Depression crosses coast between Tamil Nadu and AP తీరం గాటనున్న వాయుగుండం.. విద్యాసంస్థలకు సెలవు

Depression over bay of bengal crosses coast between tamil nadu andhra

Chennai Flood, chennai flood alert, chennai flood live, chennai flood alert live, chennai flood news, chennai rain, chennai rain today, tamil nadu rain, tamil nadu rain updates, tamil nadu rain alert, IMD weather alert, imd, imd alert, imd bulletin, imd forecast, tamil nadu floods, chennai rains, bay of bengal, depression over bay of bengal, low pressure area, heavy rain, heavy rainfall in Tamil Nadu, weather update tamil nadu, Chennai weather, IMD, Predictions, Heavy to Very heavy rainfall, chittor, nellore, Andhra Pradesh, Tamil Nadu

The depression over Bay of Bengal crossed the coast between Tamil Nadu and Andhra Pradesh early on Friday, the India Meteorological Department (IMD) said and announced that the weather system will gradually weaken. It forecast more rains for the state and heavy to very heavy rainfall in parts of AP and Karnataka.

తీరం దాటిన వాయుగుండం.. మూడు రోజుల పాటు ఏపీ, తమిళనాడులలో భారీ వర్షాలు

Posted: 11/20/2021 10:50 AM IST
Depression over bay of bengal crosses coast between tamil nadu andhra

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం మారి అంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తమిళనాడులోనూ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున పుదుచ్చేరి, చెన్నై మధ్యలో వాయుగుండం తీరాన్ని దాటింది. ఉదయం 8.30 గంటలకు వెల్లూరుకు తూర్పు ఆగ్నేయ దిశగా 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నదని, ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదిలి క్రమంగా బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న తెలిపారు. ఈక్రమంలో చిత్తూరు జిల్లాల మరీ హుక్యంగా తిరుపతిలో కురిసిన వర్షం ధాటికి రోడ్లు ఏరులయ్యాయి.

తిరుమల ఘాట్ రోడ్డులోని ఐదు ప్రాంతాల వద్ద ప్రమాదకర పరిస్థితులు అలుముకున్నాయి. ఘాట్ రోడ్డులోని పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. వాయుగుండం నుంచి ఉపరితలద్రోణి కోస్తాంధ్ర మీదుగా ఒడిశా వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తువరకు వ్యాపించినట్టు పేర్కొన్నారు. తూర్పు దిశ నుంచి రాష్ట్రంలోకి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని చెప్పారు. అయితే మరో రెండు మూడు రోజుల పాటు వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో పాటు పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశాలు వున్నాయి, అవసరం వుంటే తప్ప ప్రజలు బయటకు వెళ్లరాదని అధికారులు సూచించారు. 

వాతావరణంలో మార్పుల వల్ల తెలంగాణకు తుఫాన్‌ ముప్పు తప్పిందని, అయితే వాయుగుండం తీరం దాటినా దాని ప్రభావంతో రాగల 48 గంటల్లో నగరంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు గ్రేటర్‌ వ్యాప్తంగా తేలికపాటి వర్షం పడింది. జగద్గిరిగుట్టలో అత్యధికంగా 4.5 మి.మీలు వర్షపాతం నమోదైంది. కానీ శుక్రవారం రాత్రి నుంచి మూడు రోజులపాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించారు. ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని ఒకటిరెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles