Aryan Khan Reunites With Family at Mannat ఆర్థర్ రోడ్డు జైలు నుంచి విడుదలైన అర్యన్ ఖాన్..

Aryan khan arrives at mannat fans welcome him with dhol and tashas

Mumbai special court, Aryan Khan bail denied, Conspiracy angle, Aryan Khan advocates, Mumbai High Court, Narcotics Control Bureau (NCB), Aryan khan, BJP Leader Relative, Rishabh Sachdev, Mohit Kamboj, mumbai cruise drugs case, Sameer wankhede, Showik Chakraborty, Rhea Chakraborty, aryan khan Arthur Road jail Jail food, Aryan khan bail plea reserved, NCB court, mumbai cruise drugs case, cordelia drugs case, Shah Rukh Khan, Arbaaz Khan, Munmun Dhamecha, Gauri Khan, sameer wankhede, ncb, Crime

It was the homecoming of their "prince" Aryan Khan and superstar Shah Rukh Khan's fans made sure to make it special as they thronged in larger numbers outside the actor's bungalow here, celebrating with music, dance and firecrackers. Aryan walked out of the Arthur Road prison three weeks following his arrest during a drug raid on a cruise ship off the Mumbai coast.

ముంబై డ్రగ్స్ కేసు: ఆర్థర్ రోడ్డు జైలు నుంచి విడుదలైన అర్యన్ ఖాన్..

Posted: 10/30/2021 12:34 PM IST
Aryan khan arrives at mannat fans welcome him with dhol and tashas

ముంబై నుంచి గోవా వెళుతున్న క్రూయిజ్ లో జ‌రిగిన రేవ్ పార్టీలో పట్టుబడి.. ముంబయ్ జైలులో రిమాండ్ ఖైదీగా వున్న బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు అర్యన్ ఖాన్ ఎట్టకేలకు స్వేచ్చావాయువులను పీల్చుకున్నాడు. రెండు పర్యాయాలు బెయిల్ తిరస్కరణకు గురైన తరువాత.. ముంబై హైకోర్టులో ఆర్యన్ ఖాన్ కు ఊరట లభించింది. గురువారం రోజున ఆయనకు బెయిల్ లభించినా.. కోర్టు ఫార్మాలిటీస్ పూర్తి చేసుకునేందుకు కొంత సమయం పట్టింది. దీంతో అర్యన్ ఖాన్ ఇవాళ అర్థర్ రోడ్డులోని కేంద్ర కారాగారం నుంచి ఇవాళ ఉదయం విడుదలయ్యాడు.

డ్రగ్స్ కేసులో ఈ నెల 2న ఎన్సీబి అధికారులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిన జైలుకు పంపిన నాటి నుంచి దాదాపు నాలుగు వారాల పాటు ఆయన తన ఇంటికి దూరంగానే ఎన్సీబి అధికారుల కస్టడీ సహా జైలులోనే గడిపారు. 28 రోజుల తరువాత ఆర్యన్ జైలు నుంచి విడుదల కానున్న నేపథ్యంలో ఆయనను రిసీవ్ చేసుకోవడానికి పెద్ద సంఖ్యలో షారుఖ్ అభిమానులు జైలు వద్దకు వచ్చారు. బెయిల్ అర్డర్ విడుదలలో కొంత జాప్యం జరిగిన కారణంగా నిన్న జైలు నుంచి విడుదల కావాల్సిన ఆర్యన్ ఇవాళ ఉదయం విడుదలయ్యారు. ఆర్యన్ ఖాన్ దాదాపు 22 రోజుల పాటు ముంబై కేంద్రకారగారమైన ఆర్థర్ జైలులో గడిపారు,

ఆర్య‌న్‌తో పాటు మ‌రో ఇద్ద‌రు నిందితులు ఆర్బాజ్ మ‌ర్చంట్‌, మున్‌మున్ ధ‌మేచాల‌కు కూడా బెయిల్ ల‌భించడంతో వారు కూడా ఇవాళ జైలు నుంచి విడుదలయ్యారు. కాగా, అర్యన్ ఖాన్ రాక కోసం వెయి కళ్లతో ఎదురుచూస్తున్న కుటుంబసభ్యులు.. ఇంటికి విద్యుత్ దీపాలంకరణ చేసి ఘనంగా స్వాగత ఏర్పాటు చేశారు. ఆర్యన్ ఖాన్ కు స్వాగతం పలికేందుకు షారుక్‌ అభిమానులు భారీగా మన్నత్‌కు చేరుకున్నారు. 'వెల్‌కం ఆర్యన్‌' అంటూ పోస్టర్లు పట్టుకొని బాణసంచా కాల్చుతూ ఫ్యాన్స్‌ సంబరాల్లో మునిగిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles