CM MK Stalin Honours Chennai cop Rajeshwari సీఎం స్టాలిన్ ప్రశంసలు అందుకున్న మహిళా సిఐ

Cm stalin honours woman police inspector carries unconscious man on her shoulders

Tamil Nadu Cheif Minister, CM MK Stalin, CM Stalin CI Rajeshwari, Inspector Rajeshwari, Woman police inspector, Chennai rain, watch video, video viral on social media, Tamil Nadu, Chennai heavy rain, rescue unconscious man, rescue operations, unconscious man, Tamil Nadu, viral video, social media

As Chennai tackles water logging due to heavy rain over the past few days, a woman police inspector has set an example by leading rescue work from the front. In the viral video a woman inspector is seen rescuing a man lying unconscious at a cemetery in the TP Chatram area of Chennai.

ITEMVIDEOS: యువకుడిని మోసుకెళ్లిన మహిళా సిఐ సీఎం స్టాలిన్ ప్రశంసలు

Posted: 11/12/2021 02:24 PM IST
Cm stalin honours woman police inspector carries unconscious man on her shoulders

ఆపదలో ఉన్నవారిని రక్షించడమే వారి బాధ్యత అయినా.. సీఐ ర్యాంకులోని అధికారులు శారీరిక శ్రమకోర్చి కాపాడటం అంటే నిజంగా వార్తే. ఎందుకంటే వారు ఓ స్థాయిలో వున్న అధికారులు. వారి కింద బోలెడంత మంది సిబ్బంది వారి అదేశాల కోసం ఎదురుచూస్తూ.. ఎప్పుడు ఏ పని చెప్పినా చేయడానికి మేం రెడీ అన్నట్లుగా ఎదురు చూస్తుంటారు. అయితే అపత్కాల సమయంలో అదేశాలు జారీ చేయడం కన్నా కార్యరంగంలోకి దూకీ.. అక్కడివారిని కాపాడటమే వారి నైతిక ధర్మం. ఇలాంటి ధర్మాన్ని నెరవేర్చిన సిఐ రాజేశ్వరిని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సత్కరించారు.

ఇప్పటికే సిఐ రాజేశ్వరి చేసిన పనితో యువకుడు ప్రాణం పోసుకోగా, అమె నిర్వర్తించిన గురుతర బాధ్యతపై నెటిజనులు హ్యాట్సాఫ్ వ్యక్తం చేస్తున్నారు. చెన్నైలోని టిపీ చట్రం ఏరియాలోని శ్మశాన వాటికలో చెట్టు కిందపడటంతో దాని పక్కనే ఆశ్రయం పోందుతున్న యువకుడు సృహతప్పి పడిపోవడంతో యువకుడిని సిఐ రాజేశ్వరి తన భుజాలపై మోసుకుని వెళ్లి అటోలో వేసింది. అంతేకాదు అటోలో ఎక్కి యువకుడిని నేరుగా అసుపత్రికి తీసుకెళ్లింది. దీంతో సకాలంలో యువకుడిని తీసుకురావడంతో యువకుడి ప్రాణాలను కాపాడగలిగామని వైద్యులు అమెకు తెలిపారు.

దీంతో అమె యువకుడిని తన భుజాలపైకి ఎత్తుకుని తొలుత ఓ వ్యానులో, ఆ తరువాత ఆటోలో వేయడానికి అమె మోసుకెళ్లిన ఘటనను అక్కడున్న వారు తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. దానిని వారు నెట్టింట్లో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. దీంతో నెట్ జనులు అమె చేసిన పనికి ధన్యవాదలు తెలుపుతున్నారు. దీంతో విషయం కాస్తా సీఎం స్టాలిన్ వరకు చేరడంతో అమెను ఇవాళ ఆయన అభినందించారు. అమె తన బాధ్యతనే సక్రమంగా నిర్వహించడంపై ఆయన అమెను ప్రశంసాపత్రంతో సత్కరించారు. అమె కూడా సీఎం ఎంకే స్టాలిన్ ను ప్రశంసలు కురిపించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles