'Pick up sticks against farmers: Haryana CM రైతులపై హర్యానా సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు

Pick up sticks and treat farmers haryana cm s controversial remark stirs row

Manohar Lal Khattar, Haryana CM on farmers, farmers’ protests, Samyukta Kisan Morcha, SKM, Haryana farmers’ protests, video of Haryana CM contoversial comments, Manohar Lal Khatter on Farmers, Khatter contoversial comments on farmers, Khatter video oin social media, Lakhimpur violence, Ajay Kumar Mishra, Farmers, warning farmers, farmers protest, Lakhimpur Kheri, Uttar Pradesh, Politics

Haryana CM Manohar Lal Khattar made controversial remarks that encouraged violence while speaking at a farmers’ event in the state. He called upon 1000 volunteers from different regions to pick up sticks and fight “furious farmers”. Khattar's comments have sparked anger among farmer groups, with Samyukta Kisan Morcha calling for the Haryana CM to apologise and resign from his post.

ITEMVIDEOS: రైతులపై తిరగబడండీ: హర్యానా సీఎం ఖట్టర్ రెచ్చగోట్టే వ్యాఖ్యలు

Posted: 10/05/2021 03:26 PM IST
Pick up sticks and treat farmers haryana cm s controversial remark stirs row

కేంద్రమంత్రి అజయ్ కుమార్ మిశ్రా తనయుడు అశీశ్ మిశ్రా.. తన కారును ఘెరావ్ చేసిన రైతులను తోసుకుంటూ వారిపై నుంచి కారును తొక్కేస్తూ వెళ్లిన ఘటనలో తొమ్మిది మంది మరణించగా, వారిలో నలుగురు రైతులతో పాటు ఒక జర్నలిస్టు కూడా ఉన్నారు. ఈ ఘటన నేపథ్యంలో కేంద్రమంత్రిని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసి. ఆయన కొడును అరెస్టు చేయాలన్న దేశవ్యాప్త డిమాండ్లతో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఘటనపై దేశవ్యాప్తంగా రైతు సంఘాల అందోళనలతో పాటు విపక్షాలు కూడా పిలుపునిస్తున్నాయి.

ఓ వైపు ఉత్తర్ ప్రదేశ్ ఘటనతో రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకం అవుతుండగా, మరోవైపు మరో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఏకంగా కేంద్రమంత్రి తరహాలోనే రైతులకు వ్యతిరేకంగా వారి తీరులోనే జవాహివ్వాలని వ్యాఖ్యనించడం వివాదాలకు దారితీసింది. కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ తీసుకువచ్చిన నూతన సాగు చట్టాల తక్షణ ఉపసంహరణకు డిమాండ్ చేస్తూ అన్నదాతలు ఆందోళనలు చేస్తున్న వేళ..  హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా అందోళనకు అజ్యం పోశారు. ప్రతీ జిల్లాలో వెయ్యి మంది బీజేపి కార్యకర్తలు స్వచ్చంధ సేవ బృందంగా ఏర్పడి రైతులకు వారి తరహాలోనే సమాధానం చెప్పాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

రైతులకు దెబ్బకు దెబ్బ కొట్టాలంటే వారిని లాఠీలతో కొట్టాలంటూ మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. ఇక ఈ ఘర్షణలలో జైళ్లకు వెళ్లే కార్యకర్తలకు తాము అండగా నిలుస్తామని చెప్పారు. అంతేకాదు.. అన్ని తామే చూసుకుంటామని అన్నారు. జైళ్లకు వెళ్లి రెండు, మూడు, ఆరు నెలలు ఉంటే చాలు మీరు పెద్ద నాయకులు అవుతారు అంటూ ఆయన రెచ్చగొట్టేు వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో మీ పేరును లిఖించాలంటే ఇలాంటి ఘటనలకు పాల్పడాల్సిందేనంటూ యువతను రెచ్చగోట్టారు. కాగా మనోహర్ లాల్ ఖట్టర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విరుచుకుపడింది. రాజ్యాంగబద్దమైన పదవులలో వుంటూ ఇలా రెచ్చగోట్టే వ్యాఖ్యలు చేస్తారా.. అని ప్రశ్నించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles