Chirag Paswan, Paras get new party names, symbols బాబాయ్-అబ్బాయ్ పార్టీలకు కొత్త పేర్లు, గుర్తులు

Ec issues new names symbols to ljp factions amid chirag paswan paras feud

Chirag paswan, Election commission, Lok Janshakti Party, Helicopter, Pashupati Paras, Rashtriya Lok Janshakti Party, sewing machine, Kusheshwar Asthan, Tarapur, bungalow, Bihar bypolls, Bihar, Politics

Chirag Paswan and his uncle Pashupati Paras have got new party names and symbols months after they parted ways. The Election Commission's move today comes days after their feud led to a freeze on the Lok Janshakti Party's name and symbol (a bungalow)..

పాశ్వాన్, పరాస్ ల పార్టీలకు ఎన్నికల కమీషన్ కొత్త పేర్లు, కొత్త చిహ్నాలు

Posted: 10/05/2021 05:15 PM IST
Ec issues new names symbols to ljp factions amid chirag paswan paras feud

బిహార్ లోని ఉపఎన్నికల నేపథ్యంలో లోక్ జనశక్తి పార్టీకి చీలిక వర్గాలకు కొత్త గుర్తులు, కొత్త పార్టీ పేర్లను జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. దివంగ‌త రామ్ విలాస్ పాశ్వాన్ కు చెందిన లోక్ జ‌న‌శ‌క్తి పార్టీతో పాటు పార్టీ గుర్తును ఎవరికీ కేటాయించని ఎన్నికల సంఘం.. పార్టీ రెండు వర్గాలుగా చీలిన క్రమంలో ఇధ్దరు పార్టీ నేతలకు వారు కోరుకున్న విధంగా పార్టీ పేర్లను మంజూరు చేసింది. అయితే ఎల్సేజి పార్టీకి చెందిన బంగ్లా గుర్తును మాత్రం ఎవరికీ కేటాయించలేదు. కాగా రామ్ విలాస్ పాశ్యాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ వినతి మేరకు ఆయనకు లోక్ జనశక్తి (రామ్ విలాస్) అని పార్టీ పేరును మంజూరు చేసింది కేంద్ర ఎన్నిక‌ల సంఘం.

ఆ పార్టీకి హెలికాప్ట‌ర్ గుర్తును కేటాయించారు. చిరాగ్‌తో విబేధాల‌కు దిగిన ప‌శుప‌తి కుమార్ పార‌స్‌కు రాష్ట్రీయ లోక్ జ‌న‌శ‌క్తి పార్టీ పేరును కేటాయించిన‌ట్లు ఎన్నిక‌ల సంఘం చెప్పింది. ప‌శుప‌తికి చెందిన పార్టీకి కుట్టు మిష‌న్ గుర్తును ఇచ్చిన‌ట్లు ఈసీ వెల్ల‌డించింది. పార్టీ పేరు, గుర్తుల కోసం చిరాగ్‌, ప‌శుప‌తి మ‌ధ్య కొన్నాళ్లుగా వైరం ఉన్న విష‌యం తెలిసిందే. ఈ అంశంపై వాళ్లు ఇద్ద‌రూ వేరుప‌డ్డారు కూడా. అయితే ఇవాళ కేంద్ర ఎన్నిక‌ల సంఘం దీనిపై క్లారిటీ ఇచ్చింది. చిరాగ్‌, ప‌శుప‌తిల‌కు వేర్వేరు పార్టీ పేర్లు, గుర్తుల‌ను కేటాయిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

పార్టీ పేరు, గుర్తుల‌పై చిరాగ్‌, ప‌శుప‌తి మ‌ధ్య గొడ‌వ జ‌రిగిన నేప‌థ్యంలో ఇటీవ‌ల ఎన్నిక‌ల సంఘం వాటిని సీజ్ చేసింది. బీహార్‌లోని కుశ్వేశ్వ‌ర్ ఆస్తాన‌, తారాపూర్ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈసీ ఆ నిర్ణ‌యం తీసుకున్న‌ది. పార్టీ పేరును ఇద్ద‌రు వాడ‌రాదంటూ ఈసీ చెప్పింది. ఎల్జేపీ వాడే బంగ్లా సింబ‌ల్‌ను కూడా ఎవ‌రూ వాడ‌కూడ‌ద‌ని శ‌నివారం ఎన్నిక‌ల సంఘం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. అయితే మూడు ఇత‌ర గుర్తుల‌ను ఎన్నుకోవాల‌ని రెండు వ‌ర్గాల‌కు ఈసీ సూచ‌న చేసింది. దాని ప్ర‌కారమే ఇవాళ కొత్త గుర్తుల‌ను ఈసీ ప్ర‌క‌టించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles