Detained for last 28 hours without an FIR: Priyanka Gandhi ప్రతిపక్ష నేతపై చట్టాల ఉల్లంఘనలా.?: ప్రియాంక గాంధీ

Have you seen this priyanka gandhi to pm on viral lakhimpur video

priyanka gandhi, priyanka gandhi detained, priyanka gandhi house arrest, Rahul gandhi, Congress lakhimpur kheri, lakhimpur kheri news, lakhimpur kheri violence, lakhimpur kheri protest, Ajay Misra, Ashish Misra, Uttar Pradesh, Politics

Congress general secretary Priyanka Gandhi Vadra, detained at a guest house in UP’s Sitapur, lashed out at the Narendra Modi government for confining her while those who allegedly killed farmers in Lakhimpur Kheri were roaming scot-free.

ITEMVIDEOS: నిందితులకు స్వేచ్ఛ.. పరామర్శలకు శిక్ష, ఇదే బీజేపి చట్టమా.?: ప్రియాంక ఫైర్

Posted: 10/05/2021 02:22 PM IST
Have you seen this priyanka gandhi to pm on viral lakhimpur video

ఉత్తర్ ప్రదేశ్ లోని ల‌ఖింపూర్ ఖేరి ఘ‌ట‌న‌లో రైతుల‌ను పొట్ట‌న‌పెట్టుకున్న కేంద్రమంత్రి అజయ్ కుమార్ మిశ్రా తనయుడు అజయ్ మిశ్రా ద‌ర్జాగా రోడ్ల‌పై తిరుగుతుంటే.. మృతుల కుటుంబాలను పరామర్శించడానికి వచ్చిన త‌న‌ను మాత్రం రాష్ట్రంలోని బీజేపి ప్రభుత్వం అడ్డుకుని.. అకార‌ణంగా నిర్బంధించార‌ని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. తనను అరెస్టు చేసేందుకు ఎలాంటి ఉత్త‌ర్వులూ, ఎఫ్ఐఆర్ లేకుండా త‌న‌ను 28 గంట‌లుగా సీతాపూర్‌లోని పీఏసీ అతిధి గృహంలో నిర్బంధించారని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని ఉద్దేశించి ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు.

ల‌ఖింపూర్ ఖేరిలో రైతుల ఆందోళ‌నలలో చెల‌రేగిన హింస‌లో న‌లుగురు రైతులతో పాటు తొమ్మది మంది మ‌ర‌ణించిన ఘ‌ట‌న‌లో మృతుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన ప్రియాంక గాంధీ స‌హా ప‌లువురు కాంగ్రెస్ నేత‌ల‌ను యూపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే 24 గంటలలోనే అరెస్టు చేసిన వారిని న్యాయస్థానం ఎదుట హాజరుపర్చాల్సి వున్నా.. తనను మాత్రం గత 28 గంటలుగా నిర్భంధంలోనే ఉంచారని చెప్పుకోచ్చారు. బీజేపి ప్రభుత్వాలు చట్టానికి అతీతమా.? చట్టాలను అనుసరించి నడుచుకోవాల అంటూ అమె ప్రశ్నించారు. కనీసం తనను అరెస్టు చేసిన నేపథ్యంలో తనపై మొపబడిన అభియోగాలను కూడా తెలపలేదని దుయ్యబట్టారు.

లఖింపూర్ ఘ‌ర్ష‌ణ‌ల‌కు బాధ్యులైన వారిపై ఎలాంటి చ‌ర్య‌లూ చేప‌ట్ట‌క‌పోవ‌డం ప‌ట్ల ప్రియాంక గాంధీ విస్మ‌యం వ్య‌క్తం చేశారు. నేరం చేసినవారు స్వేచ్ఛాగా తిరుగుతున్నారని, కానీ మృతులను పరామర్శించేందుకు వచ్చిన తనను మాత్రం గత 28 గంటల నుంచి నిర్భంధంలో వుంచారని దుయ్యబట్టారు. దేశంలో రైతుల‌ను బీజేపీ ఎంత‌లా ద్వేషిస్తోంద‌ని ప్రియాంక గాంధీ అంత‌కుముందు ట్వీట్ చేశారు. రైతులు గ‌ళ‌మెత్తితే మోదీ ప్ర‌భుత్వం వారిని కాల్చిచంపుతుంద‌ని, కార్ల‌తో గుద్ది చంపుతోంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ సందర్భంగా లక్నోలో దేశ స్వాత్రంత్య అమృతోత్సవాలకు హాజరవుతున్నారు. వేడుకలను ఘనంగా జరిపిస్తున్నారు.

కానీ నిజంగా దేశానికి వెన్నుముక్కగా నిలిచిన రైతులను ఎందుకు కించపరుస్తున్నారు. రైతులను తమ కార్ల టైర్లతో తొక్కుకుంటూ వెళ్లిన కేంద్రమంత్రి తనయుడిని ఎందుకు అరెస్టు చేయలేదు. సదరు మంత్రిని ఎందుకు బర్తరఫ్ చేయలేదు. కనీసం ఈ వీడియోనైనా మీరు చూశారా అని ప్రశ్నిస్తూ లఖింపూర్ వీడియోను అమె విడుదల చేశారు. కాగా ల‌ఖింపూర్ ఖేరిలో ఆందోళ‌న చేప‌ట్టిన రైతుల‌పై కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి అజ‌య్ మిశ్రా కుమారుడు ఆశిష్ కారు దూసుకువెళ్ల‌డంతో న‌లుగురు రైతులు మ‌ర‌ణించార‌ని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. మ‌రోవైపు ప్రియాంక గాంధీని త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేస్తూ పెద్ద‌సంఖ్యలో కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న దిగారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles