Petrol, diesel not to come under GST వాహనదారులకు చేధువార్త చెప్పిన కేంద్రం..

Wasn t time to bring petrol diesel under gst nirmala sitharaman

Petrol and diesel, Finance Minister, Nirmala Sitharaman, GST on Petrol and Diesel, Kerala High Court, GST Council, petroleum products, GST on bio-diesel, Revenue Secreatry, Tarun Bajaj, National politics

Union Finance Minister Nirmala Sitharaman stated that the Council decided not to bring petrol and diesel under GST. It is known that the Goods and Services Tax (GST) Council meeting was held on Friday in Lucknow under the chairmanship of Nirmala Sitharaman.

వాహనదారులకు కేంద్రం చేధువార్త.. వ్యాట్ పరిధిలోనే ఇం‘ధనం’..

Posted: 09/18/2021 12:26 PM IST
Wasn t time to bring petrol diesel under gst nirmala sitharaman

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వాహనదారులు ఎంతో ఆశగా శుభవార్త కోసం ఎదురుచూసినా.. వివరాఖరుకు కేంద్రం వారి ఆశలను అడియాశలుగా మార్చింది. దాదాపుగా 20 నెలల తరువాత ఇవాళ భేటీ అయిన జీఎస్టీ మండలి వాహనదారులకు చేధువార్తనే చెప్పింది. ఇంధనాన్ని జీఎస్టీ పరిథిలోకి తీసుకువచ్చేందుకు రాష్ట్రాలు అంగీకరించడం లేదని చెప్పింది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మిలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ సహా పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలో చేర్చబోవడం లేదని ప్రకటించారు.

2019లో భేటీ అయిన తరువాత దాదాపు 20 నెలల అనంతరం శుక్రవారం జీఎస్టీ కౌన్సిల్ 45వ సమావేశాని అమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలన్న ప్రతిపాదనను రాష్ట్రాలన్నీ ముక్తకంఠంతో వ్యతిరేకించాయని చెప్పారు. వాటిని జీఎస్టీలో చేర్చేందుకు ఇది సమయం కాదని అభిప్రాయపడ్డారు. కాగా గత జూన్ మాసంలో ఇంధనంతో పాటు పెట్రో ఉత్సత్తులను జీఎస్సీ పరిధిలోకి తీసుకువచ్చే అంశంపై జీఎస్టీ కౌన్సిల్ సమీక్షించాలని సూచించింది. ఈ మేరకు తమకు అనేక వినతులు వెల్లువెత్తడంతో పాటు రిట్ పిటీషన్లను కూడా దాఖలైన నేపథ్యంలో దీనిని సమీక్షించాలని కేరళ హైకోర్టు కేంద్రాన్ని, జీఎస్టీ కౌన్సిల్ ను కోరింది.

కాగా కేరళ హైకోర్టు సూచన మేరకు ఈ అంశాన్ని అజెండాలో చేర్చి చర్చించామన్న నిర్మలా సీతారమన్.. రాష్ట్రాలు ముక్తకంఠంతో దీనిని వ్యతిరేకించాయిని.. దీంతో ఇప్పుటికీ అనువైన సమయం కాదని కౌన్సిల్ అభిప్రాయపడిందని అమె అన్నారు. సరైన సమయం వచ్చినప్పుడు ఈ అంశంపై మరోమారు చర్చిస్తామని అమె అన్నారు. కేరళా హైకోర్టుకు ఇదే విషయాన్ని తెలియజేస్తామని ఆమె చెప్పారు. కాగా అత్యంత ఖరీదైన కొన్ని లైఫ్ సేవింగ్ డ్రగ్స్ కు జీఎస్టీ నుంచి మినహాయింపు కల్పించాలని కూడా జీఎస్టీ మండలి నిర్ణయించిందని నిర్మల వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles