Is your mask good enough to stop Omicron attack? ఒమిక్రాన్ సోకకుండా మీ క్లాత్ మాస్క్ అపగలదా.?

Can your cloth mask stop the omicron variant of coronavirus

covid 19, Omicron, covid-19, face mask, cloth mask effectivity, N95 masks, what is N95 mask, N95 mask cost, science news, Omicron India, omicron variant symptoms, iit kanpur, india, south africa, corona, iit professor, scientist, manindra agarwal, election ralies, super spreaders, delta variant, covid 19, omicron symptoms, omicron virus symptoms, omicron variant symptoms and severity, omicron variant symptoms in india, omicron variant symptoms in adults, omicron variant in india, omicron covid cases, latest news on omicron variant, covid 19 new variant omicron symptoms, new covid variant

With cases surging uncontrollably and the world now in the third wave of the coronavirus pandemic led by the Omicron variant, healthcare experts and scientists have pointed out that the cloth masks that we normally use to protect from catching the virus may not be that successful.

ఒమిక్రాన్ సోకకుండా మీ క్లాత్ మాస్క్ అపగలదా.? ఇలా ధరిస్తే..!

Posted: 01/06/2022 07:02 PM IST
Can your cloth mask stop the omicron variant of coronavirus

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరగుతున్న క్రమంలో సంక్రాంతి నాటికి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తో కూడా మూడవ దశ ప్రారంభం అవుతుందని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలోని ప్రతీ ఒక్కరినీ ఈ వేరియంట్ ప్రభావితం చేస్తుందని కూడా వైద్యనిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ భద్రతా ప్రమాణాలను పాటించాలని కూడా సూచిస్తున్నారు. అయితే మనలోని అనేక మంది క్లాత్ మాస్కులను కూడా వాడుతున్నారు. అయితే సింగిల్ లేయర్ వున్న క్లాత్ మాస్కుల వల్ల ఎలాంటి ప్రయోజనం (రక్షణ) చేకూరదని చెప్పిన వైద్య నిపుణులు అందుకు కూడా మార్గదర్శకాలను విడుదల చేశారు.

ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందతున్న తరుణంలో ప్రజలందరూ ఇప్పుడు మాస్కులు ధరించేందుకు సిద్దమవుతున్నారు. అయితే కొందరు సర్జికల్ డిస్పోజబుల్ మాస్కులు చౌకగా లభిస్తుండడంతో వాటిని కూడా చాలా మంది వినియోగిస్తున్నారు. కొద్ది మంది ఎన్95 తరహా మాస్కులు ధరిస్తున్నారు. ఇంకోందరు మెడికల్ షాపుల్లో లభించే నాణ్యతయుతమైన మాస్కులను ధరిస్తున్నారు. కానీ, క్లాత్ మాస్క్ లు ధరించే వారు ఒకసారి పునరాలోచన చేయాల్సివుంది. వీటితో పూర్తి రక్షణ ఉండదని ఇప్పటికే నిపుణులు చెబుతున్నారు. ఈ మాస్కులు ధరించినా కరోనా వైరస్ ప్రవేశిస్తుందని చెబుతున్నారు.

అయితే కనీసం రెండు మూడు లేయర్ల ఫేస్ మాస్క్ ను అయినా ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. అప్పుడే సూక్ష్మ గాలి తుంపర్లు మాస్క్ నుంచి రాకుండా ఉంటాయని, వైరస్ వ్యాప్తిలోకి వెళ్లకుండా నివారించడం సాధ్యపడుతుందని భావిస్తున్నారు. సర్జికల్ మాస్క్ తో కలిపి ఒక్క లేయర్ ఉన్న క్లాత్ మాస్క్ ను వాడుకోవచ్చని సూచిస్తున్నారు. లేదంటే రెస్పిరేటరీ మాస్కులు ధరించడం మంచిదని పేర్కొంటున్నారు. అప్పుడే ఒమిక్రాన్ నుంచి రక్షణ కల్పించుకోవచ్చని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఒక్క లేయర్ ఉన్న క్లాత్ మాస్క్ లు పెద్ద గాలి తుంపర్లను సమర్థంగా అడ్డుకోగలవే కానీ, ఒమిక్రాన్ రకంలో మాదిరి సూక్ష్మ తుంపర్లను నిలువరించలేవని చెబుతున్నారు.

రెండేళ్ల వయసుకు మించిన ప్రతి ఒక్కరూ ఇళ్లల్లోనూ మాస్కులు ధరించాలని అమెరికాకు చెందిన వ్యాధుల నియంత్రణ, నిరోధక విభాగం (సీడీసీ) సూచించింది. ‘‘ఒకటికి మించి ఎక్కువ లేయర్లతో కూడిన క్లాత్ మాస్కు కింద డిస్పోసబుల్ మాస్కు ధరించండి. పైన పెట్టే మాస్కు కింది మాస్కు పైనుంచి గడ్డం దిగువ భాగాన్ని కవర్ చేసే విధంగా ఉండాలి’’ అని సీడీసీ సూచించింది. తిరిగి వినియోగించడానికి పనికొచ్చే (రీయూజబుల్) మాస్కులను రోజుకు ఒకసారి అయినా శుభ్రం చేసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేసింది. డిస్పోజబుల్ మాస్క్ అయితే ఒక పర్యాయం వాడిన తర్వాత పడేసేయాలని సూచించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles