historic transplant of pig heart into human patient అమెరికా వైద్యుల అద్భుతం: మనిషికి వరాహం గుండె అమరిక..

First successful pig to human heart transplant performed in us

heart transplant, pig heart transplant, transplant, historic pig heart transplant, pig heart human, us heart transplant, pig heart transplant human, organ transplant, heart transplant news, organ transplant news, doctors reaction heart transplant news, pig heart transplant doctors, pig heart transplant doctors reactions, health news, health

In a first, doctors successfully transplanted a pig heart into a 57-year-old patient with terminal heart disease. According to the University of Maryland Medical Center, where the historic surgery was conducted, the patient is doing well, three days after the procedure.

అమెరికా వైద్యుల అద్భుతం: మనిషికి వరాహం గుండె అమరిక..

Posted: 01/11/2022 06:15 PM IST
First successful pig to human heart transplant performed in us

ప్రపంచంలో మొట్టమొదటి సారి గుండె మార్పిడి చికిత్సలో అమెరికా వైద్యులు కొత్త చరిత్ర సృష్టించారు. పంది గుండెను మనిషికి విజయవంతంగా అమర్చారు. 57 ఏళ్ల మేరీల్యాండ్ నివాసి డేవిడ్ బెన్నెట్ ప్రాణాంతక అరిథ్మియాతో బాధపడుతుండడం, వేరొక దాత నుంచి గుండె మార్పిడికి నిబంధనలు అంగీకరించకపోవడం ఈ కొత్త ఆవిష్కరణకు దారితీశాయి. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వైద్యులు  గత శుక్రవారం ఈ శస్త్రచికిత్సను నిర్వహించారు. రోగి చక్కగా కోలుకుంటున్నట్టు వైద్యులు ప్రకటించారు. చికిత్సకు ముందు అతడ్ని హార్ట్-లంగ్ బైపాస్ మెషిన్ పై ఉంచారు. ఇప్పటికీ ఆ మెషిన్ ను తొలగించలేదు. రికవరీ బాగుండడంతో నేడు ఆ మెషిన్ ను తొలగిస్తారు.

అయితే పంది జన్యువులను మనిషి జన్యులుగా మార్చే పద్దతికి మొదట శ్రీకారం చుట్టిన వైద్యులు.. ఈ విధంగా పంది గుండె వేగాన్ని కూడా నియంత్రించి.. మనిషి గుండె స్థాయికి తీసుకువచ్చారని చెప్పారు. సాధారణంగా పంది గుండెను మనిషికి అమర్చితే అది తిరస్కరిస్తుందని.. కాగా జన్యుపరంగా మార్పిడి చేయడం కారణంగా ఎలాంటి తిరస్కరణ లేకుండా విజయవంతంగా అమర్చగలిగామని వైద్యులు తెలిపారు. ఇది సాధారణ పనితీరు చూపిస్తూ పల్స్ ను జనరేట్ చేస్తున్నట్టు వైద్యులు ప్రకటించారు. ఇప్పటి వరకు రోగి శరీరం గుండెను తిరస్కరిస్తున్న సంకేతాలు ఏవీ కనిపించలేదని చెప్పారు.

‘‘చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం. ప్రపంచంలో నిర్వహించిన ఈ తొలి సర్జరీ భవిష్యత్తులో రోగులకు ఎంతో కీలకమైన ఆప్షన్ అవుతుందన్న ఆశాభావం ఉంది’’ అని ఈ సర్జరీలో ముఖ్య పాత్ర పోషించిన డాక్టర్ బార్ట్ లే గ్రిఫ్ఫిత్ తెలిపారు. గతంలో పంది హార్ట్ వాల్వ్, చర్మాన్ని చికిత్సల కోసం వినియోగించారు. పూర్తిస్థాయి గుండె వినియోగం ఇదే మొదటిసారి. కాగా ఈ సందర్భంగా రోగి డేవిడ్ బెన్నెట్ మాట్లాడుతూ.. తనకు చావు తప్ప వేరే మార్గం లేని పరస్థితి ఏర్పడింది.. ఈ క్రమంలో తనకు చావాలని లేదు. అలాగని ఈ అమరిక తప్ప వేరే మార్గం లేదు. ఇది చీకట్లో బాణం వేయడమని తనకు తెలుసునని, అయినా తాను వైద్యుల నిర్ణయానికి కట్టుబడి వారి సమ్మతి మేరకు నడుచుకున్నానని.. ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో తాను మీడియాతో మాట్లాడుతున్నానని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles