Ex-minister sent to 15-day judicial custody తమిళనాడు మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీ అరెస్టు..

Ex aiadmk minister rajendra balaji sent to 15 day judicial custody

Rajendra Balaji, Tamil Nadu former Minister, AIADMK Minister, Ex Minister, judicial custody, misappropriating funds, siphoning off Rs 3 cr, Aavin, AIADMK, Virudhanagar District Court, Tamil Nadu, Politics, Crime

Former AIADMK Minister Rajendra Balaji, who was arrested last night from Hassan district in Karnataka on charges of misappropriating funds from Aavin, has been remanded to 15-day judicial custody on Thursday by Virudhanagar District Court. He was arrested on charges of siphoning off Rs 3 crore from Aavin during his tenure as state dairy minister.

తమిళనాడు మాజీమంత్రి రాజేంద్ర బాలాజీ అరెస్ట్.. ‘సుప్రీం’లో మద్దతుదారులకు ఊరట

Posted: 01/06/2022 05:11 PM IST
Ex aiadmk minister rajendra balaji sent to 15 day judicial custody

తమిళనాడు పాడిపరిశ్రమశాఖ మంత్రిగా సేవలందించిన అన్నాడిఎంకే మాజీమంత్రి రాజేంద్ర బాలాజీని ఆ రాష్ట్ర పోలీసులు కర్ణాటకలో అరెస్టు చేశారు. నాటకీయ పరిణామాల మధ్య కొనసాగిన ఈ అరెస్టు తరువాత ట్రాన్సిట్ వారెంటుపై ఆయనను తమిళనాడుకు తరలించారు. అయితే గత కొన్నాళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ఆయన తనను పోలీసులు అరెస్టు చేస్తారని తప్పించుకు తిరుగుతున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. పాడిపరిశ్రమకు చెందిన నిధుల ధుర్వినియోగంతో పాటు పలువురు నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పిస్తానని చెప్పిన ఆయన కోట్ల రూపాయలను మోసగించినట్లు అభియోగాలు ఎదర్కోంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై గతేడాది నవంబర్ 15న కేసు నమోదైంది.

పోలీసులు అరెస్టు చేయకుండా ఉండేందుకు గతంలో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయన పిటిషన్‌ను విచారించిన మద్రాసు హైకోర్టు బెయిల్ పిటీషన్ ను రాష్ట్రోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉండడంతో రాజేంద్ర బాలాజీ తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్లాడు. రాష్ట్రం వదిలి కర్ణాటకకు వెళ్లి అక్కడ అజ్ఞాతంలో వున్నారు. దీంతో కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రిగా కోనసాగిన సమయంలో ఆయన రూ.3కోట్ల 10లక్షలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆరు గంటల పాటు ఆయనను ప్రశ్నించిన మీదట.. వైద్య పరీక్షలు నిర్వహించి  విరుదునగర్ జిల్లా కోర్టులో హాజరుపర్చారు. దీంతో జిల్లా కోర్టు ఆయనకు పక్షం రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కు పంపింది.

20 రోజులకు పైగా పోలీసులు అతని కోసం వెతుకుతున్న అనంతరం నిన్న ఉదయం కర్ణాటకలోని హాసన్ లో దాగివున్నట్లు పక్కా సమాచారంతో వెళ్లిన తమిళనాడు పోలీసులు అక్కడి పోలీసుల సహకారంతో అరెస్టు చేశారు. ఆయన తన కారును డ్రైవింగ్ చేస్తుండగా పోలీసులు చుట్టుముట్టారు. రాజేంద్ర బాలాజీతో పాటు ఉన్న మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ట్రాన్సిట్ వారెంట్ రావడంతో రాజేంద్ర బాలాజీని అర్ధరాత్రి తమిళనాడుకు తీసుకొచ్చారు. అనంతరం శ్రీవిల్లిపుత్తూరులో ఉంచి 6 గంటలపాటు విచారించిన అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి శ్రీవిల్లిపుత్తూరు కోర్టులో హాజరుపరిచారు. అనంతరం అతడిని 15 రోజుల రిమాండ్‌కు తరలించారు.

అయితే రాజేంద్ర బాలాజీ తన అరెస్టు ఖాయమన్న నిర్థారణ కాగానే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా అది కూడా ఇవాళే కాకతాళీయంగా విచారణకు వచ్చింది. దీంతో రాజేంద్ర బాలాజీ బెయిల్ పిటిషన్ ఇవాళ విచారణకు రావాల్సిన ఆవశ్యకత ఏమిటి? ఆ లోపు ఆయన మద్దతుదారులను ఎందుకు వేధించారు.? ఇది రాజకీయ ప్రేరేపిత కేసునా? అని సుప్రీం న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ ఆరోపణలను వెంటనే కొట్టిపారేసిన తమిళనాడు ప్రభుత్వం.. తమకు ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని పేర్కొంది. దీంతో ఆయన పిటిషన్‌పై విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేశారు. ఈ కేసులో మాజీమంత్రి సహాయకులు బాబూరాజ్, బలరాం, న్యాయవాది ముత్తుపాండియన్‌లను అరెస్టు చేయావద్దని అదేశాలను జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles