Anand Mahindra offers Bolero to this Maharashtra man స్ర్కాప్ తో ఫోర్ వీలర్ తయారీ.. ఆనంద్ మహీంద్రా బంఫర్ ఆఫర్.!

Maharashtra man built a 4 wheeler that impressed anand mahindra

Anand Mahindra, Anand Mahindra bolero, Anand Mahindra scrap vehicle, Anand Mahindra tweet, Anand Mahindra latest tweet, Anand Mahindra offer bolero, Dattatraya Lohar, homemade car, scrap metal, YouTube channel, Historicano, Devrashtre village, Maharashtra, viral video

Industrialist Anand Mahindra had shared the video of a man from Maharashtra who built a four-wheeler using scrap metal. He had also expressed his admiration for the ‘more with less’ capabilities of Indians in the caption of the video.

ITEMVIDEOS: స్ర్కాప్ తో ఫోర్ వీలర్ తయారీ.. ఆనంద్ మహీంద్రా బంఫర్ ఆఫర్.!

Posted: 12/22/2021 09:23 PM IST
Maharashtra man built a 4 wheeler that impressed anand mahindra

బిజినెస్ టైకూన్, మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా నిత్యం సామాజిక మాద్యమాల్లో యాక్టివ్ గా ఉంటారు. ఏదేని వీడియోనో, లేదా ఫోటోలు తన అకౌంట్ ద్వారా షేర్ చేసుకుంటూ తన ఫాలోవర్స్ తో ఔరా.. అనిపించేలా చేస్తారు. ఇక తన మదిని గెలుచుకున్న వీడియోలు.. ఫోటోలకు కూడా మంచి క్యాప్షన్ పెట్టి మరీ షేర్ చేస్తారు. ఇక భారత దేశానికి ఎనలేని గుర్తింపును తీసుకువచ్చిన ప్రముఖులకు తన మహీంద్రా కార్లను కానుకలుగా అందించి అందరి మొప్పును కూడా పోందుతుంటారు. ఇక ఆయన మదిని ఎప్పుడు ఏ వీడియో, ఫోటో దోచుకుంటుందోనని ఫాలోవర్లు కూడా కాచుకుని చూస్తుంటారు.

అదేంటి అలా అంటారు.. అంటే ఆయన త్వరగా చలించే హృదయం గల వ్యక్తి. ఈ క్రమంలోనే ఆయన నుంచి సర్ ప్రైజ్ పోందినవారు చాలా మందే ఉంటారు. అవతలివారి కష్టాన్ని గుర్తించడమే కాదు.. వారి తపన, దీక్ష, పట్టుదల నచ్చిన నేపథ్యంలో ఆయన ఒక్కోసారి కానుకలు కూడా ఇచ్చేస్తుంటారు. అలా ఇప్పుడు ఓ సామాన్యుడికి బంపరాఫర్‌ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ మహీంద్రా ఆఫర్‌ ఇచ్చింది  ఓ పేద కమ్మరికి!. తన టాలెంట్‌కు పదునుపెట్టి పాత సామాన్లతో ఫోర్‌ వీలర్ ను తయారు చేశాడతను. అసమాన్యమైన ఆ ప్రతిభకు, సృజనాత్మక ఆవిష్కరణకు ఆనంద్‌ మహీంద్రా ఫిదా అయిపోయారు.

అందుకే ఆ వీడియోను షేర్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. అందులో ఆ కారు ఎలా పని చేస్తుందో కూడా వివరంగా ఉంది. పనిలో పనిగా ఆ వ్యక్తి తయారు చేసిన వాహనం తీసుకుని.. తన కంపెనీ తరపున బొలెరో వాహనాన్ని ఇవ్వాలని ఫిక్సయ్యారు ఆనంద్‌ మహీంద్రా. ‘‘ఇది నిబంధనలకు అనుగుణంగా లేకపోవచ్చు.  కానీ తక్కువ వనరులతో ఎక్కువ ఫలితాన్ని చూపెట్టే మన ప్రజల చాతుర్యాన్ని మెచ్చుకోకుండా నేను ఉండలేను’’.. అంటూ ట్విటర్‌ వేదికగా పెద్దగా చదువుకోని ఆ ‘ఇంజినీర్‌’పై ప్రశంసలు గుప్పించాడు.

హిస్టోరికానో యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రకారం.. ఆ ఆవిష్కరణ చేసిన వ్యక్తి పేరు దత్తాత్రేయ లొహార్‌. ఊరు  మహారాష్ట్రలోని దేవ్‌రాష్‌ట్రే గ్రామం. పాత, పాడుబడ్డ కార్ల నుంచి పార్ట్‌లను సేకరించి ఈ ప్రయత్నం చేశాడు.  పాత సామాన్లను చేర్చి ఆ వాహనం చేయడానికి అతను 60 వేల రూపాయల అప్పు కూడా చేశాడు. టూవీలర్స్‌లోని మెకానిజంతో ఈ బండిని తయారు చేయడం విశేషం. పేద కుటుంబమే అయినప్పటికీ కేవలం కొడుకు ముచ్చట తీర్చడానికే చేశాడట! మరి ఆనంద్‌ మహీంద్రా ఇచ్చిన ఆఫర్‌ను దత్తూ స్వీకరిస్తాడా? లేదా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles