పండుగ వేళ సామాన్యుడిపై మరో పిడుగు పడింది. కరోనా కష్టకాలంలో అసలే మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోతున్న తరుణంలో నిత్యావసర సరుకుల దరలను పెంచుతూ ఆయా కంపెనీలు నిర్ణయం తీసుకోవడంతో వారిపై మరో భారం పడింది. నిత్యావసర వస్తువులు ధరల పెరుగుదల ప్రధానంగా మధ్యతరగతి వారిపైనే అధిక ప్రభావం చూపునుంది. కాగా, ధరల పెంపు అనివార్యమైందని మరీ ముఖ్యంగా ముడి పదార్థాల ధరలు పెరగడంతో ధరలను పెంచక తప్పలేదని దేశంలోని ప్రముఖ నిత్యావసర సరుకుల కంపెనీలు ఇప్పటికే తెలిపాయి. ఇక నిత్యావసర సరుకుల తయారీ దిగ్గజ సంస్థ హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్యుఎల్) తమ సబ్బులు, డిటర్జెంట్లయిన వీల్, రిన్, సర్ఫ్ ఎక్సెల్, లైఫ్ బోయ్ ధరలను 3 నుంచి 20 శాతం వరకు పెంచింది.
గత ఏడాది నవంబర్ లో కూడా తమ నిత్యావసర వస్తువుల ఉత్పాదనల ధరలను పెంచిన ఈ సంస్థ మరోమారు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ సారి సర్ఫ్ ఎక్సెల్ బార్ ధర 20 శాతం పెంచింది. దీంతో సర్ఫ్ ఎక్సెల్ బార్ ధర రూ.10 నుంచి రూ.12కు పెరిగింది. అలాగే, లైఫ్ బోయ్ 125 గ్రాముల ప్యాక్ ధర రూ.29 నుంచి రూ.31కు, పియర్స్ 125 గ్రాముల సబ్బు ధర రూ.76 నుంచి రూ.83కు ఎగబాకింది. సింగిల్ రిన్ 250 గ్రాముల బార్ ధర రూ.18 నుంచి రూ.19కు పెరిగింది. వీల్ డిటర్జెంట్ పౌడర్ అర కిలో ప్యాక్ ధర రూ.30 నుంచి రూ.31కి పెంచింది. హిందుస్థాన్ యూనిలీవర్ తో పాటు పలు కంపెనీలు పలు నిత్యావసర వస్తువుల ధరలను పెంచాయి.
ప్యాకేజ్డ్ గోధుమ పిండి ధరలను 5-8 శాతం పెంచుతున్నట్లు అదానీ విల్మార్ ఇప్పటికే ప్రకటించింది. అలాగే, బాస్మతి బియ్యం ధరలను 8-10 శాతం పెంచింది. మరోవైపు, పార్లే ప్రొడక్ట్స్ ఈ ఏడాది మార్చి నెలలో 4-5 శాతం ధరలను పెంచాలని యోచిస్తోంది. గత త్రైమాసికంలోనూ ఆ కంపెనీ ధరలు పెరిగాయి. డాబర్ ఇండియా కంపెనీ ధరలు కూడా పెరగనున్నాయి. కావింకేర్ ఈ నెలలో తన షాంపూలు, చర్మ సంరక్షణ ఉత్పత్తుల ధరలు 2-3 శాతం వరకు పెంచనుంది. ఇక ఈ బాటలోనే మరిన్ని నిత్యావసర సరుకుల తయారీ కంపెనీలు కూడా త్వరలో నడవనున్నాయి. ఇక ఒకటి తరువాత మరోకటి అన్ని కంపెనీలు ధరలను పెంచనున్నాయి.
గతేడాది 12 నెలలు కాలంగా, వంట నూనె, పప్పుధాన్యాలు, మసాలా దినుసులు, సంరక్షించదగిన కూరగాయలు, పాలు, పాల ఉత్పత్తులతో పాటు వ్యవసాయ-వస్తువుల వ్యయాలు అధికంగా పెరిగాయి. హిందూస్తాన్ యునిలివర్, ఐటీసీ, నెస్లే, అదే విల్మార్, దబూర్, మైనో, ఇమామి సహా అన్ని ప్రముఖ కంపెనీలపై అదనపు భారం పడుతోంది. చాలా వస్తువుల వ్యయంభార పడటంతో పాటు లాజిస్టిక్స్ ప్యాకేజింగ్ పదార్థాల వ్యయం కూడా పెరిగిందని.. దీంతో నిత్యావసర సరుకుల ధరలను పెంచక తప్పడేం లేదని తెలిపాయి. దీంతో వ్యక్తిగత అవసరాలకు వినియోగించే డిటర్జెంట్ సబ్బులతో పాటు టూత్ ఫేస్ట్ వరకు అన్ని ప్యాకడ్ ఫుడ్ వస్తువులైన రుచికరమైన స్నాక్స్, బ్రేడ్, పాల ఉత్పత్తులు ఇక ప్రియంగా మారనున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 13 | తన బిడ్డ అపదలో ఉన్నాడంటే ప్రతీ తల్లి గజేంద్రమోక్ష ఘట్టంలోని శ్రీమహావిష్ణువు రూపం దాల్చి అత్యంత వేగంగా ప్రతిస్పందించి రక్షిస్తుందని అంటారు. తన బిడ్డకు ఆపద వస్తుందంటే అవసరమైతే పులితో కూడా పోట్లాడి.. తన... Read more
Aug 13 | బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక ఖర్గే చేసిన తీవ్రవ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు పోందాలంటే యువకులు లంచం ఇవ్వాలి.. యువతులైతే మరో రకంగా సహకరించాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రియాంఖ ఖార్గే... Read more
Aug 13 | దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా.. దేశప్రజలందరూ తమ ఇళ్లపై జెండాలను అవిష్కరించాలని ఇప్పటికే జెండాలను కూడా పంచిన క్రమంలో.. వాటితో తమ తమ... Read more
Aug 13 | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల నియాక ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ (SSC) చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. అర్హులైనవారు వచ్చే నెల 2... Read more
Aug 13 | మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి... Read more