Rock wall falls on boaters on Brazilian lake, killing 7 భయానక వీడియో: పర్యాటకులు పడవపై విరిగిపడ్డ కొండచరియ..

Canyon wall collapses and falls onto tourist boats in brazil killing ten people

Canyon Wall, Canyon Wall collapsed, Canyon Wall killed 6 tourists, Canyon Wall collapsed on motorboats, brazil canyon wall, tourist boats, viral video

At least seven people have died and three others are missing after a huge slab of rock fell from a cliff face onto tourist boats on a lake in Brazil. A further 32 people were injured, nine of them seriously, after a canyon wall plunged into the water and onto motorboats on Furnas lake in Capitolio, Minas Gerais state.

ITEMVIDEOS: భయానక వీడియో: పర్యాటకులు పడవపై విరిగిపడ్డ కొండచరియ..

Posted: 01/10/2022 07:49 PM IST
Canyon wall collapses and falls onto tourist boats in brazil killing ten people

ప్రకృతిని అస్వాదిద్దామని వెళ్లిన పర్యాటకుల‌ పాలిట ఆ కొండ మృతువుగా మారింది. వాటర్ పాల్స్ పక్కనే వున్న కొలనులో పడవలతో వెళ్తున్న వారిపై పగబట్టినట్టు పెద్ద కొండ చరియ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘ‌ట‌నలో ఆరుగురు పర్యటకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరు అసుపత్రిలో చికిత్స పోందుతూ మరణించారు. అనేక మందికి గాయాలు కాగా.. ముగ్గురు గల్లంతయ్యారు. పర్యాటకులపై ప్రకృతి పగబట్టిన ఘ‌ట‌న బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. కొలనులో విహరిస్తున్న తమవారిని మరో పడవలో ప్రయాణిస్తున్న ఓ పర్యాటకుడు వీడియో తీస్తున్న సందర్భంలో ఈ ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది.

ఆ వెంటనే పర్యాటకుల హారాకారాలు వినిపించాయి. పెద్ద కొండచరియ విరిగిపటడంతో ఒక్కసారిగా కొలనులోని నీళ్లు కూడా ఉవ్వెత్తున్న ఎగసి పడ్డాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పర్యాటకులు నెట్టింట్లో అప్ లోడ్ చేయడంతో అదికాస్తా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. బ్రెజిల్‌లోని ఓ చెరువులో టూరిస్టుల‌తో కొన్ని చిన్న మోట‌ర్ బోట్స్ వాట‌ర్‌ఫాల్ స‌మీపం నుంచి వెళ్తున్నాయి. ఇంత‌లో ప‌క్క‌నే ఉన్న పెద్ద కొండ నుంచి కొంత భాగం ప‌గిలిపోయి.. కింద‌నే ఉన్న రెండు బోట్ల మీద ప‌డింది. దీంతో అక్క‌డిక‌క్క‌డే ఆరుగురు టూరిస్టులు మృతి చెందారు.

మ‌రో 30 మంది టూరిస్టులు గాయ‌ప‌డ్డారు. మ‌రో 20 మంది టూరిస్టులు చెరువులో గ‌ల్లంత‌య్యారు. వాట‌ర్ ఫాల్, ప‌క్క‌నే చెరువు.. ఉండ‌టంతో దాన్ని టూరిస్ట్ స్పాట్‌గామార్చారు. ఇది బ్రెజిల్‌లోని సావో పాలోలో ఉంది. ఈ చెరువు దాదాపు 418 కిలోమీట‌ర్లు విస్త‌రించి ఉంది. ఈ ఘ‌ట‌న‌ను మ‌రో ప‌డ‌వ‌లో వెళ్తున్న వారు వీడియో తీశారు. ఆ వీడియోను సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేయ‌గా.. అది ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. నెటిజ‌న్లు ఆ వీడియో చూసి షాక్ అవుతున్నారు. ఎవ్వ‌రూ ఊహించ‌ని ప్ర‌మాదం ఇది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles