ఉత్తరాఖండ్ ప్రభుత్వం నుంచి బర్తరఫ్ అయిన మంత్రి హరక్ సింగ్ రావత్ ఇవాళ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారన్న వార్తలు వినబడుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మంతనాలు జరిపిన ఆయన.. ఇవాళ లాంఛనంగా పార్టీలో చేరి కండువాను కప్పుకోనున్నారు. బీజేపి ప్రభుత్వం తన అసెంబ్లీ నియోజకవర్గమైన కోట్ద్వార్ లో మెడికల్ కాలేజీని స్థాపిస్తామని హామి ఇచ్చి.. ఎన్నికలు సమీపిస్తున్నా ఆ హామీని నెరవేర్చలేదని ఆయన అరోపించారు. దేవభూమిగా వర్ధిల్లుతున్న ఉత్తరాఖండ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు సమీకరణలతో వేడెక్కుతున్నాయి. ఇప్పటికే నువా-నేనా అన్నట్లు ఇక్కడి ఎన్నికల సంగ్రామం నెలకొందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
కాంగ్రెస్ గూటికి చెందిన హరక్ సింగ్ రావత్ బిజెపి అధిష్టాన నిర్ణయాలను ఫాలో కావడం లేదని.. ఇక గత ఐదేళ్లలో పదేపదే సమస్యలను సృష్టించారని బీజేపి నేతలు అరోపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో బీజేపి కార్యకర్తలలో కూడా ఆయనపై అసంతృప్తి ఉందని.. రావత్ తో పాటు 2016లో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నేతలు, కార్యకర్తలకే అదిక ప్రాధాన్యత ఇచ్చారని.. పార్టీ అధిష్టాననికి బీజేపి కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారని కూడా బీజేపీ అరోపించింది. బీజేపిలో ముఠా నాయకత్వాలకు అస్కారం లేదని అక్షేపించింది. నియోజకవర్గ స్థాయిలో బీజేపి కార్యకర్తలతోనూ ఆయన సమన్వయం చేసుకోవాలని బీజేపి నాయకత్వం తెలిపింది.
దీంతో పాటు ఆయన ఏకంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలో ఏర్పాటైన కేబినెట్ సమావేశంలోనూ ఆయన దురుసుగా వ్యవహరించి.. తన డిమాండ్లు పరిష్కరించకపోతే పార్టీ నుంచి వైదోలగిపోతానని తీవ్రస్వరంతో ఆగ్రహం వ్యక్తి చసిన ఆయన మంత్రివర్గ సమావేశం నుంచి వెళ్లిపోయారని బీజేపి వర్గాలు తెలిపాయి. అయితే ఆయన తన అసెంబ్లీ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు విషయంలో ఆగ్రహంతో వెళ్లిపోయారన్న వార్తల్లో వాస్తవం లేదని.. కేవలం తన కుటుంబసభ్యులకు పార్టీ టికెట్ల కోసం డిమాండ్ చేస్తూ పార్టీ అధిష్టానంపై ఒత్తడి తీసుకువచ్చారని అందుచేత పార్టీ ఆయనను బర్తరఫ్ చేసిందని బీజేపి వర్గాలు తెలిపారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు, తన కోడలు అనుకృతి గోసైన్తో పాటు అతని మద్దతుదారుల్లో ఒకరికి టిక్కెట్లు ఇవ్వాలని రావత్ బిజెపి అగ్రనాయకులపై ఒత్తిడి తెచ్చారని వార్తలు బయటకోచ్చాయి. ఈ క్రమంలో ఆయనపై బీజేపి అధిష్టానం చర్యలు తీసుకుంది. దీంతో ఆయన ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరిపారని, త్వరలోనే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని వార్తలు వచ్చాయి. అందుకు ఇవాళ ముహుర్తాన్ని ఖరారు చేసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి కూడా ఆయనకు తన కొడలికి టికెట్ హామీ లభిస్తేనే పార్టీలో చేరుతారని ఆయన సన్నిహిత వర్గాల సమాచారం.
(And get your daily news straight to your inbox)
May 21 | తెలుగు చిత్రపరిశ్రమలో ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుల జాబితా పెరగడం సంతోషమే. విజయవంతమైన చిత్రాలతో ఆ జాబితాలో నిలిచిన మరో దర్శకుడు అనీల్ రావిపూడి. లో ప్రస్తుతం తలెుగు చిత్రఅనిల్ రావిపూడి దర్శకత్వంలో... Read more
May 20 | రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నదని ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తంచేస్తోంది. పాత జన్యురూపాన్ని మార్చుకొని వచ్చిన కొత్త రకం (బీఏ4) వైరస్‌కి వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని టెన్షన్ పడుతుంది. ప్రస్తుతం ఈ... Read more
May 20 | ఓ వైపు వేదమంత్రోచ్ఛరణలు.. మాంగళ్యం తంతునానీనాం.. అంటూ.. వధూవరులను భార్యభర్తలుగా మార్చే పవిత్రమైన మంత్రాన్ని అందుకున్నారు అయ్యవారు. ఇంతలో ఆగండీ అన్న శబ్దం వినిపించింది. కళ్యాణమండపం ప్రధాన ద్వారం వరకు పెళ్లి వేదిక సహా..... Read more
May 20 | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ బూటకమని జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ తేల్చిచెప్పింది. నిందితులు పోలీసుల నుంచి తుపాకీలు లాక్కుని కాల్పులు జరిపారన్నది నమ్మశక్యంగా లేదని స్పష్టం చేసింది. నిందితులపై పోలీసులు... Read more
May 20 | రాజకీయాల్లో దూకుడుగా వెళ్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలగాణ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ పరిమితి సంఖ్యలో పోటీ చేయబోతోందని అభిమానులకు నూతనోత్తేజం కలిగించేలా... Read more