China locks down Lanzhou, city of 4 million, over COVID-19 చైనాలో మళ్లీ పంజా విసిరిన కరోనా.. 11 ప్రావిన్సులలో లాక్ డౌన్.!

Amid fears of fresh outbreak of covid 19 china locks down lanzhou a city of 4 million people

china northwestern city, China, Lanzhou, city of 4 million, Lock down, covid-19, coronavirus, coronavirus spike, local government, domestic infections

China placed Lanzhou, a northwestern city of four million, under lockdown Tuesday in a bid to stamp out a domestic coronavirus spike, with residents told not to leave home except in emergencies. “All types of residential communities are to implement closed management,” said the local government in a statement, as China reported 29 new domestic infections.

చైనాలో మళ్లీ పంజా విసిరిన కరోనా.. 11 ప్రావిన్సులలో లాక్ డౌన్.!

Posted: 10/26/2021 03:11 PM IST
Amid fears of fresh outbreak of covid 19 china locks down lanzhou a city of 4 million people

చైనాలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోమారు పంజా విసురుతోంది. చైనాలోని వూహాన్ నగరంలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి అక్కడ విలయతాండవం సృష్టించిన పిమ్మట ప్రపంచ ముంగిట్లోకి అడుగుపెట్టి.. మరణమృదంగాన్ని మ్రోగించింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని తన ప్రభావానికి గురి చేసిన మహమ్మారి ఇప్పటికీ బ్రిటెన్, అమెరికాలలో విద్వంసాన్ని కోనసాగిస్తోంది. ఇదే సమయంలో తొలిసారిగా వెలుగుచూసిన చైనాలోనూ కరోనా మహమ్మారి మళ్లీ కలకలం రేపుతోంది. ఫలితంగా చైనాలోని అనేక ప్రావిన్సులలో లాక్ డౌన్ విధించారు.

అక్టోబర్ 17వ తేదీ నుంచి వ‌రుస‌గా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో చైనాలోని పలు నగరాలు, పట్టణాలు, ప్రావిన్సులలో కూడా లాక్ డౌన్ అములు అవుతోంది. చైనాలో మూడింట‌ ఒక వంతు అంటే దాదాపు 11 ప్రావిన్స్‌ల‌లో కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. గ‌త‌ వారం రోజుల వ్యవధిలో ఈ 11 ప్రావిన్స్‌ల‌లో 100కు పైగా కేసులు నమోదయ్యాయి. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో చైనా స‌ర్కారు కొవిడ్ నిబంధ‌న‌ల‌ను క‌ఠిన‌త‌రం చేస్తున్న‌ది. తాజాగా వాయువ్య చైనాలోని 40 లక్షల మంది జనాభా గల లాంజౌ నగరంలో కూడా స్థానిక ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది.

ఈ నగరంలో కొత్తగా 29 కరోనా కేసులు వెలుగుచూశాయని, అవి వేగంగా విస్తరిస్తున్నాయని అధికారులు తెలిపారు. అయితే కరోనా కేసుల నియంత్రణలో భాగంగా ప్రజలు తమ తమ ఇళ్లకు మాత్రమే పరిమితం కావాలని, అత్యవసర పరిస్థితులు ఉత్పన్నమయితే తప్ప బయటకు రాకూడదని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. చైనాలో కరోనా సోకి ఏకంగా 29 మంది మరణించిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వాలు నియంత్రణ చర్యలకు చేపట్టాయి. నగరాల్లో కఠినంగా లాక్ డౌన్ అములు చేస్తున్నాయి. కాగా స్థానిక వేరియంట్ అతి వేగంగా వ్యాపిస్తోందని అక్కడి నేషనల్ హెల్త్ కమీషన్ అధికార ప్రతినిధి తెలిపారు. ఇది మరింత వ్యాపించకుండా కట్టడి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

కరోనా విజృంభన నేపధ్యంలో లాక్ డౌన్నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్న‌ది. ముఖ్యంగా చైనా ఉత్తర ప్రాంతంలోని ప్రావిన్స్‌ల‌లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. గాన్సు, ఇన్నర్ మంగోలియా, నింగ్ క్సియా, గుయిజౌ, బీజింగ్ ప్రాంతాల్లో వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న‌ది. దాంతో ఆయా ప్రాంతాల్లో ప‌ర్యాట‌క ప్ర‌దేశాలను అధికారులు మూసివేశారు. మరోవైపు దేశ రాజధాని బీజింగ్‌లో ఇప్పటివరకు 14 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. నగరంలోకి వచ్చే వారికి అధికారులు క‌ఠిన‌ నిబంధనలు అమ‌లు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles