YSR Cong MLC Karimunnisa dies of cardiac arrest వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ క‌రీమున్నిసా మృతి.. సీఎం సంతాపం

Andhra legislator karimunnisa passes away cardiac arrest

Mohammed Karimunnisa, Karimunnisa, Andhra lagislator Mohammed Karimunnisa, Muslim mlc, muhammad karimunnisa, ysr congress party, andhra pradesh muslims, andhra news, muslim member in andhra assembly, Krishna district MLC, AP CM YS Jagan, Tribute, Twitter, Andhra Pradesh, crime

Mohammed Karimunnisa, a member of Andhra Pradesh Legislative Council, belonging to ruling YSR Congress Party (YSRCP) died of cardiac arrest here late on Friday night. She was 56. According to her family members, she complained of uneasiness and was rushed to a private hospital, where she breathed her last around midnight.

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ క‌రీమున్నిసా మృతి.. సీఎం సంతాపం

Posted: 11/20/2021 11:50 AM IST
Andhra legislator karimunnisa passes away cardiac arrest

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మహ్మద్ క‌రీమున్నిసా(65) గుండెపోటుతో మృతి చెందారు. కృష్ణా జిల్లాకు చెందిన అమె గుండెపోటుతో శుక్రవారం అర్థరాత్రి మృతి చెందారు. శాసనమండలి సమావేశానంతరం ఇంటికి వచ్చిన ఆమె రాత్రి 11.30 గంటల సమయంలో ఛాతిలో నొప్పి వస్తోందని చెప్పడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని ప్రైవేలు అసుపత్రికి తరలించారు. అయితే అక్కడ నుంచి మరో అసుపత్రికి  తరలించినా ఫలితం లేకపోయింది. రెండో అసుపత్రికి తీసుకెళ్లే మార్గమధ్యంలోనే అమె తిరిగిరాని లోకాలకు తరలివెళ్లారని కుటుంబసభ్యులు తెలిపారు.

వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి కరీమున్నీసా పార్టీకోసం నిరంతరం శ్రమించారు. ఈ ఏడాది ఎమ్మెల్సీగా ఆమెకు సీఎం జగన్‌ అవకాశం కల్పించారు. శుక్రవారం ఉదయం శాసనమండలిలో ఆమె సీఎం జగన్‌, శాసనమండలి చైర్మన్‌ మోషేన్‌ రాజును కలిశారు. కరీమున్నీసాకు భర్త, ఐదుగురు కుమారులు ఉన్నారు. అమె హఠాన్మరణం పట్ల సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘ నా సోదరి మహ్మద్‌ కరీమున్నీసా ఆకస్మిక మరణం తీవ్రంగా కలిచివేసింది. నిన్ను శాసనమండలికి హాజరై రాత్రి ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించడం బాధాకరం. ఆమె కుటుంబ సభ్యలకు నా ప్రగాఢ సానుభూతి. వారికి నాతో సహా పార్టీ అండగా ఉంటుంది’ అని ట్విటర్‌ ద్వారా పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohammed Karimunnisa  Krishna district MLC  AP CM YS Jagan  Tribute  Twitter  Andhra Pradesh  crime  

Other Articles