Covid third wave: comming 4 weeks are crucial: Health Dept ధర్డ్ వేవ్ ప్రారంభమైంది: వచ్చే 4 వారాలు కీలకం: శ్రీనివాస రావు

Covid 19 third wave started in telangana comming 4 weeks are crucial health dept

Omicron telangana, Telangana omicron third wave, Third wave india, Third wave india omicron, Omicron telangana, G Srinivas rao, Omicron in telangana, covid third wave, Omicron cases, Public Health Director, G Srinivas rao, spike in corona cases, new year, pongal celebrations, covid-19, telangana

Amid an exponential surge in Covid cases due to Omicron, Telangana Director of Public Health G Srinivasa Rao remarked on Thursday that the next four weeks are critical. He advised everyone to be cautious.

ధర్డ్ వేవ్ ప్రారంభమైంది.. కోవిడ్ ప్రమాణాలు పాటించండీ: శ్రీనివాస రావు

Posted: 01/06/2022 08:20 PM IST
Covid 19 third wave started in telangana comming 4 weeks are crucial health dept

తెలంగాణ‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల్లో కూడా క‌రోనా కేసులు పెరుగుతున్నాయ‌ని ఇది రాష్ట్రాలతో పాటు దేశంలోనూ ధర్డ్ వేవ్ ప్రారంభమయ్యిందని చెప్పడానికి సంకేతమని తెలంగాణ ప్రజారోగ్యశాఖ డైరెక్ట‌ర్ జి.శ్రీనివాసరావు అన్నారు. ఈ రోజు ఆయ‌న హైద‌రాబాద్‌లో మీడియా స‌మావేశం నిర్వ‌హించి రాష్ట్రంలో కొనసాగుతున్న క‌రోనా ఉద్దృతిపై మాట్లాడారు. రాష్ట్రంలో నమోదవుతున్న కరోనాకేసుల్లో 70 శాతం ఒమిక్రాన్ బాధితులే ఉంటారని చెప్పారు. అయితే, అందరికీ జీనోమ్ సీక్వెన్స్ చేయడం సాధ్యం కాకపోవడంతో కొందరి నుంచి మాత్రమే నమూనాలను తీసుకుని జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపుతున్నట్లు చెప్పారు.

ఇప్పటికే ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి మొదలైందని అన్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే యోచన లేదని, పేదల బతుకు దెరువు చాలా ముఖ్యమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. అయితే రానున్న 4 వారాలు కీలకమని, ఫిబ్రవరి మధ్యలో కేసులు తగ్గే అవకాశం ఉందని చెప్పారు. టీకాలు తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని ఆయన సూచించారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు. లక్షణాలుంటే సొంత వైద్యం చేసుకోవద్దని, వైద్యుల వద్దకు వెళ్లాలని సూచించారు.

కరోనా మూడో వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. 2 కోట్ల కరోనా టెస్ట్ కిట్లతో పాటు కోటికిపైగా హోం ఐసోలేషన్ కిట్లను సిద్ధంగా ఉంచామన్నారు. జనవరి 1 నుంచే రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు. ఐదురోజులుగా 4 రెట్లకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయని అన్నారు. పాజిటివిటీ రేటు 3 శాతానికిపైగా ఉందన్నారు. కరోనా పేషెంట్లలో జలుబు, స్వల్ప జ్వరం, తీవ్ర తలనొప్పి వంటి కొన్ని లక్షణాలే ఉన్నాయన్నారు. ఒమిక్రాన్‌ కరోనా వేరియంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతోందని దీని బారిన పడకుండా నాలుగు వారాలు ప్రజలు అత్యవసరమైన పనులుంటే తప్ప బయటకు రాకూడదని ఆయన సూచించారు.

డెల్టా వేరియంట్‌ కంటే 30 రెట్ల వేగంతో ఒమిక్రాన్‌ వ్యాప్తి ఉందని, అయితే కేసుల పెరుగుదలపై ప్రజలు అప్ర‌మ‌త్తంగా ఉండాలి కానీ, భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. వ్యాధి కన్నా అది సోకిందన్న భయమే మనిషిని విషమ పరిస్థితుల్లోకి నెడుతుందని అన్నారు. దేశంలో తొలి ద‌శ‌, రెండో ద‌శలో క‌రోనా విజృంభ‌ణ స‌మ‌యంలో నేర్చుకున్న పాఠాలతో ప్రభుత్వం, వైద్యారోగ్యశాఖ సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రజ‌లు మాస్క్ ధరించాలని, అంద‌రూ వ్యాక్సిన్‌ తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు. వాటి ద్వారానే ఒమిక్రాన్‌ నుంచి రక్షించుకోవచ్చని తెలిపారు. వాక్సీన్ తీసుకోనివారు ఇప్పటికైనా టీకాను తీసుకుని ఒమిక్రాన్ తో కూడిన ధర్డ్ వేవ్ నుంచి రక్షణ పోందాలని ఆయన కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles