Recording Wife's Phone Call "Infringement Of Privacy": Court రహస్యంగా భార్య ఫోన్ కాల్స్ రికార్డు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

Recording wife s phone without her knowledge is infringement of privacy high court

Punjab and Haryana high court, Recording, Wife, Telephonic Conversation between husband and wife, without Knowledge, Infringement, right to Privacy, Justice Lisa Gill, 13 of the Hindu Marriage Act, divorce suit, evidence, family court, Batinda, Punjab, Crime

Punjab and Haryana High Court has ruled that recording wife’s telephonic conversation without her knowledge amounts to infringement of her privacy. Justice Lisa Gill passed the order recently while hearing a petition filed by a woman who challenged a 2020 order passed by Bathinda family court.

రహస్యంగా భార్య ఫోన్ కాల్స్ రికార్డు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

Posted: 12/14/2021 05:28 PM IST
Recording wife s phone without her knowledge is infringement of privacy high court

ఒకరి ఫోన్ సంభాషణను మరోకరు వినడమే తప్పు. అలాంటిది.. వారి సంబాషణను వారికి తెలియకుండా ట్యాప్ చేసి రికార్డు చేయడం నేరం. ఎంతటి నేరమంటే ఇది ముహ్మాటికి ఫోన్ ట్యాపింగ్ నేరమే. అనుమానం వున్న చోట చిన్న తప్పు కూడా పెద్దగానే కనబడుతుంది. అలాంటి అనుమానంతో తన వెనుక కుట్రలు చేస్తున్నారనో.. లెక కుత్రంత్రాలు పన్నుతున్నారనో అనుమానం రావడంతో వారికి తెలియకుండానే ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతాయ్. అయితే అనుమానం విషయాన్ని పక్కనబెడితే మీరు చేసిన ఫోన్ ట్యాపింగ్ బయటపడిందో మీ ఆట కట్టే. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పార్లమెంటు సమావేశాలనే కుదిపేసిన ఘటనలు మనం ఇటీవలే చూశాం.

భార్యకు తెలియకుండా ఆమె ఫోన్ సంభాషణను రికార్డు చేయడంపై పంజాబ్-హర్యానా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య ఫోన్ కాల్ సంభాషణను రహస్యంగా రికార్డు చేయడమంటే గోప్యతను ఉల్లంఘించడమే అవుతుందని స్పష్టం చేసింది. ఈ కేసు  పూర్వాపరాల్లోకి వెళ్తే.. పంజాబ్ లోని భటిండాకు చెందిన ఓ జంట 2009లో పెళ్లితో ఒక్కటైంది. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. అయితే, ఆ తర్వాత మనస్పర్థలు చెలరేగడంతో తనకు విడాకులు ఇప్పించాలంటూ భర్త 2017లో భటిండాలోని కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసు విచారణలో భాగంగా తన భార్య సంభాషణలకు సంబంధించిన సీడీని సమర్పించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు. అందుకు భటిండా న్యాయస్థానం అంగీకరించింది. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. తన అనుమతి లేకుండా రికార్డు చేసిన మాటలను సాక్ష్యంగా ఎలా పరిగణిస్తారని పేర్కొంటూ భటిండా న్యాయస్థానం తీర్పును హైకోర్టులో సవాలు చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం భార్యకు తెలియకుండా ఆమె సంభాషణను రికార్డు చేయడమంటే ఆమె గోప్యతను స్పష్టంగా ఉల్లంఘించడమే అవుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : phone recording  telephonic conversation  privacy  Husband  Wife  divorce suit  evidence  family court  Batinda  Punjab  Crime  

Other Articles