Rahul Gandhi takes a ride on Goa's 'motorcycle taxi' ఇం‘ధనం’తో ‘‘ఆ నలుగురికే’’ లాభమన్న రాహుల్ గాంధీ

4 5 businessmen benefitting from fuel price rise rahul gandhi in goa

Rahul Gandhi in Goa, Congress Goa, Goa polls,Goa assembly polls, Goa, twitter, panaji, bambolim, rahul gandhi, india, south goa, Goa Assembly Elections 2022

Congress leader Rahul Gandhi on Saturday kickstarted the party's poll campaigning in Goa where he arrived for a day-long visit earlier today. During the campaigning, the Congress leader was spotted taking a ride on Goa's so-called motorcycle taxi 'Pilot', in the state capital Panaji.

ITEMVIDEOS: బైక్ టాక్సీపై రాహుల్ గాంధీ.. ఇం‘ధనం’తో ‘‘ఆ నలుగురికే’’ లాభమన్న నేత

Posted: 10/30/2021 05:15 PM IST
4 5 businessmen benefitting from fuel price rise rahul gandhi in goa

ఇంధన ధ‌ర‌ల పెంపుతో దేశంలోని వాహనదారుల జేబుల్లోని డబ్బులను దోపిడి చేస్తున్న కేంద్రం.. కేవ‌లం న‌లుగురైదుగురు పారిశ్రామిక‌వేత్త‌లకు మాత్రమే లాభాలను సమకూర్చేలా చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మోదీ స‌న్నిహిత వ్యాపార వేత్త‌ల‌ను ఉద్దేశించి రాహుల్ ప‌రోక్షంగా ఈ వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ హ‌యాంలో ఇంధ‌న ధ‌ర‌లు చుక్క‌లు తాకుతున్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న స‌మ‌యంలో ముడి చ‌మురు ధ‌ర‌లు అధికంగా ఉన్నాయ‌ని, ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ముడి చ‌మురు ధ‌ర‌లు త‌క్కువ‌గా ఉన్నా ప్ర‌జ‌ల‌పై పెట్రో భారాలు మోపుతున్నార‌ని మోదీ స‌ర్కార్‌పై మండిప‌డ్డారు.

యూపీఏ హ‌యాంలో ముడి చ‌మ‌రు ధ‌ర‌లు బ్యారెల్‌కు 140 డాల‌ర్ల‌కు చేర‌గా, ఇప్పుడ‌వి చాలా త‌క్కువ‌గా ఉన్నా మ‌నం పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌పై అధిక మొత్తం చెల్లించాల్సిన దుస్ధితి నెల‌కొంద‌ని రాహుల్ అన్నారు. వ‌చ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గనున్న గోవాలో రాహుల్ శనివారం ప‌ర్య‌టించారు. గోవాలో కాంగ్రెస్ కీల‌క నేత రాహుల్ గాంధీ ఒక్క‌రోజు ప‌ర్య‌ట‌న కొన‌సాగుతున్న‌ది. ఒక్క‌రోజు ప‌ర్య‌ట‌న కోసం ఇవాళ గోవాకు వెళ్లిన రాహుల్‌గాంధీ ముందుగా.. ద‌క్షిణ గోవాలోని వ‌ల్సావో గ్రామంలో మ‌త్స్య‌కారుల‌తో స‌మావేశ‌మ‌య్యారు.

ఈ సంర్దభంగా ఆయన మాట్లాడుతూ తాము ఎన్నికల సందర్భంగా ఇస్తున్న హామీలు కేవలం హామీలు మాత్రమే కాదని, గ్యారంటీలని చెప్పారు. ఈ విషయాలను చత్తీస్ గడ్ సహా అంతకుముందు గెలిచిన కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాలలోనూ తెలుసుకోవాలని సూచించారు. అక్కడ ఎన్నికలకు ముందు రైతులకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీలను ఇచ్చామని, అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని అమలుపర్చి రైతులు కష్టాలను దూరం చేశామని ఆయన తెలిపారు.  ఆ త‌ర్వాత ప‌నాజీలోని అజాద్ మైదాన్ ఏరియాలోగ‌ల అమ‌ర‌వీరుల స్థూపం వ‌ద్ద నివాళులు అర్పించేందుకు బయ‌లుదేరారు.

ఈ సంద‌ర్భంగా రాహుల్‌గాంధీ ట్యాక్సీ బైక్‌పై ప్ర‌యాణం చేశారు. గోవాలో మోటార్ సైకిళ్ల‌ను అద్దెకిస్తుంటారు. పైల‌ట్‌గా సుప‌రిచిత‌మైన ఈ మోటార్ సైకిల్ ట్యాక్సీ స‌ర్వీస్ నుంచి ఒక బైకును అద్దెకు తీసుకుని రాహుల్‌గాంధీ దానిపై ప్ర‌యాణం చేశారు. ముందు ఒక వ్య‌క్తి బైకును న‌డుపుతుంటే రాహుల్‌గాంధీ అత‌ని వెనుక కూర్చుని ప్ర‌యాణించారు. ఇంత‌కూ ఆ ట్యాక్సీ బైకుపై ఎక్క‌డి నుంచి ఎక్క‌డికి ప్ర‌యాణించారంటే గోవా రాజ‌ధాని ప‌నాజీలోని బాంబోలిమ్ నుంచి అజాద్ మైదాన్ వ‌ర‌కు. ఆ త‌ర్వాత అజాద్ మైదాన్‌లోని అమ‌ర‌వీరుల స్థూపం వ‌ద్ద ఆయ‌న నివాళుల‌ర్పించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : twitter  panaji  bambolim  rahul gandhi  india  south goa  Rahul Gandhi in Goa  Goa assembly polls  

Other Articles