YS Viveka Murder Case: CBI Conducts Scene Reconstruction వైఎస్ వివేక హత్యకేసు: సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ చేసిన సీబిఐ

Ys viveka murder case cbi conducts scene reconstruction at crime site

YS Vivekananda Reddy, Sunitha, scene reconstruction, Pulivendula House, Driver Dastagiri, CBI, CBI officials, Kadapa, Andhra Pradesh, Crime

CBI officials investigating the murder case of former minister YS Vivekananda Reddy, conducted a scene reconstruction at the leader’s house in Pulivendula. Officials recorded the proceedings of the reconstruction as to how it was done, on how the accused had entered the house, and how they had left on the day of the murder.

వైఎస్ వివేక హత్యకేసు: సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ చేసిన సీబిఐ

Posted: 09/15/2021 09:08 AM IST
Ys viveka murder case cbi conducts scene reconstruction at crime site

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కేంద్ర ద‌ర్యాప్తు బృందం (సీబీఐ) విచార‌ణ కొన‌సాగిస్తోంది. ఇప్ప‌టికే కడప సెంట్రల్ జైలు అతిథి గృహంలో అధికారులు పలువురిని విచారించిన విష‌యం తెలిసిందే. ఈ హత్యకేసులో వినియోగించిన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకుని న్యాయస్థానంలో సమర్పించిన సీబీఐ అధికారులు.. ఈ కేసులో మరిన్నీ కీల‌క వివ‌రాలు రాబ‌ట్టారని సమాచారం. వాటి ఆధారంగా త‌దుప‌రి విచార‌ణ కొన‌సాగిస్తున్నారు. వైఎస్ వివేకనందరెడ్డి కారు డ్రైవర్ గా పనిచేసిన దస్తగిరి అదుపులోకి తీసుకున్న సీబిఐ అధికారులు అతని నుంచి రాబట్టిన సమాచారంతో కేసు విచారణను కొనసాగిస్తున్నారు.

వివేక హత్య కేసులో భాగంగా సీబీఐ బృందం పులివెందులకు చేరుకుంది. వివేక నివాసంలో రెండవ రోజు సీన్ రీకన్‌స్ట్రక్షన్ జ‌రుగుతోంది. అప్ప‌ట్లో వివేక హత్య జరిగిన స‌మ‌యంలో ఆయ‌న‌ నివాసంలోకి ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి నివాసంలోకి ప్రవేశించారు.. ఆయనను హత్య చేసిన తరువాత ఎవరెవరు ఎలా ఘటనాస్థలం నుంచి పారిపోయారనే విష‌యంపై సీబీఐ ఆరా తీస్తోంది. ఆ రోజు రాత్రి ఎవరెవరు ఇంట్లో తిరిగారు? అనే దానిపై వివ‌రాలు రాబ‌డుతోంది. షార్ట్ లెటర్స్‌తో టీషర్ట్‌లు వేయించి సీబీఐ బృందం రిహార్సల్స్ చేయిస్తోంది. వాటిపై  సునీల్, దస్తగిరి, ఉమాశంకర్, రంగన్న పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles