Three Times More Likely to Get Reinfected by Omicron వారికి కోవిడ్ బూస్టర్ డోస్: కేంద్రానికి ఇన్‌సాకాగ్ సూచన

Covid vaccine booster dose for those above 40 years at risk can be considered insacog

COVID-19, Omicron, Omicron india, Indian SARS-CoV-2 Genomics Consortium, INSACOG, COVID-19 vaccine booster dose, COVID booster dose in india, booster dose above 40 years, booster dose at-risk people, Omicron symptoms, Omicron corona variant, Omicron B.1.1.529, covid new variant, RT-PCR Test, Rapic Test, covid new mutation, spike protein, covishield, covaxin, astrazeneca, covid-19 vaccination, nationwide vaccination drive, vaccination drive, Covaxin, Covishield, coronavirus detection, SARS-CoV-2 virus, SARS-CoV-2, medicines, Omicron, covid news, corona updates

The Indian SARS-CoV-2 Genomics Consortium (INSACOG) has suggested a COVID-19 vaccine booster dose for those above 40 years of age and at-risk people. The top Indian genome scientists have recommended in its bulletin on November 29 that those who are above 40 years and at high risk or high exposure may be prioritised for the booster dose, ANI reported.

40 ఏళ్లు పైబడినవారికి కోవిడ్ బూస్టర్ డోస్: కేంద్రానికి ఇన్‌సాకాగ్ సూచన

Posted: 12/03/2021 03:54 PM IST
Covid vaccine booster dose for those above 40 years at risk can be considered insacog

సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’లో రీ-ఇన్ ఫెక్షన్ ప్రభావం కూడా మూడు రెట్లు అధికంగా వుందని, ఇది డెల్టా వేరియంట్ కన్నా ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని.. ఇప్పటికే అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ కోత్త వేరియంట్ దేశంలోనూ చోచ్చుకోచ్చింది. ఇప్ప‌టికే క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో రెండు ఒమిక్రాన్ కేసులు నిర్ధార‌ణ అయ్యాయి. ఒకరు 66ఏళ్ల వయస్సున్న వ్యక్తి కాగా, మరోకరు 46 ఏళ్ల వయస్సున్న డాక్టర్ అని కర్ణాటక రాష్ట్ర వైద్యవర్గాలు వెల్లడించాయి. అయితే ఈ డాక్టర్తో సన్నిహింతగా మెలిగిన ఐదగురికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది.

ఎలాంటి ప్రయాణ చరిత్ర లేని ఆయనకు ఒమిక్రాన్ సోకడం పట్లు కలవరం మొదలైంది. ఇలా ఇంకెంతమందికి ఈ వైరస్ సోకిందన్న నేపథ్యంలో ఆయన ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇక తాజాగా.. ఢిల్లీలోని లోక్‌నాయ‌క్ జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క‌రోనా బాధితుల్లో 12 మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకిన‌ట్లు అనుమానిస్తున్నార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఆసుపత్రిలో ఎనమిది మంది ఒమిక్రాన్ అనుమానితులు చేర‌గా, ఇవాళ మ‌రో న‌లుగురు అనుమానితులు చేరిన‌ట్లు తెలిసింది. కాగా వీరిలో ఇద్ద‌రు యూకేకు చెందిన‌వారు కాగా, ఒక‌రు ఫ్రాన్స్‌కు, ఇంకొక‌రు నెద‌ర్లాండ్స్‌కు చెందిన వార‌ని తెలుస్తోంది. బాధితుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు.

ఈ క్రమంలో ఒమిక్రాన్ జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్న పరిశోధనల గ్రూపు కేంద్రానికి ఓ సూచన చేసింది. 40 ఏళ్ల వ‌య‌సు దాటిన వారితో పాటు ఆరోగ్యపరింగా రిస్క్ ఉన్నవారికి కూడా కరోనావైరస్ బూస్ట‌ర్ డోసు వాక్సీన్లు ఇవ్వాల‌ని సూచించింది. క‌రోనా వైర‌స్‌లో జ‌రుగుతున్న జ‌న్యు ప‌రిణామాల‌ను ప‌రిశీలిచేందుకు 28 ప‌రిశోధ‌న‌శాల‌ల‌తో కూడిన‌ క‌న్సార్టియం ఇన్‌సాకాగ్.. త‌న వీక్లీ బులిటెన్లో  ఈ సిఫార‌సు చేసింది. వ్యాక్సిన్ వేసుకోని వారికి ముందుగా టీకాలు ఇవ్వాల‌ని, ఆ త‌ర్వాత 40 ఏళ్లు దాటిన‌వాళ్ల‌కు.. రిస్క ఉన్నవాళ్లకు బూస్ట‌ర్ డోసు టీకాలు ఇవ్వాల‌ని ఇన్‌సాకాగ్ తెలిపింది. ఇప్పుడున్న వ్యాక్సిన్ల‌లో త‌క్కువ స్థాయి యాంటీబాడీలు ఉన్నాయ‌ని, వాటితో ఒమిక్రాన్‌ను నిర్వీర్యం చేయ‌డం కుద‌ర‌ద‌ని, అందుకే బూస్ట‌ర్ డోసు త‌ప్ప‌నిస‌రి అని ఇన్‌సాకాగ్ తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles