JanaSena Chief Pawan kalyan gives clarity to TDP ప్రస్తుతం బీజేపితో జనసేన పొత్తు: టీడీపీ ఆశలకు బ్రేక్ వేసిన పవన్ కల్యాణ్.!

Janasena is already in alliance with bjp pawan kalyan gives clarity to tdp

AP CM YS Jagan, Pawan Kalyan, JSP alliance, JanaSena, BJP, TDP, YSRCP, janasena alliance, janasena election alliance, janasena in alliance with BJP, janasena TDP, YSRCP Election Promise, Unemployment youth, Pawan Kalyan, Employment, Mega DSC, Teachers Recruitment, Government jobs, janasena, job calendar, AP Govt jobs, Andhra Pradesh, Politics

Jana Sena chief Pawan Kalyan stated that the party is already in alliance with Bhartiya Janata Party in the state and added and thanked every party activist for leaving the alliance decision to him. Addressing the party executive members through teleconference, Pawan Kalyan asked the party workers to strengthen the party and not to deviate after any statements passed by leaders from the party.

ప్రస్తుతం బీజేపితో జనసేన పొత్తు: టీడీపీ ఆశలకు బ్రేక్ వేసిన పవన్ కల్యాణ్.!

Posted: 01/11/2022 07:21 PM IST
Janasena is already in alliance with bjp pawan kalyan gives clarity to tdp

ఎన్నికల పొత్తు అంశంపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ మౌనం వీడారు. ఈ విషయంలో జనసేన కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల పోత్తు అంశాన్ని పార్టీ అధిష్టానం నిర్ణయానికి వదిలేసిన వారికి ధన్యవాధాలని చెప్పారు. అయితే ప్ర‌స్తుతం తాము బీజేపీతోనే పొత్తులో ఉన్నామ‌ని జనసేనాని తేల్చి చెప్పారు. జ‌న‌సేన అధినేత ఆ పార్టీకి చెందిన కార్య‌నిర్వాహ‌క స‌భ్యుల‌తో టెలికాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోవాల్సి వ‌చ్చినా, ఒంట‌రిగా నిర్ణ‌యం తీసుకోన‌ని, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో చ‌ర్చించిన త‌ర్వాతే ముందుకు వెళ్తాన‌ని ఆయన హామీ ఇచ్చారు. పొత్తు పెట్టుకోవ‌చ్చు క‌దా.. అంటూ ప‌లు పార్టీలు మ‌న‌ల్ని కోరుతాయ‌ని, అయినా.. తొంద‌ర ప‌డ‌కుండా, గంధరగోళానికి గురికాకుండా ఉండాల‌న్నారు.

రాష్ట్ర ప‌రిస్థితుల దృష్ట్యా ఆయా పార్టీలు మైండ్ గేమ్ ఆడుతుంటాయ‌ని, ఆ మైండ్ గేమ్‌లో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పావులు కాకూడ‌ద‌ని ప‌వ‌న్ పార్టీ నేత‌ల‌ను హెచ్చ‌రించారు. పొత్తుల‌పై ఒక్కో మాట మాట్లాడ‌కూడ‌ద‌ని, అంద‌ర‌మూ ఒకే ప‌ల్ల‌విని ఎత్తుకోవాల‌ని కూడా స్ప‌ష్ట‌మైన ఆదేశాలిచ్చారు. సంస్థాగ‌తంగా ఇప్పుడిప్పుడే బ‌ల‌ప‌డుతున్నామ‌ని, పార్టీ ఆవిర్భావ దినోత్స‌వాన్ని ఘ‌నంగా జ‌రుపుకుందామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఆవిర్భావ దినోత్స‌వ స‌భ‌లో పొత్తుల విష‌యాన్ని మ‌రింత లోతుగా చ‌ర్చించుకుందామ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. ఎన్నిక‌లు రాక‌మునుపే ఏపీలో పొత్తులపై చ‌ర్చ‌లు జ‌రిగిపోతున్నాయి. దీనికి టీడీపీ అధ్య‌క్షుడు, మాజీ సీఎం చంద్ర‌బాబు కుప్పం వేదిక‌గా మొద‌ట‌గా ఆజ్యం పోశారు.

రాష్ట్రంలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమను ముప్పేటదాడి చేస్తుందని అరోపిస్తున్న టీడీపీ.. రానున్న ఎన్నికలలో అప్పటి పరిస్థితులను అధ్యయనం చేసిన తరువాత పోత్తులపై నిర్ణయం తీసుకుంటామని ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. అయితే జనసేనతో కలసి ఎన్నికలకు వెళ్తారా.? ఈ మేరకు కొన్నివార్తలు వినిపిస్తున్నాయని ఓ పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు బదులుగా.. వన్ సైడ్ లవ్ తో లాభం లేదని, ఉంటే రెండు వైపులా ఇచ్చుపుచ్చుకునే పరిస్థితులు ఉండాలని టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇక దీనిపై అటు అధికార పక్షంతో పాటు ఇటు ప్రతిపక్షంగా వున్న బీజేపి నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

అయితే చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌పై బీజేపీ తీవ్రంగా విరుచుకుప‌డింది. బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు మాట్లాడుతూ.. అవ‌స‌రం కోసం చంద్ర‌బాబు ఎవ‌రినైనా ల‌వ్ చేస్తార‌ని ఎద్దేవా చేశారు. అవ‌స‌రం తీరిపోయాక విడిచిపెడ‌తార‌ని మండిప‌డ్డారు. 1996 నుంచి చంద్ర‌బాబు అంద‌ర్నీ ల‌వ్ చేస్తూనే వున్నార‌ని సోము వీర్రాజు విరుచుకుప‌డ్డారు.పొత్తు చిక్కుల‌ను విప్పేశారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ప్ర‌స్తుతం తాము బీజేపీతోనే పొత్తులో ఉన్నామ‌ని తేల్చి చెప్పారు. జ‌న‌సేన అధినేత ఆ పార్టీకి చెందిన కార్య‌నిర్వాహ‌క స‌భ్యుల‌తో టెలికాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పొత్తుల‌పై క్లారిటీ ఇచ్చేశారు. ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోవాల్సి వ‌స్తే, ఒంట‌రిగా నిర్ణ‌యం తీసుకోన‌ని, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో చ‌ర్చించిన త‌ర్వాతే ముందుకు వెళ్తాన‌ని కూడా హామీ ఇచ్చారు. పొత్తు పెట్టుకోవ‌చ్చు క‌దా.. అంటూ ప‌లు పార్టీలు మ‌న‌ల్ని కోరుతాయ‌ని, అయినా.. తొంద‌ర ప‌డ‌కుండా, క‌న్ఫ్యూజ్ కాకుండా ఉండాల‌న్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP CM YS Jagan  Pawan Kalyan  JSP alliance  JanaSena  BJP  TDP  YSRCP  Andhra Pradesh  Politics  

Other Articles

Today on Telugu Wishesh