Row over BJP leader Uma Bharti’s remark on bureaucrats బ్యూరోక్రాట్లపై బీజేపి నాయకురాలు వివాదాస్పద వ్యాఖ్యలు

Bureaucrats there to pick up our slippers says bjp leader uma bharti

In controversial remarks against bureaucracy, senior BJP leader Uma Bharti has said government officials are there only to “pick up our (leaders’) slippers”. As a video containing Bharti’s critical comments against bureaucracy surfaced on social media on Monday, the former Union minister expressed regret over her intemperate language used during an interaction with a delegation.

In controversial remarks against bureaucracy, senior BJP leader Uma Bharti has said government officials are there only to “pick up our (leaders’) slippers”. As a video containing Bharti’s critical comments against bureaucracy surfaced on social media on Monday, the former Union minister expressed regret over her intemperate language used during an interaction with a delegation.

‘‘బ్యూరోక్రాట్లు మా బూట్లు మోస్తారు’’ బీజేపి నాయకురాలు వివాదాస్పద వ్యాఖ్యలు

Posted: 09/20/2021 05:01 PM IST
Bureaucrats there to pick up our slippers says bjp leader uma bharti

కేంద్ర మాజీమంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమాభారతి మరోసారి తన నోటి దురుసును ప్రదర్శించారు. అయితే ఆమె ఏ వేదికలపైన ప్రత్యక్షంగా నోరు జారకపోయినా.. అమె వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట్లో విపరీతంగా చక్కర్లు కోడుతోంది. సహజంగా ఏదైనా వివాదాస్పద వ్యాఖ్యలు వచ్చిన నేపథ్యంలో అవి వారి వ్యక్తిగతం అనే రాజకీయ పార్టీలు వారి నుంచి దూరం జరుగుతాయి.. బీజేపి కూడా సీనియర్ నాయకురాలి విషయంలో అదే పనిచేసింది. ఇప్పటికే పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన ఉమాభారతి.. ఈసారి అధికారులపై అమె చేసిన వ్యాఖ్యలు నోరు అత్యంత వివాదాస్పదం అయ్యాయి.

భోపాల్ లో మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా బ్యూరోక్రాట్‌లపై ఉమాభారతి చేసిన వ్యాఖ్యలతో సరికొత్త వివాదాన్ని రేపారు. మీడియాతో ఇంటరాక్షన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీజేపీకి తలనొప్పిగా తయారైంది. బ్యూరోక్రాట్లు రాజకీయ నాయకుల చెప్పులు ఎత్తుకుంటారని, రాజకీయ నాయకులను నియంత్రించే శక్తి వారికి లేదని ఉమాభారతి తాజాగా వ్యాఖ్యానించి కొత్త వివాదానికి తెరలేపారు. నాయకులను బ్యూరోక్రసీ నియంత్రిస్తుందని మీడియా ఎందుకు అనుకుంటున్నది? అని తిరిగి ప్రశ్నించారు. వాళ్లకు అంత సీన్‌ లేదు. మేం చెప్పినట్లుగానే వినాల్సి ఉంటుందన్నారు. బ్యూరోక్రాట్లతో మొదట ఒంటరిగా మాట్లాడుతాం. వాళ్లు ఫైల్ తయారుచేసి అనుమతి కోసం మా వద్దకు తీసుకువస్తారని చెప్పారు. ‘

కేంద్ర మంత్రిగా 11 ఏండ్లు ఉన్నాను. ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాను. బ్యూరోక్రాట్లతో చర్చించిన మీదట ఫైల్‌ ముందుకు కదులుతుంది. నాయకులను బ్యూరోక్రసీ నియంత్రించడం అనేది అర్థం లేనిది. వాళ్లు మమ్మల్ని కంట్రోల్‌ చేయలేదు. వాళ్లకు అలాంటి పవర్స్‌ లేవు. వాళ్లు జీతాలు, పోస్టింగ్స్, ప్రమోషన్స్‌ అండ్‌ డిమోషన్స్‌.. ఇలా అన్నీ మేమే చూస్తాం. నిజం చెప్పాలంటే, బ్యూరోక్రసీ నెపంతో మేం రాజకీయాలు చేస్తాం’ అని ఉమాభారతి కుండబద్దలు కొట్టారు. ఇలాఉండగా, బ్యూరోక్రాట్‌లపై ఉమాభారతి చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేకే మిశ్రా ఖండించారు. ఆమె ప్రకటన సిగ్గుచేటు అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ఉమాభారతి నుంచి వివరణ కోరాలని, ఈ విషయంపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటన చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uma Bharati  BJP  Madhya Pradesh  OBCs  Digvijaya Singh  social media  Madhya Pradesh Politics  

Other Articles