Sex racket busted, seven arrested in Kottayam కేరళలో సెక్స్ రాకెట్: నిసిగ్గుగా భార్యల మార్పిడి..

Kerala police arrest seven people involved in partner swapping sex racket

wife swapping, kottayam, sex racket, partner swapping, couple swapping, couple sex racket, Partner Swapping in Kerala, wife swapping in Kerala, kerala sex racket, kottayam sex racket, karukachal police, kerala, Crime

The Kerala Police arrested seven people belonging to a racket that allegedly exchanged partners for sex. Police suspect the involvement of over 1,000 couples. The arrests came after a woman lodged a complaint with the Karukachal police against her husband who was forcing her to have sexual relationship with other men.

కేరళలో పెద్ద సెక్స్ రాకెట్.. నిసిగ్గుగా భార్యల మార్పిడితో శృంగారం..

Posted: 01/10/2022 05:13 PM IST
Kerala police arrest seven people involved in partner swapping sex racket

దేవుడి సోంత రాష్ట్రంలో కేరళలలో ఓ భార్య తన భర్తపై ఇచ్చిన ఫిర్యాదుతో అత్యంత దారుణమైన పోకడలు బయట పడుతున్నాయి. తమ ఇంటి ఇల్లాలి వైపు కన్నెత్తి చూస్తేనే సహించని భర్తలు పుట్టిన పురటిగడ్డలో.. వేదమంత్రోచ్చరణల మధ్య పంచభూతాల సాక్షిగా ఒక్కటైన తమ జీవిత భాగస్వాములను వేరేవారికి అప్పగించి.. ఇతరుల సతీమణులతో లైంగిక సుఖాన్ని పొందాలనుకునే భావజాలం క్రమంగా విస్తరిస్తోంది. బలవంత పెట్టి మరీ భార్యలను ఇందుకు ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది నచ్చని ఓ బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా.. ఏడుగురిని అరెస్ట్ చేశారు.

తన భర్త.. మరో పురుషుడితో లైంగిక సంబంధానికి బలవంతం చేస్తున్నాడంటూ.. ఇది తనకు ఇష్టంలేదని చెప్పినా.. ఆత్మహత్యకు పాల్పడతానని బెదిరింపులకు దిగుతున్నాడని ఓ బాధితురాలు కేరళలోని కురుకచల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా ఇప్పటికే తనను తొమ్మిది మందితో లైంగిక సంబంధం పెట్టుకునేలా చేశాడని అమె అరోపించింది. దీంతో తనకు ఇష్టం లేకున్నా తనపై అత్యాచారం చేసిన వారిలో ఐదుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. కాగా అమెతో లైంగిక సంబంధం పెట్టుకున్న మిగిలిన వ్యక్తలు పరారీలో వున్నారని, వారిలో ఒకరు విదేశాలకు కూడా వెళ్లిపోయాడని తెలిపింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసులో కీలకమైన ఏడుగురిని అరెస్టుచేశారు. అయితే తీగ లాగుతున్న కొద్దీ డొంక కదులుతోందని. ఈ కేసులో ఏకంగా వెయ్యికిపైగా జంటలు ఉన్నాయని పోలీసుల దర్యాప్తులో తెలింది. దీంతో దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు ఈ కేసులు పలువురు బడాబాబుల ప్రమేయం కూడా ఉన్నారని సమాచారం. గతంలో కయంకులమ్ లోనూ ఈ తరహా కేసులు వెలుగు చూశాయి. సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల  సాయంతో ఒక గ్రూపు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్ బుక్ లలో గ్రూపులు ఏర్పాటు చేసి, వీటి ద్వారా సభ్యుల మధ్య అనుసంధానత కల్పిస్తున్నారు.

తమకు ఫిర్యాదు చేసిన బాధితురాలి భర్తను అరెస్ట్ చేశామని, దీని వెనుక పెద్ద ముఠానే ఉందని చంగన్ చెర్రి డీఎస్పీ ఆర్.శ్రీకుమార్ తెలిపారు. సామాజిక మాధ్యమ గ్రూపుల ద్వారా నడుస్తున్న భాగస్వాముల మార్పిడి ముఠాలో సుమారు 1,000 మంది వరకు ఉంటారని పోలీసులు చెబుతున్నారు. ఇందులో ఉన్నత కుటుంబాల వారు కూడా ఉన్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో 25 మందిపై నిఘా ఉంచారు. మరింత మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : wife swapping  kottayam  sex racket  couple sex racket  partner swapping  karukachal police  kerala  Crime  

Other Articles