Woman Pushed In Front Of Train In Hair-Raising Video రైలు వస్తుండగా.. మహిళను పట్టాలపైకి తోసేసిన ఆగంతుకుడు..

Man deliberately pushes woman in front of train at brussels metro station

brussels train push, train push belgium, train push europe, train push, brussels train station, train push brussels, woman pushed in front of train, woman pushed in front of subway, brussels woman pushed in front of train, belgium, viral video, Rogier metro station brussels, Rogier station, Brussels metro station, trt world, world news

A young man deliberately pushed a woman onto the tracks as the metro was pulling into the Rogier station in Brussels. A woman in Belgium had a miraculous escape after a man deliberately pushed her into the path of an oncoming subway train. The hair-raising incident was caught on CCTV camera, and the video has since gone viral. The metro was able to stop in time and the perpetrator has been arrested.

ITEMVIDEOS: రైలు వస్తుండగా.. మహిళను పట్టాలపైకి తోసేసిన ఆగంతుకుడు..

Posted: 01/17/2022 04:34 PM IST
Man deliberately pushes woman in front of train at brussels metro station

శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని పెద్దలు అంటారు. అది నూటికి నూరుపాళ్లు నిజమని బెల్జియంలోని ఓ మహిళకు ఎదురైన అనుభవం చెబుతోంది. మరణం అంచుల వరకు వెళ్లినా సురక్షితంగా తిరిగి వెనక్కువచ్చిన అమెపై ఓ అగంతకుడు వెనకునుంచి మృత్యువు ఒడికిలోకి నెట్టేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు స్థానికి సిసిటీవీల్లో రికార్డు కావడంతో అవి కాస్తా నెట్టింట్లో సంచలనంగా మారాయి. రోమాలు నిక్కపోడిచేలాంటి వీడియో ఇప్పుడు మనవాళ్లూ షేర్ చేసుకోవడంతో శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పడు మనదేశంలో వైరల్ గా మారాయి. ఈ ఘటన యూరోప్ దేశాల్లోని బెల్జియంలో చోటుచేసుకుంది.  లోని రోగిర్ మెట్రో స్టేషన్.

ఈ వీడియో ఆధారంగా.. బ్రసెల్స్ లోని రోగిర్ మెట్రో స్టేషన్ లో మెట్రో రైలు కోసం అందరి ప్రయాణికుల మాదిరిగానే ఓ నడి వయసు మహిళ మెట్రో రైలు కోసం వేచి చూస్తోంది. ఇక ఇంతలో అటు వైపుగా కొన్ని ఓ రైలు సమీపిస్తోంది. మరికోన్ని సెకన్లలో మెట్రో రైలు వచ్చి ప్లాట్ ఫామ్ పై ప్రయాణికుల కోసం అగబోతుంది అనగా, ఆ నడి వయసు మహిళ వెనుకగా వచ్చిన ఓ నల్ల టీషర్టు ధరించిన యువకుడు అడుగులో అడుగు వేసుకుంటూ అమె వెనక్కు చేరాడు. ఇక మరో రెండు మూడు సెకన్లలో రైలు వారి ముందుకు చేరుతుంది అనే క్రమంలో అమె వెనుకగా వెళ్లి ఒక్కసారి అమెను బలంగా పట్టాలపైకి తోసేశాడు. ఇదంతా కనురెప్పపాటు వేగంలో జరిగిపోయింది.

అంతే ఆకస్మికంగా జరిగిన ఈ చర్యపై అమెకు అసలు అవగాహన లేకపోవడంతో అమెను ఆమె నియంత్రించుకోలేక.. ఒక్కసారిగా వెళ్లి రైలు పట్టాలపైన పడిపోయింది. అంతలో ఏమైందీ అని గమనించేలోగా మహిళ రైలు పట్టాలపై పడింది. అయితే మెట్రో రైలు డ్రైవర్ అత్యంత అప్రమత్తంగా ఉండటంతో వెనువెంటనే ఎమర్జెన్సీ బ్రేక్ వినియోగించి రైలుకు సడన్ బ్రేక్ వేశాడు. దీంతో మహిళను గమనించి తోటి ప్రయాణికులు, మెట్రో రైలు డ్రైవర్ కూడా ఊపిరి పీల్చుకున్నాడు. వెంటనే తోటి ప్రయాణికులు పట్టాలపైకి దూకి మహిళను ఫ్లాట్ ఫామ్ పైకి తీసుకువచ్చారు. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ పరిణమాలలోనూ మహిళ ప్రాణాలతో సురక్షితంగా బయటపడగలిగింది.

ఈ అదృష్టానికి తోడు మహిళా ప్రయాణికురాలికి పెద్దగా గాయాలు కూడా కాలేదు. ఆమె బాగా మందంగల ఉన్నిస్వెటర్ వేసుకోవడం, పడిన తీరు ఆమెను కాపాడాయి. డ్రైవర్ సమయస్ఫూర్తి కూడా రక్షించింది. కానీ, ఈ ఘటనతో రైలు డ్రైవర్ షాక్ కు గురయ్యాడు. దీంతో స్టేషన్ రక్షణ సిబ్బంది మెట్రో పైలట్ ను, మహిళను హాస్పిటల్ కు తరలించారు. ప్రాథమిక చికిత్స చేసి వారిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. మహిళను పట్టాలపైకి తోసేసి పరారైన ఆగంతుకుడిని పోలీసులు ఛేదించి మరో మెట్రో స్టేషన్ లో అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు అలా చేశాడో తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. అతడి మానసిక పరిస్థితి తెలుసుకునేందుకు సైకియాట్రిస్ట్ ను నియమించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles