Jagga Reddy sensational comments on United Andhra Pradesh సమైక్యాంధ్రపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Pcc working president jagga reddy sensational comments on united andhra pradesh

Jagga reddy on United Andhra Pradesh, Sangareddy MLA Jagga Reddy on United AP, United Andhra Pradesh slogan raises again, TPCC working president Jagga reddy on Revanth Reddy, Jagga reddy, Sangareddy MLA, United Andhra Pradesh, TPCC working president, Manikam Tagore, Revanth Reddy, KCR, Telangana, Politics

Telangana Pradesh Congress comittee working president T.Jagga Reddy makes sensational comments on United Andhra Pradesh, says he will support CM KCR if he unites both the Telugu states.

తెరపైకి మళ్లీ సమైక్యాంధ్ర నినాదం: జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Posted: 10/30/2021 06:03 PM IST
Pcc working president jagga reddy sensational comments on united andhra pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తమను పార్టీ పెట్టాలని కొందరు నేతలు ఇప్పటికీ బలవంతం పెడుతున్నారని టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో ముఖ్యమంత్రి చెప్పిన మాటలకు.. ఏపీ మంత్రి పేర్ని నాని.. ఇక్కడ పార్టీ పెట్టడం ఎందుకు రెండు రాష్ట్రాలను కలసి.. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో అడుగు ముందుకేసీన తెలంగాణ పిసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.. రెండు తెలుగు రాష్ట్రాలను కలసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మారుస్తానంటే తాను ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంపూర్ణ మద్దతు ఇస్తానని ప్రకటించారు.

అంతేకాదు తన స్టాండ్​ కూడా సమైక్య రాష్ట్రమేనని సంగరాెడ్డి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మరోమారు సమైక్య రాష్ట్రం నినాదం తెరపైకి వచ్చినట్టు అయ్యింది. అంసెబ్లీ హాల్ లో శనివారం మీడియాతో చిట్​చాట్​ నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన రాజకీయ చర్చ జరుగుతోందన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆరే స్టార్ట్ చేశారనడంలో అనుమానం లేదని, ముందు నుంచి తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్న పార్టీ కాంగ్రెస్​ అని, ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిన సమయంలో అన్ని పార్టీలు తప్పని పరిస్థితుల్లో సపోర్ట్ చేశాయన్నారు.

సమైక్య రాష్ట్రం పేరు మీద ఏపీ, తెలంగాణలో అధికార పార్టీలు కొత్త డ్రామా మొదలుపెట్టాయని, కేసీఆర్ రాజకీయాలను ప్రజలు గమనించాలని జగ్గారెడ్డి కోరారు. ఇక వైఎస్​ షర్మిల తెలంగాణలో స్పేస్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని, త్వరలో తాము కూడా తెలంగాణ కొడుకని టీడీపీ నుంచి లోకేశ్, వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి వారసులు వచ్చినా అశ్చర్యపోనవసరం లేదన్నారు. తనది ముందు నుంచీ సమైక్య రాష్ట్రమేనని, తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పుకోవద్దని పీసీసీలో ఎక్కడా లేదన్నారు. తన వ్యక్తిగత అభిప్రాయాన్ని అడ్డుకునే అర్హత రేవంత్ కు లేదన్నారు. తాను ఎప్పటికైనా రేవంత్​రెడ్డికి క్షమాపణ చెప్పనని, చెప్పే పరిస్థితి కూడా రాదన్నారు. గతంలోనూ కేవలం మాణిక్కం ఠాగూర్​కు మాత్రమే క్షమాపణ చెప్పానన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles