Goat runs away with papers from panchayat office మేక వెంట పరుగులు పెట్టిన ప్రభుత్వ ఉద్యోగి.. ఎందుకని.?

Viral video govt employee runs after goat as it flees with office file in kanpur

Kanpur, Chaubepur, goat, BDO Chaubeypur block, Goat, kanpur, chaubepur, Panchayat Secretary office, goat runs away with office file, kanpur goat video, goat run away with official document, kanpur panchayat goat steal paper, Chaubepur block goat video, Kanpur, Uttar Pradesh, funny video, trending video, Viral video, video viral

In a hilarious incident reported from Uttar Pradesh's Kanpur, a goat entered a room in the Chaubepur development block office and fled with a file in its mouth. When employees noticed the file in the goat's mouth, they ran after it to get the official documents back. The incident happened at the office of the Panchayat Secretary in Chaubepur block

ITEMVIDEOS: వైరల్ వీడియో: మేక వెంట పరుగులు పెట్టిన ప్రభుత్వ ఉద్యోగి.. ఎందుకని.?

Posted: 12/03/2021 04:43 PM IST
Viral video govt employee runs after goat as it flees with office file in kanpur

సాధారణంగా ఓ ప్రభుత్వ కార్యాలయం నుంచి ఓ ధృవపత్రం సాధించాలంటే కాళ్లు అరిగేలా తిరగాల్సి వస్తుందని భావన ప్రజల్లో నెలకోంది. కానీ ఓ ప్రభుత్వ కార్యాలయంలోని ఉద్యోగి ఓ మేక వెంట కాళ్లు అరిగేలా పరుగుపరుగున తిరిగిన వైనం ఇది. ఇక దోరికిందే ఛాన్సు అనుకుందో ఏమో తెలియదు కానీ మేక పలు వీధుల గుండా ప్రభుత్వ ఉద్యోగిని పరుగులు పెట్టించింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో సంచలనంగా మారింది. ఇది సరే.. మేక వెంట ప్రభుత్వ ఉద్యోగి పరుగులు పెట్టడానికి గల కారణం ఏంటని అలోచిస్తున్నారా.? అక్కడికే వస్తున్నాం.

ప్రభుత్వ ఉద్యోగులు ఎంచక్కా ఎండలో ముచ్చట్టు పెట్టుకుని నిలబడితే.. తన కోసమే కార్యాలయంలోని దస్త్రాలు వేచి చూస్తున్నాయన్నట్లు ఓ మేక ప్రభుత్వ కార్యాలయంలోకి ప్రవేశించింది. అంతే అది చేసిన ప‌నికి ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు చెమ‌ట‌లు ప‌ట్టాయి. ప్ర‌భుత్వ కార్యాల‌యంలోకి ప్ర‌వేశించిన మేక‌.. మెల్ల‌గా అక్క‌డున్న ఓ ద‌స్త్రాన్ని ఎత్తుకెళ్లింది. ఇక బయటకు వెళ్లిన అది ఆ దస్త్రంపై తన నోటితో పనిచెప్పే ప్రయత్నం ప్రారంభించింది. దీంతో ఓ ఉద్యోగి దాని వెనుకాలే ప‌రుగెత్తాడు. ఈ ఘ‌ట‌న యూపీ కాన్పూర్‌లోని చౌబేపూర్ బ్లాక్ ఆఫీసులో బుధ‌వారం చోటు చేసుకుంది. ఇక ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ కావ‌డంతో.. ఆ మేక సోష‌ల్ మీడియా స్టార్‌గా నిలిచిపోయింది.

చౌబేపూర్ బ్లాక్ ఆఫీసులోకి బుధ‌వారం ఓ మేక ప్ర‌వేశించింది. క్యాంటిన్‌కు స‌మీపంలో ఉన్న ఓ గ‌దిలోకి వ‌చ్చిన మేక‌.. అక్క‌డున్న ఓ ద‌స్త్రాన్ని నోటితో ప‌ట్టుకుని బ‌య‌ట‌కు వ‌చ్చింది. కాసేపు అక్క‌డే నిల్చున్న మేక‌.. అనంత‌రం అక్క‌డ్నుంచి వెళ్లిపోయింది. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన ఓ ఉద్యోగి ఆ ద‌స్త్రం కోసం మేక వెంట ప‌రుగెత్తాడు. చివ‌ర‌కు మేక నోట్లో ఉన్న ఫైల్‌ను ఉద్యోగి దొరికించుకున్నాడు. అది అధికారిక ఫైల్ కాదు.. మామూలు కాగితమే అని తేల‌డంతో ఉద్యోగులంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఉద్యోగుల నిర్ల‌క్ష్యం వ‌ల్లే మేక.. కార్యాల‌యంలోకి ప్ర‌వేశించింద‌ని బ్లాక్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫీస‌ర్ మ‌నులాల్ యాద‌వ్ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kanpur  Chaubepur  goat  BDO Chaubeypur block  Goat  Kanpur  Uttar Pradesh  funny video  trending video  Viral video  

Other Articles