Coronavirus: IndiaRecords 1,94,720 Fresh Covid Cases దేశంలో మళ్లీ కరోనా డేంజర్ బెల్స్.. రెండు లక్షలకు చేరువలో కేసులు

India logs 1 94 lakh new covid 19 cases 11 5 positivity rate omicron tally reaches 3 071

Coronavirus, Covid, Covid vaccine, First Omicron death in India, Omicron death in Maharashtra, first omicron death in pune, Covid vaccine registration, omicron, covid cases in india, omicron virus, corona cases in india, corona update, coronavirus india, omicron symptoms, covid cases in bangalore, corona update in india, lockdown news, coronavirus news, norovirus, karnataka news, india coronavirus, coronavirus in india, covid cases in india in last 24 hours today, omicron, Omicron variant, omicron variant covid, New variant Omicron, omicron virus, omicron virus symptoms, omicron virus variant, omicron virus india, omicron virus variant, Covid guidelines

India logged 1,94,720 lakh new coronavirus infections taking the total tally of COVID-19 cases in India to 3,60,70,510, of which 4,868 cases are of the Omicron variant, according to the Union Health Ministry data updated today. The active cases rose to 9,55,319, the highest in 209 days, while the death count climbed to 4,84,655 with 442 fresh fatalities.

దేశంలో మళ్లీ కరోనా డేంజర్ బెల్స్.. రెండు లక్షలకు చేరువలో కేసులు

Posted: 01/12/2022 10:34 AM IST
India logs 1 94 lakh new covid 19 cases 11 5 positivity rate omicron tally reaches 3 071

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ తో కూడిన మూడవ దశ డేంజర్ బెల్స్ మ్రోగిస్తోంది. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తిచెందుతున్నది. దీంతో మహమ్మారి బారినపడుతున్నవారి సంఖ్య రోజురోజుకు అధికమవుతున్నది. ఈ క్రమంలో దేశంలో రోజువారీ కేసుల రెండు లక్షలకు చేరువయ్యాయి. మంగళవారం నాటి కేసుల కంటే ఇవి 15.8 శాతం అధికమని అధికారులు తెలిపారు. అదేవిధంగా యాక్టివ్‌ కేసులు కూడా 9 లక్షలు దాటడంతో ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 1,94,720 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

దీంతో మొత్తం కేసులు 3,60,70,510కి చేరాయి. ఇందులో 3,46,30,536 మంది కోలుకున్నారు. మరో 9,55,319 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 4,84,655 మంది బాధితులు మరణించారు. కాగా, మంగళవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 442 మంది మృతిచెందగా, 60,405 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 11.05కు చేరిందని తెలిపింది. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు దేశంలో నానాటికి పెరుగుతున్నాయి. దీంతో రెండు వారాల వ్యవధిలో రోజువారీ కేసులు రెండు లక్షలకు చేరువయ్యాయి. ఈ నేపథ్యంలో దేశంలోని 120 జిల్లాల్లో 10 శాతానికిపైగా పాజిటివ్‌ కేసులు రికార్డవుతున్నాయని కేంద్ర గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

దేశంలో ఇప్పటివరకు 4868 కేసులు నమోదయ్యాయి. 1805 మంది డిశ్చార్జీ అయ్యారు. మహారాష్ట్రలో అత్యధికంగా 1247 కేసులు ఉండగా, రాజస్థాన్‌లో 645, ఢిల్లీ 545, కర్ణాటక 479, కేరళ 350, ఉత్తరప్రదేశ్‌ 275 చొప్పున ఒమిక్రాన్‌ బాధితులు ఉన్నారు. దేశంలోని 120 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 10 శాతానికి పెరిగిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. డిసెంబర్‌ 24 నాటి గణాంకాల ప్రకారం రెండు జిల్లాల్లో మాత్రమే ప్రతి వంద మందిలో పది మందికి పాజిటివ్‌ వచ్చింది. జనవరి 6 నాటికి ఈ సంఖ్య 17 రాష్ట్రాల్లోని 41 జిల్లాలకు పెరిగింది. ప్రస్తుతం 120 జిల్లాల్లో 10 శాతానికిపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయని గణాంకాల ద్వారా తెలుస్తున్నది.

ఇక ఇటు తెలంగాణలోనూ కరోనా కేసులు వేగాన్ని అందుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా నమోదైన కరోనా కేసుల సంఖ్య రెండు వేల మార్కును చేరుకోగా, పాజిటివిటీ రేటు 2.30 శాతానికి పెరిగింది. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,97,775కు చేరుకుంది. కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే 1015 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో గత 24 గంటల వ్యవధిలో మొత్తంగా 1920 కొత్త కేసులు నమోదుకాగా, ఇద్దరు వ్యక్తులు కరోనా బారిన పడి మరణించారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మృతుల సంఖ్య 4,045కి చేరింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 209, రంగారెడ్డి జిల్లాలో 159, హనుమకొండ జిల్లాలో 55 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో మూడేసి చొప్పున కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles