NagaBabu on TDP President Chandrababu Outburst వైఎస్సార్‌సీపీ నాయకులపై నాగబాబు ఫైర్..

Mega brother nagababu on tdp president chandrababu outburst

Nagababu, Chandrababu Naidu, Nara bhuvaneshwari, Janasena, TDP, YSRCP Leaders, Andhra Pradesh, Politics

Janasena party Senior Leader, Mega Brother NagaBabu fired on YSRCP Leaders who are targeting the Daughter of Cinema legend and Former Chief Minister of the State Mr Nandamuri Taraka RamaRao and Wife of TDP President Chandrababu. He said it was the worst in the political history of the state.

వైఎస్సార్‌సీపీ నాయకులపై నాగబాబు ఫైర్.. విలువలు దిగజారవద్దని హితవు

Posted: 11/20/2021 01:25 PM IST
Mega brother nagababu on tdp president chandrababu outburst

వైఎస్సార్‌సీపీ నాయకులపై  జనసేన సీనియర్ నాయకుడు, మెగాబద్రర్ నాగబాబు తీవ్రస్థాయిలో మండపడ్డారు. టీడీపీ నేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నేతలు చేపిన వ్యాఖ్యలపై ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్నాయి. ఈ క్రమంలో మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు గుక్కపెట్టి ఏడవటం.. రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఇది దుర్ధినమని పేర్కోన్నారు. ఎంతో ఉన్నతమైనదిగా, ఉత్తమమైనదిగా ప్రాచుర్యం పొందిన మన రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును తలచుకుని బాధపడాలో లేక భయపడాలో తెలియని సందిగ్ధ దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు తమకు ప్రత్యర్థి అయి ఉండొచ్చని… టీడీపీ తమకు ప్రతిపక్షం అయ్యుండొచ్చని… కానీ, చంద్రబాబు వంటి ఒక నేత ఇలా కన్నీటిపర్యంతం అయిన ఘటన తనను ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయం రోజురోజుకి పరాకాష్టలకు నిలయంగా మారుతోందని చెప్పారు. ఒక ముఖ్యమంత్రిని ‘భో…కె’ అని దూషించి, ఒక మాజీ ముఖ్యమంత్రి కుటుంబాన్ని అసభ్యకర పదజాలంతో కించపరిచి… తమను తాము హీనాతిహీనమైన విలువలు లేని పురుగులుగా నాయకులు నిరూపించుకుంటున్నారని నాగబాబు దుయ్యబట్టారు. ఒకరిని విమర్శించే నైతిక హక్కు తప్ప… వారిని తిట్టడం లేదా దూషించే అధికారం ఏఒక్కరికీ లేదని నాగబాబు అన్నారు.

గతంతో తన తమ్ముడు పవన్ కల్యాణ్ ని, తన కుటుంబాన్ని ఇలాగే అనుచిత పదాలతో విమర్శించినప్పుడు ఎంతో క్షోభకు గురైన వ్యక్తిగా, ఆ బాధను అనుభవించిన వ్యక్తిగా చెపుతున్నానని... ఇది అనాగరికం మరియు సాటి మనుషుల క్రూరత్వమని చెప్పారు. నీకు ఒకరు చేసింది తప్పు అనిపిస్తే ప్రశ్నించాలని, నిలదీయాలని లేదా తప్పు ఉంటే కమిటీ వేసి నిరూపించి శిక్షించాలని... అంతేకాని ఇలాంటి నీచ సంస్కృతికి దిగజారకండని అన్నారు. ఏ పార్టీ అయినా, ఏ పార్టీ నాయకుడైనా, వారి పట్ల కనీస గౌరవాన్ని పాటించి... ఇకనైనా మనుషులుగా మారతారని ఆశిస్తున్నానని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagababu  Chandrababu Naidu  Nara bhuvaneshwari  Janasena  TDP  YSRCP Leaders  Andhra Pradesh  Politics  

Other Articles