Varun Gandhi Roasts Actor Kangana Ranaut కంగనా రనౌత్ విలాసంతమైన బిక్షగత్తే: సీపిఐ నారాయణ

Actor kangana ranaut is a luxurious beggar cpi narayana

Kangana Ranaut on Independence, Kangana on Independence, CPI Narayana on Kangana, Varun Gandhi on Kangana, Hindutva mindset, BJP, RSS, CPI Narayana, Kangana Ranaut, Luxurious Beggar, actress, Cinema, Padma shree, India’s independence, slave, Hindutva, National Politics

CPI Narayana reacted to Kangana’s remarks added that she is a luxurious beggar. “Kangana is an actress and for her contribution towards cinema, she was awarded Padma Shree. But she has no knowledge about India’s independence and so has right to comment on it. Not just Kangana even the government of India and the BJP, RSS are not qualified too. This attitude of Kangana is nothing but a slavery of Hindutva mindset,” said Narayana.

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ విలాసంతమైన బిక్షగత్తే: సీపిఐ నారాయణ

Posted: 11/12/2021 03:30 PM IST
Actor kangana ranaut is a luxurious beggar cpi narayana

సిపిఐ జాతీయ నేత నారాయణ హీరోయిన్ కంగనా రనౌత్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డును అందుకున్న అమె ఆ సందర్భంగా దేశ స్వాతంత్ర్యంపై చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. భారత మాత బానిస శృంఖాళాలను తెంచిన స్వాతంత్ర్యాన్ని అమె చులకన చేసి మాట్లాడటం అమె అవగాహనా రాహిత్యానికి అద్దం పడుతోందని విమర్శించారు. కంగన ఒక అత్యంత విలాసవంతమైన బిచ్చగత్తె అని.. పద్మశ్రీ అవార్డు ఆమెకు ఎలా వచ్చిందో అందరికీ తెలుసని వ్యంగంగా చెప్పుకొచ్చాడు.

దేశస్వాతంత్రం గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా ఆమెకు లేదని.. మోడీ ప్రధానమంత్రి అయిన తరువాతే దేశానికి స్వాతంత్రం వచ్చిందనే వ్యాఖ్యలు ఆమె బానిస మనస్తత్వానికి నిలువెత్తు నిదర్శనమని దుయ్యబట్టారు. దేశ స్వాతంత్ర్యంపై అమె చేసిన వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకుని వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని లేకపోతే తీవ్రమైన పరిణామాలు భవిష్యత్తులో ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక హీరోయిన్ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై బీజేపి ఎంపీ వరుణ్ గాంధీ కూడా తనదైన శైలిలో స్పందించారు.

కంగనా రనౌత్ చేసిన ఇలాంటి వ్యాఖ్యలను పిచ్చితనంగా భావించాలా? లేక దేశద్రోహంగా భావించాలా? అని ప్రశ్నించారు. అమె చేసిన ఈ వ్యాఖ్యలపై యావత్ దేశం తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అవగాహనా రాహిత్యంతో కొందరు చేసే వ్యాఖ్యలతో దేశానికి అపఖ్యాతిని ఆపాదించేలా వున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగింది. దేశ స్వాతంత్ర్యాన్ని అవమానించిన ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ డిమాండ్ చేశారు. అమాయక రైతులు, మోడీ పాలనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే వారిపై కాకుండా ఇలాంటి వారిపై దేశద్రోహం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

అమాయక రైతులపై, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై, గ్యాస్, డీజిల్ పెట్రోల్ ధరల పెంపును అక్షేపించిన వారిపై, కుంభకోణాలపై మాట్లాడిన వారిపై, నోట్ల రద్దుతో ఏం సాధించారని ప్రశ్నించిన వారిపై బీజేపి పాలకులు దేశద్రోహం కింద కేసులు పెడుతూ.. దేశ స్వాత్రంత్యాన్నే అపహాస్యం చేసేలా వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్ లాంటి వ్యక్తులకు పద్మశ్రీ బిరుదులతో సత్కారం చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇక కంగనా రనౌత్  పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ముంబై పోలీసులను ఆప్ నాయకురాలు ప్రీతి శర్మ కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles