Man doing stunt bike then what happened.? బెడిసికొట్టిన బైక్‌ స్టంట్స్‌: టైర్ పంక్చర్.. అదుపు తప్పి..

Bike stunt goes horribly wrong police advises netizens to drive safe

Bike stunt, viral video, Bike stunt video, Rupin Sharma IPS, Bike stunt, Public road, Accident, bike stunt horrible, accident video, Google Trends, Google Trends Today, Live Accident Ka Video, OMG Video, Viral Video Today

Many fame-hungry people have got into serious accidents and even lost their lives in the recent past while attempting dangerous stunts on video in an effort to go viral TikTok and other social media platforms. One such man attempted a dangerous bike stunt that went horribly wrong.

ITEMVIDEOS: బెడిసికొట్టిన బైక్‌ స్టంట్స్‌: టైర్ పంక్చర్.. అదుపు తప్పి..

Posted: 10/30/2021 07:25 PM IST
Bike stunt goes horribly wrong police advises netizens to drive safe

బైక్ స్టంట్స్‌ చేయడం కొందరి యువతకు అందులోనూ నూనుగు మీసాల నుతన యవ్వనంలోకి అడుగుపెడుతున్న వారికి మరింత ఇష్టం. అయితే అందులో ఎదురయ్యే ప్రమాదాల గురించి వారు ఆలోచించరు. అలోచించేంత పరిపక్వత కూడా ఆ వయస్సులోని యువతకు వుండదు. అంతా తాము పాపులర్ కావాలనో.. లేక తమను కొందరు నిత్యం మెచ్చుకునేలా ఉండాలనో.. అదీకాకపోతే పదిమందిలో తాము ప్రత్యేకతను చాటాలనో ఎంతో క్లిష్టమైన స్టంట్స్ ను ప్రదర్శిస్తూంటారు. అయితే ఇలాంటి స్టంట్స్ కోసం నిర్జన ప్రదేశంలోనో లేక ప్రత్యేకమైన ట్రాకులపైనో చేస్తే ప్రమాదం వారికి మాత్రమే.

అలా కాకుండా రహదారులపై పబ్లిక్ రోడ్లపైన చేస్తే.. తమతో పాటు ఎదరుగా వస్తున్న వాహనదారులకు కూడా ప్రమాదాన్ని కలిగించిన వారవుతారు. తమ బైక్‌ స్టంట్స్ వల్ల ఇతర వాహనదారులకు, ప్రయాణికులను ఇబ్బంది కలుగడమే కాదు.. ఏకంగా ప్రాణాలకు హాని కలిగితే ఎవరిదీ బాధ్యత. ప్రాణాపాయ స్థితిలో ఎవరు ఎవరిని బాధ్యుల్ని చేస్తారు. ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమయితే స్టంట్స్ చేసే సమయంలోనే తగు జాగ్రత్తలు తీసుకుంటారు. అలా కాకుండా తామకు తాము హీరోలా ఫీల్‌ అవుతూ రకరకాల స్టంట్లు చేస్తూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. తాజాగా అలాంటి ఓ బైకర్ చేసిన స్టంట్ తేడాకొట్టింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్‌గా మారింది.


ఐపీఎస్‌ అధికారి రుపిన్‌ శర్మ తన ట్విటర్‌లో పోస్టు చేసిన ఈ వీడియోలో ట్రాఫిక్‌ ఎక్కువ ఉన్న రోడ్డుపై ఓ యువకుడు అందరిలాగే బైక్‌పై వెళ్తున్నాడు. అలా వెళ్తూ ఒక్కసారిగా బైక్‌ ముందు చక్రాన్నిస్టైల్‌గా పైకి లేపాడు. అలాగే బైక్‌ నడుపుతూ కొంచెం దూరం వెళ్లి గాల్లోకి లేపిన చక్రాన్ని కిందకు దింపాడు. అయితే అప్పుడే బైక్ టైర్ పంక్చర్ అయ్యింది. దాంతో అకస్మాత్తుగా బైక్‌ బ్యాలెన్స్‌ తప్పింది. ఒక వైపుకు లాగుతున్న బైక్ ను కంట్రోల్ చేసినా.. దాని అతివేగంతో నియంత్రణ చేయలేక.. ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టబోయి తప్పించుకున్నాడు. కానీ వెంటనే వెనకాల వస్తున్న ట్యాంకర్‌ను బలంగా ఢీకొట్టాడు ప్రమాదం బారిన పడ్డాడు. ఈ ఘటనలో బైకర్‌ కు ఏంజరిగిందన్నది తెలియదు, కానీ అక్కడితో వీడియో పూర్తయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rupin Sharma IPS  Bike stunt  Public road  Accident  bike stunt horrible  viral video  Trending video  Crime  

Other Articles