Kotak plans legal action over BharatPe founder భారత్ పే వ్యవస్థాపకుడిపై కోటక్ మహీంద్రా లీగల్ చర్యలు..

Abusive call kotak plans legal action against fintech firm founder

BharatPe, Ashneer Grover, fintech firm founder, Kotak Mahindra Bank, Kotak Wealth Management, Ultra High Networth Individuals, Kotak Mahindra Group, initial public offering, IPO, IPO latest news, Nykaa, Crime

The dispute between BharatPe founder Ashneer Grover and Kotak Mahindra Bank over IPO financing escalated sharply, with the bank’s wealth management unit pledging to pursue legal action over Grover’s use of abusive language and threats.

నోటి దురుసు: భారత్ పే వ్యవస్థాపకుడిపై కోటక్ మహీంద్రా లీగల్ చర్యలు..

Posted: 01/10/2022 08:31 PM IST
Abusive call kotak plans legal action against fintech firm founder

భార‌త్‌పే స‌హ‌-వ్య‌వ‌స్థాప‌కుడు- మేనేజింగ్ డైరెక్ట‌ర్ అశ్‌నీర్ గ్రోవ‌ర్ దంప‌తుల‌కు, ప్ర‌ముఖ ప్రైవేట్ బ్యాంక్ కొట‌క్ మ‌హీంద్రా బ్యాంక్ మ‌ధ్య వివాదం ముదురుతున్న‌ది. అశ్‌నీర్ గ్రోవ‌ర్‌, ఆయన స‌తీమ‌ణి మాధురిల‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌ముఖ ప్రైవేట్ బ్యాంక్ కొట‌క్ మ‌హీంద్రా బ్యాంక్ ప్ర‌క‌టించింది. అశ్‌నీర్ దంప‌తులు త‌మ బ్యాంకు రిలేష‌న్‌షిప్ మేనేజ‌ర్‌ను దుర్భాష‌లాడార‌ని కొట‌క్ మ‌హీంద్రా బ్యాంక్ అన్న‌ట్లు మీడియాలో వార్త‌లొచ్చాయి. త‌మ ఉద్యోగుల ప‌ట్ల గ్రోవ‌ర్ వాడిన భాష‌పై అభ్యంత‌రం తెలిపింది. దీనికి సంబంధించి త‌గిన న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వెల్ల‌డించింది.

ముందుగా చేసుకున్న ఒప్పందం మేర‌కు స‌కాలంలో నిధులు స‌మ‌కూర్చ‌డంలో విఫ‌ల‌మైంద‌ని, నైకా ఐపీవోలో షేర్లు కేటాయించ‌లేద‌ని కొట‌క్ మ‌హీంద్రా బ్యాంకు ఉద్యోగుల‌ను అశ్‌నీర్ దంప‌తులు దూషించిన ఆడియో క్లిప్‌ గ‌త‌వారం వైర‌లైంది. గ‌త అక్టోబ‌ర్ 30న త‌మ‌కు అశ్‌నీర్ గ్రోవ‌ర్ దంప‌తులు లీగ‌ల్ నోటీస్ పంపార‌ని, న‌ష్ట ప‌రిహారం కింద రూ.500 కోట్లు చెల్లించాల‌ని కోరార‌న్న‌ది. అయితే, స‌రైన స‌మ‌యంలో ఆ లీగ‌ల్ నోటీసుకు జ‌వాబు ఇస్తామ‌ని కొట‌క్ మ‌హీంద్రా బ్యాంక్ తెలిపింది. అయితే, ఆ వీడియో ఫేక్ అని అశ్‌నీర్ గ్రోవ‌ర్ వాదిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles