After minister, 3 more MLAs quit BJP in Uttar Pradesh ఉత్తర్ ప్రదేశ్ బీజేపికి మంత్రి సహా నలుగురు ఎమ్మెల్యేల షాక్

Up elections swami prasad maurya resigns from yogi cabinet expected to join sp

Uttar Pradesh labour minister Swami Prasad Maurya, UP labour minister Swami Prasad Maurya, uttar pradesh polls, uttar pradesh election, swami prasad maurya, bjp, samajwadi party, uttar Pradesh politics, Tilhar MLA Roshan Lal Verma, Bilhaur MLA Bhagwati Prasad Sagar, Tindwari MLA Brajesh Prajapati, Congress, BJP, AAP, SP, BSP, SAP, Assembly Elections, Uttar Pradesh, Politics

After Uttar Pradesh labour minister Swami Prasad Maurya resigned from the Cabinet and the BJP on Tuesday, three other BJP MLAs in the state followed suit and quit the party. This includes Tilhar MLA Roshan Lal Verma, Bilhaur MLA Bhagwati Prasad Sagar and Tindwari MLA Brajesh Prajapati.

నిన్న గోవా.. ఇవాళ ఉత్తర్ ప్రదేశ్.. బీజేపికి మంత్రి సహా నలుగురు ఎమ్మెల్యేల షాక్

Posted: 01/11/2022 05:33 PM IST
Up elections swami prasad maurya resigns from yogi cabinet expected to join sp

దేశంలో ఎన్నికల వేడి రాజుకుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఓ వైపు అధికార బీజేపికి దెబ్బ మీద దెబ్బ తాకుతున్నాయి.. నిన్న ఏకంగా గోవాకు చెందిన బీజేపి మంత్రి తన పదవికి, ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి.. కాంగ్రెస్ లో చేరేందుకు మార్గం సుగమం చేసుకోగా ఆయన వెంట ఒకరు అంతకుముందు ఇద్దరు ఎమ్మెల్యేకు కూడా అదే బాటన నడిచిన విషయం తెలిసిందే. ఇదిలా వుండగా, ఉత్తర్ ప్రదేశ్ లో మరోమారు యోగి అదిత్యనాథ్ ప్రభుత్వం పీఠాన్ని అధిరోహించడం ఖాయమని బీజేపి నేతలతో పాటు సర్వేలు కూడా చెబుతున్నా.. ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మాత్రం ఆ నిజాలను అంగీకరించడం లేదు.

ఈ సారి రాష్ట్రంలో మళ్లీ సమాజ్ వాదీ పార్టీయే అధికారంలోకి వస్తుందని ఆయన విశ్వసిస్తున్నట్లు వున్నారు. 2024లో జరగబోయే లోక్ సభ ఎన్నికలకు ఈ ఎలెక్షన్స్ ను సెమీఫైనల్స్ గా భావిస్తున్న తరుణంలో బీజేపికి కార్మికశాఖ మంత్రితో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు అదే బాటలో పయనించేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. ఈ క్రమంలో వారు బీజేపి పార్టీకి రాజీనామా చేయడంతో ఆ పార్టీకి తేరుకోలేని దెబ్బ తగిలింది. మౌర్యకు ఓబీసీ నేతగా యూపీలో ఎంతో గుర్తింపు ఉంది. పూర్వాంచల్ ప్రాంతంలోని పద్రౌనా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మౌర్య ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా నెగ్గారు. యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్ లో కార్మిక, ఉపాధి సమన్వయ శాఖ మంత్రిగా వ్యవహరించారు.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏకంగా మంత్రి రాజీనామా చేయడం, ప్రధాన ప్రత్యర్థి పక్షం సమాజ్ వాదీ పార్టీలో చేరడం బీజేపీకి తీవ్ర నష్టం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని బీజేపి.. దళితులకు ప్రాధన్యం ఇవ్వడం లేదని అరోపించారు. పార్టీ బిసిలతో పాటు దళితులను కూడా కేవలం ఓట్ల కోసం వాడుకుని తరువాత అణిచివేస్తోందని అరోపించారు. బీజేపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా దళితవర్గాలపై దాడులు అధికమయ్యాయని అన్నారు. ఇక మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య బాటలోనే ముగ్గరు ఎమ్మెల్యేలు కూడా పయనించారు. తిహార్ ఎమ్మెల్యే రోషన్ లాల్ వర్మ, బిల్హౌర్ ఎమ్మెల్యే బ్రిజేష్ ప్రజాపతి, తింద్వారీ ఎమ్మెల్యే భగవతి సాగర్ కూడా తమ పదవులకు రాజీనామా చేశారు.

బిసీలను, దళితులతో పాటు యోగీ అధిత్యనాథ్ ప్రభుత్వం యువతను, రైతులను కూడా విస్మరించిందని.. ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందో కూడా అర్థంకానీ పరిస్థితులు నెలకొన్నాయని ఆయన అరోపించారు. మౌర్య రాజీనామా ప్రకటన చేసిన కొద్దిసేపటికే సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సోషల్ మీడియాలో స్పందించారు. మౌర్యతో కలిసున్న ఫొటో పంచుకున్నారు. సామాజికనేతకు సాదరస్వాగతం అంటూ పార్టీలో చేరికను ప్రకటించారు. ముగ్గురు ఎమ్మెల్యేలు సైతం సమాజ్ వాదీ తీర్థం పుచ్చుకున్నట్టు తెలుస్తోంది.కాగా, మౌర్య కుమార్తె సంఘమిత్ర బీజేపీ ఎంపీ. ఆమె బదౌన్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles