CTET 2021: Registration process begins సీబీఎస్ఈ నిర్వహించే సీటెట్ కు ప్రారంభమైన అప్లికేషన్లు

Cbse ctet 2021 registration process begins at ctet nic in

ctet, ctet.nic.in, ctet 2021, CTET 2021, CTET Registration, CTET 2021 Notification, CTET Application , CTET Exam 2021, CTET Exam, CTET Exam 2021 Date, cbse, cbse latest news, ctet notification, education news

The CTET 2021 registration begins at ctet.nic.in. The exam is scheduled to be held between December 16 and January 13. The exact date of the exam will be intimated to candidates in the exam admit card.

సీబీఎస్ఈ నిర్వహించే సీటెట్ కు ప్రారంభమైన అప్లికేషన్లు

Posted: 09/20/2021 05:55 PM IST
Cbse ctet 2021 registration process begins at ctet nic in

సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సీటెట్‌) డిసెంబర్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు వచ్చే నెల 19 వరకు అందుబాటులో ఉంటాయి. ఉపాధ్యాయ అర్మత పరీక్షను ఈ ఏడాది ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు సీబీఎస్సీ ప్రకటించింది. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ పరీక్షలో 60 శాతం మార్కులు సాధించినవారిని అర్హులుగా పరిగణిస్తారు.
* అర్హత: బీఈడీ, డీఈడీ చేసి ఉండాలి.
* ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష.
* రాతపరీక్ష: డిసెంబర్‌ 16 నుంచి జనవరి 13 వరకు. రెండు షిప్టులలో ఉదయం, సాయంకాలం పరీక్షలు
* మొదటి షిఫ్ట్‌ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.
* రెండో షిఫ్ట్‌ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష విధానం

* రెండు పేపర్లు ఉంటాయి.
* ఒకటి నుంచి ఆరో తరగతి వరకు మొదటి పేపర్‌,
* ఆరు నుంచి 8వ తరగతి వరకు పేపర్‌-2 ఉంటుంది.
పేపర్‌-1: పరీక్ష మొత్తం 150 మార్కులు.
* ఇందులో చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాగి, ఫస్ట్‌ లాంగ్వేజ్‌, సెకండ్‌ లాంగ్వేజ్‌, మ్యాథమెటిక్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
* ప్రతి సెక్షన్ ‌30 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు.
పేపర్‌-2: మొత్తం 150 మార్కులు
* ఇందులో చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాగి, ఫస్ట్‌ లాంగ్వేజ్‌, సెకండ్‌ లాంగ్వేజ్‌, మ్యాథమెటిక్స్ అండ్‌ సైన్స్‌‌ లేదా సోషల్‌ స్టడీస్‌/సోషల్‌ సైన్స్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
* మొదటి మూడు సెక్షన్ల నుంచి 30 ప్రశ్నల చొప్పున మొత్తం 90 ప్రశ్నలు అడుగుతారు.
* మిగిలిన రెండు సెక్షన్లకు 60 మార్కుల చొప్పున అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో
అప్లికేషన్‌ ఫీజు: రూ.1000, రెండు పేపర్లు అయితే రూ.1200. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.500, రెండు పేపర్లు అయితే రూ.600
-*- ముఖ్యమైన తేదీలు -*-
దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్‌ 20
దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్‌ 20
ఫీజు చెల్లించడానికి చివరితేదీ: అక్టోబర్‌ 19
వెబ్ సైట్‌: ctet.nic.in

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ctet  registration  ctet 2021  ctet 2021 registration  CBSE  Teacher Eligibilty Test  ctet.nic.in  

Other Articles