Lakhimpur Kheri Farmers killed as part of ‘planned conspiracy’, says police లఖీంపూర్ ఘటన ప్రణాలికాబద్ద కుట్రగా తేల్చిన సిట్..

Lakhimpur kheri case farmers killed as part of planned conspiracy says police

Lakhimpur Kheri violence, Lakhimpur Kheri case, Ashish Misra, Ajay misra, conspiracy, attempt to murder, BJP, SIT on Lakhimpur violence, DIG Upendra Agarwal, Ashish Mishra Teni, UP violence updates, Lakhimpur Kheri violence, CJI NV Ramana, Supreme Court, ShivKumar Tripati, Lakhimpur Kheri, UP Lakhimpur Kheri updates, Lakhimpur Kheri news, Supreme Court, Lakhimpur Violence, UP Violence, UP Violence News, Lakhimpur-Kheri Violence, Lakhimpur kheri protest, Farmer Protest, Viral Video, Ajay Mishras son, Uttar Pradesh, Crime

The Special Investigation team probing the Lakhimpur Kheri violence incident, in which eight people lost their lives, has said that there was a planned conspiracy to murder protesting farmers. In light of their findings, investigators have written to a judge to modify the charges against the accused, including Union Minster of State Ajay Misra’s son, Ashish Misra.

లఖీంపూర్ ఘటన: ప్రణాలికాబద్ద కుట్రగా తేల్చిన సిట్.. హత్యాయత్నం సెక్షన్లు సిఫార్సు..

Posted: 12/14/2021 04:40 PM IST
Lakhimpur kheri case farmers killed as part of planned conspiracy says police

ల‌ఖీంపూర్ ఖేరీ హింసాత్మక ఘటనపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కమిటీని వేసి వారి ఆధ్వర్యంలో కేసును దర్యాప్తును చేపట్టాలని అదేశించిన నేపథ్యంలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని లఖీంపూర్ ఖేరీలో కేంద్రమంత్రి తనయుడు.. తన కారుతో రైతులను తొక్కించుకుంటూ ముందుకెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్, సహా పలు రాష్ట్రాల్లో బీజేపి ప్రజాప్రతినిధులు బయటకు వెళ్లలేని పరిస్థితులు అలుముకున్నాయి. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడు అశీశ్ మిశ్రా సహా ఆయన సన్నిహితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టిన విషయం తెలిసిందే..

కాగా కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను కేంద్ర క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని.. కేంద్రమంత్రికే రైతులంటే గౌరవం లేనప్పుడు.. ఆయనకు కేంద్రం ఎందుకు మంత్రి పదవిని కల్పించిందన్న డిమాండ్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఘటనను దర్యాప్తు చేస్తున్న ఉత్తర్ ప్రదేశ్ పోలీసుల తీరుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే పలు పర్యాయాలు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇక పోలీసుల దర్యాప్తు తీరు ఎన్ని పర్యయాలు చెప్పినా మారడం లేదని.. ఈ కేసులో రిటైర్డు హైకోర్టు న్యాయమూర్తిని నియమించి దర్యాప్తు మొత్తం ఆయన పర్యవేక్షణలోనే జరగాలని అదేశాలు జారీ చేసింది. దీంతో ఎట్టకేలకు ఈ కేసులో కీలక మలుపు తిరిగింది.

అయితే, ఇన్నాళ్లు యాధృశ్చికంగా జరిగిన ఘ‌ట‌నగా పేర్కోన్న ఉత్తర్ ప్రదేశ్ పోలీసులకు బిన్నంగా.. తాజాగా ఇది ఒక‌ ప్రణాళిక‌బ‌ద్ద‌మైన కుట్ర అని ఈ కేసును ద‌ర్యాప్తు చేస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం (సిట్‌) మంగ‌ళ‌వారం వెల్ల‌డించింది. అంతేగాక‌, కేసులో ప్ర‌ధాన నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజ‌య్ మిశ్రా త‌న‌యుడు అశీశ్ మిశ్రాపై ఇప్ప‌టికే న‌మోదైన‌ అభియోగాల‌ను మార్చాల‌ని కేసు విచార‌ణ జ‌రుపుతున్న న్యాయ‌మూర్తికి సిట్ లేఖ రాసింది. కాగా, లఖింపూర్ ఖేరీ ఘ‌ట‌న‌లో కేంద్ర‌మంత్రి కొడుకు అశీశ్ మిశ్రాపైన‌, అత‌ని స‌హ‌నిందితుపైన ఇప్ప‌టికే హ‌త్య‌, నేర‌పూరిత కుట్ర అభియోగాలు న‌మోద‌య్యాయి. ప్ర‌స్తుతం వాటితోపాటు హ‌త్యాయ‌త్నం, ఇత‌ర అభియోగాలను కూడా చేర్చ‌నున్న‌ట్లు సిట్ పేర్కొన్న‌ది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles