్బోరియం’ అనే మొక్క పువ్వులోని రెక్కలలో వున్న ఔషధ గుణాలు కొవిడ్ చికిత్సలో అత్యంత కీలకంగా మారనున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు, ఈ పుష్పాలలోని రెక్కలలో ఫైటోకెమికల్స్ ఉన్నట్టు హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఢిల్లీలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజినీరింగ్ అండ్ బయో టెక్నాలజీ (ఐసీజీఈబీ) శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

హిమాలయ ప్రాంతంలో స్థానికంగా "బురాన్ష్" అని పిలువబడే ఈ మొక్కను ‘రోడోడెండ్రాన్ అర్బోరియం’ అన్న సైంటిఫిక్ పేరుతో పిలుస్తారు. ఇందులోని ఫైటోకెమికల్స్ కరోనావైరస్‌కు వ్యతిరేకంగా పోరాడతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ అధ్యయన వివరాలు ‘బయోమాలిక్యులర్ స్ట్రక్చర్ అండ్ డైనమిక్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. కరోనా వ్యాప్తిని నివారించే క్రమంలో వాక్సీన్ యేతర మార్గాలను అన్వేషిస్తున్న తమకు బురాన్ష్ పూలు మార్గాన్ని సులభం చేశాయని తెలిపారు. తాము గుర్తించిన బురాన్ష్ మొక్క పూరేకులను స్థానికులు రకరకాల చికిత్సలో ఏళ్లుగా ఉపయోగిస్తున్నారని ఐఐటీ మండీ అసోసియేట్ ప్రొఫెసర్ శ్యామ్ కుమార్ మసకపల్లి తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవ శరీరంపై వైరల్ దాడిని నిరోధించే నాన్-వ్యాక్సిన్ ఔషధాల కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. కరోనాను ఔషధాలతో తగ్గించేందుకు జరుగుతున్న పరిశోధనల్లో బరాన్ష్ మొక్కలోని ఔషధ గుణాలు దోహధం చేస్తాయని ఆయన తెలిపారు. ఈ పువ్వు రేకులలో ఉన్న రసాయనాలతో కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చునని చెప్పారు. బరాన్ష్ పుష్పాలలోని రసాయనాలు మన శరీర కణాలలోని గ్రాహకాలను బంధించి, వైరస్‌లోనికి ప్రవేశించకుండా నిరోధించగలవని,,  లేదా మన శరీరంలో దాని ప్రతిరూపణను నిరోధించగలవని ఐఐటీ మండి స్కూల్ ఆఫ్ బేసిక్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ శ్యామ్ కుమార్ మసకపల్లి అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles