Suspension of MPs means crushing the voice of people: Rahul Gandhi పెట్టుబడిదారుల చేతుల్లోకి అధికారం: రాహుల్ గాంధీ

Democracy being killed opposition not allowed to raise issues in parliament rahul gandhi

parliament winter session, PM Narendra Modi, Lok Sabha, Rajya Sabha, Congress, MSP, TMC, winter session 2021, parliament winter session 2021 schedule, bills to be passed in parliament winter session, indian parliament session 2021 live coverage, parliament winter session, Parliament, Winter session, lok sabha, rajya sabha, Winter Session Of Parliament 2021 Bills List, Indian Parliament Session 2021 Schedule Dates, Winter Session Of Parliament Date, Lakhimpur kheri news, Lakhimpur kheri protest, Ajay Mishras son, Delhi, Politics

Opposition MPs led a protest march from the Gandhi statue to Vijay Chowk demanding that the suspension of 12 Rajya Sabha members be revoked. Congress leader Rahul Gandhi, who joined the protesting members, said, “This (suspension of 12 MPs) is a symbol of the crushing of the voice of people of India. Their voices have been crushed. They have done nothing wrong.”

ఆందోళన మధ్య బిల్లుల అమోదం.. పార్లమెంటు సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ: రాహుల్ గాంధీ

Posted: 12/14/2021 07:30 PM IST
Democracy being killed opposition not allowed to raise issues in parliament rahul gandhi

కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్ర‌భుత్వ తీరుపై మ‌రోసారి మండిప‌డ్డారు. విపక్షాల ఆందోళ‌న‌ల నడుమ ఎలాంటి చర్చల కేంద్రం బిల్లుల మీద బిల్లుల‌ను ఆమోదం తెలుపుకుంటోందని మంచిప‌ద్ధ‌తి కాద‌ని ఆయ‌న అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ బిల్లులను పార్లమెంటులో అమోదిస్తోందో కూడా దేశప్రజలకు తెలియని పరిస్థితి వచ్చిందని అన్నారు. ఇలా పార్లమెంటులో బిల్లులను అమోదింపజేసుకుని వెళ్లి.. ప్రజల వ్యతిరేకతల మధ్య మళ్లీ వాటిని వెనక్కు తీసుకోవాల్సిందేనని ఆయన దుయ్యబట్టారు. సాగు చట్టాలపై బిల్లులే ఇందుకు ఉదాహరణగా రాహుల్ గాంధీ పేర్కోన్నారు.

ఇక ఏకంగా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీని టార్గెట్ చేసిన ఆయన.. ప్రధాని పార్ల‌మెంటుకు రావ‌డంలేద‌ని, జాతీయ ప్రాముఖ్య‌త ఉన్న అంశాల‌పై ప్ర‌భుత్వం ప్ర‌తిపక్షాల‌కు మాట్లాడే అవ‌కాశ‌మే ఇవ్వ‌డం లేద‌ని ఆయ‌న ఆరోపించారు. పార్ల‌మెంటు సాక్షిగా ప్ర‌జాస్వామ్యం ఖూనీ అవుతుండ‌టం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. ప్రభుత్వ ఏకపక్ష ధోరణినిన ప్ర‌శ్నించిన 12 మంది ఎంపీల‌పై స‌స్పెన్ష‌న్ విధించ‌డం అనేది ప్ర‌భుత్వం దేశ ప్ర‌జ‌ల గొంతు నొక్కుతుంద‌న‌డానికి సంకేత‌మ‌ని రాహుల్‌గాంధీ విమ‌ర్శించారు. రాజ్య‌స‌భ‌లో 12 మంది ఎంపీల గొంతు నొక్కేశారు, వాళ్లు ఏం త‌ప్పు చేశారు..? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఆ ఎంపీల‌పై సస్పెన్ష‌న్ ఎత్తివేసే వ‌ర‌కు తాము స‌భ‌లో ఎలాంటి చ‌ర్చ జ‌రుగ‌నీయ‌మ‌ని హెచ్చ‌రించారు.

ఇక ఉత్తర్ ప్రదేశ్ లోని ల‌ఖింపూర్ ఖేరీ ఘ‌ట‌న‌ను కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు. ల‌ఖింపూర్ ఖేరీలో ఓ మంత్రి తనయుడు నలుగురు రైతుల‌ను చంపేశాడు. ఆనంతరం చెలరేగిన హింసలో మరో ఐదుగురు మరణించారు. ఈ విష‌యం ప్ర‌ధాన‌మంత్రికి కూడా తెలుసు. కానీ నిందితుల‌పై చ‌ర్య‌లు ఉండ‌వు. ఎందుకంటే దేశంపై అధికారం ఇద్ద‌రు ముగ్గురు పెట్టుబ‌డిదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. రాజ్య‌స‌భ‌లో ఎంపీల స‌స్పెండ్ చేసింది ఛైర్మ‌నో, ప్ర‌ధాన‌మంత్రో కాదు.. రైతుల ఆదాయం దోచుకోవాల‌ని చూస్తున్న పెట్టుబ‌డిదారులే అని రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles