Dangerous to suggest that Omicron is mild, says WHO ఒమిక్రాన్ వేరియంట్ జలుబు కాదు.. తేలిగ్గా తీసుకోవద్దు: డబ్యూహెచ్ఓ

Omicron is not the common cold who epidemiologist maria van kerkhove warns

Coronavirus, Covid, Covid vaccine, omicron mild dangerous, WHO covid, World Health Organisation (WHO), WHO's Covid-19 Technical Lead, Maria Van Kerkhove, Common cold, Just a mild disease, dangerous variant, First Omicron death in India, Omicron death in Maharashtra, first omicron death in pune, Covid vaccine registration, omicron, covid cases in india, omicron virus, corona cases in india, corona update, coronavirus india, omicron symptoms

As the world reels under a massive Covid surge, the World Health Organisation (WHO) has said it is dangerous to suggest that Omicron is 'just a mild' disease. Infectious Disease Epidemiologist and WHO's Covid-19 Technical Lead Maria Van Kerkhove said, "Yes, oversimplified narratives can be dangerous. While we see lower risk of hospitalisation compared to Delta, to suggest that Omicron is “just a mild” disease is dangerous.

ఒమిక్రాన్ వేరియంట్ జలుబు కాదు.. తేలిగ్గా తీసుకోవద్దు: డబ్యూహెచ్ఓ

Posted: 01/06/2022 04:10 PM IST
Omicron is not the common cold who epidemiologist maria van kerkhove warns

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి వారం వ్యవధిలో ఐదు రెట్లు పెరిగింది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు ఇప్పటికే దాదాపుగా 2700కి చేరాయి. ఇలా దేశంలో మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. దీనికి న్యూ ఇయర్ వేడుకలు మరింత ఆజ్యం పోసాయని, ఇక సంక్రాంతి పండుగ పర్వదినాలు మరింతగా ఇది ప్రబలే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ లో అంత తీవ్రమైన లక్షణాలు ఏమీ లేవని కథనాలు వస్తుండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్రంగా స్పందించింది. ఒమిక్రాన్ వేరియంట్ ను తేలిగ్గా తీసుకోవద్దని ఇది కూడా ప్రమాదకార మహమ్మారేనని హెచ్చరించింది.

ఒమిక్రాన్ వేరియంట్ ను సాధరణంగా వర్షాకాలంలో సంక్రమించే జలుబులా తీసుకోవాద్దని.. ఇది తేలికపాటి వ్యాధి కాదని వార్నింగ్ ఇచ్చింది. అత్యంత వేగంగా ఒమిక్రాన్‌ వ్యాప్తిచెందుతున్నా.. డెల్టాతో పోలిస్తే వ్యాధి తీవ్రత తక్కువగా ఉండటం కాస్త సానుకూలాంశం. అయితే ఇది సోకినవారిలో తీవ్రమైన లక్షణాలు కనబడకపోవడంతో ఇది తేలికపాటి వ్యాధిలా భావిస్తే మాత్రం అంతకు మించిన ప్రమాదం మరోకటి లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఈ తరహా కథనాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్-19 టెక్నికల్ లీడ్ మరియా వాన్ కేర్ఖోవ్ తీవ్రంగా స్పందించారు. ఆ తరహా కథనాలను అమె తోసిపుచ్చారు.

ఒమిక్రాన్ వ్యాధి తీవ్రత తక్కువ కావడంతో ఆసుపత్రిలో చేరి చికిత్సలు చేయించుకోవాల్సిన అవసరం కూడా తక్కువగానే నమోదవుతోంది. అయితే ఇది తేలికపాటి వ్యాధిగా తీసిసారేసేలా కథనాలు రావడం అందోళన కలిగిస్తోందని అమె అన్నారు. ఈ తరహా కథనాలు ప్రమాదకరమని చెప్పారు. ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో.. ఇళ్లలోని వృద్దులు ఈ వేరియంట్ బారిన పడితే పరిస్థితి తీవ్రంగా ఉండవచ్చునని అమె అందోళన వ్యక్తం చేశారు. ఇక వృద్దులతో ఆసుపత్రులు కూడా నిండిపోవచ్చునన్నారు. అయితే మరణాల రేటు తక్కువగా నమోదు కావడం ద్వారా ఒమిక్రాన్ ను తెలికపాటిదని పరిగణిస్తూ కథనాలు రాయడం సముచితం కాదని అమె అన్నారు.

ఒమిక్రాన్‌ వేరియంట్‌ సహజ సిద్ధ టీకాగా పనిచేస్తోందంటూ వచ్చిన వార్తలను కూడా డబ్ల్యూహెచ్‌వో కొట్టిపారేసిన విషయం తెలిసిందే. అలాంటి ఆలోచన చాలా ప్రమాదకరమని, కొందరు బాధ్యతారహితమైన ప్రజలు ఇటువంటి వాటిని వ్యాప్తి చేస్తున్నారని డబ్ల్యూహెచ్‌వో వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటివి ప్రజల్లో ఆత్మసంతృప్తిని పెంపొందించడమే కాకుండా వైరస్‌ కట్టడిలో నిర్లక్ష్యాన్ని మరింత పెంచుతాయని హెచ్చరించారు. ఒమిక్రాన్‌ వ్యాప్తితో విరుచుకుపడుతోన్న తరుణంలో డబ్ల్యూహెచ్‌వో అన్ని దేశాల ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తోంది. సమూహాలు, సమావేశాల వంటి కార్యక్రమాలపై నిషేధం విధిస్తూ.. కోవిడ్ ప్రోటోకాల్ పాటించేలా చేయాలని సూచిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles