Restrictions on public gatherings: HC on Festive Season క్రిస్టమస్, న్యూఇయర్ వేడుకలపై అంక్షలు విధించండీ: హైకోర్టు

Hc to telangana govt no public gatherings during christmas new year and sankranti

Omicron scare, christmas, New year celebrations, group gathering celebrations, sankranti, kite festivals, omicron, public gatherings in telangana, no public gatherings, new year, sankranti, Covid-19 Norms, Telangana high court news, Omicron, Omicron cases, Omicron latest news, New Year, New Year 2022, New Year celebrations, Sankranti, Omicron, COVID-19, state restrictions covid, omicron restrictions india, omicron state guidelines, omicron state curbs, omicron surges, india omicron booster, omicron variant, coronavirus pandemic, telangana omicron cases, telangana omicron newstelangana, Crime

The Telangana high court on Thursday directed the state government to issue necessary instructions to its official machinery to prevent public gatherings during the ensuing Christmas, New Year and Sankranti festivals. A bench of Chief Justice Satish Chandra Sharma and Justice N Tukaramji was hearing a batch of public interest petitions on Covid-19.

క్రిస్టమస్, సంక్రాంతి, న్యూఇయర్ వేడుకలపై అంక్షలు విధించండీ: హైకోర్టు

Posted: 12/23/2021 02:55 PM IST
Hc to telangana govt no public gatherings during christmas new year and sankranti

కరోనా మహమ్మారి ఒమిక్రాన్ వేరియంట్ శరవేగంగా విస్తరిస్తుందని, డెల్టా వేరియంట్ తో పోల్చితే ఇది ఏకంగా ఆరు రెట్లు అధికంగా వ్యాప్తి చెందుతుందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు దేశ వైద్య నిపుణులు కూడా అంచనా వేశారు. ఇన్నాళ్లు ఇది పెద్దగా ప్రభావం చూపడం లేదని అనుకున్నా ప్రపంచ వ్యాప్తంగా మరణాలు కూడా నమోదవుతున్న క్రమంలో ఇది కూడా అందోళనకర వేరియంటేనని వైద్యనిపుణులు అంచానా వేస్తున్నారు. బ్రిటన్ లో మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండగా, అటు అగ్రరాజ్యం అమెరికా సహా ఇటు ఇజ్రాయిల్ లోనూ మరణాలు నమోదు చేసుకున్నాయి.

ఇటు ఒమిక్రాన్ కేసులు మన దేశంలోనే రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటికే 250 చేరువలో వున్న ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇటు తెలంగాణలోనూ ఒమిక్రాన్ కేసులు గణనీయంగా పెరుగుతుండటం అందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు ఒమిక్రాన్ నేపథ్యంలో పలు చర్యలు తీసుకోవాలని.. ఈ మేరకు అదేశాలను జారీ చేసింది. ఈ మేరకు దాఖలైన పిటీషన్లపై విచారించిన న్యాయస్థానం ప్రభుత్వానికి అదేశాలు జారీ చేసింది. ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో క్రిస్మస్‌, న్యూ ఇయర్‌, సంక్రాంతి వేడుకలపై ఆంక్షలు విధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సమూహంగా జరుపుకునే వేడుకలపై ఆంక్షలను అమలు చేయాలని అదేశాలను జారీ చేసింది. మరీ ముఖ్యంగా ప్రారంభదశలోనూ నియంత్రణ చర్యలు చేపట్టడం చాలా అవసరం అని పేర్కోన్న న్యాయస్థానం ఈ క్రమంలో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలతో పాటు సంక్రాంతి పండగ పర్వదినాలలో జనం గుంపులు గుంపులుగా ఉండకుండా రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించింది. ఈ సందర్భంగా మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాల మాదిరే ఆంక్షలు విధించాలని ఆదేశించింది. ఎయిర్ పోర్ట్ లో ఉన్న విధంగానే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే జనాలకు తగిన పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేయమని ఆదేశించింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles