National-level player found dead on railway track in UP దళిత క్రీడాకారిణిపై అత్యాచారం.. హత్య.!

National level player found dead with clothes dishevelled on railway track in up s bijnor

national-level kho kho player, Dalit sportswoman, railway track, Bijnor railway station, Bijnor rape and murder, Kho Kho player rape and murder, dalit sportswoman rape and murder, uttar pradesh rape and murder, kho kho player, sports woman, national player, bijnor, railway track, rape and murder, dalit woman, Bijnor, Uttar Pradesh, crime

A 24-year-old national-level kho kho player was found dead on a railway track in Uttar Pradesh's Bijnor, merely 100 metres away from her home.Her body was found in a pool of blood and she had strangulation marks on her neck, a broken tooth and other injury marks. Her clothes were dishevelled. The family has alleged that she was raped.

జాబ్ ఇంటర్వ్యూకు వెళ్లి.. రైలు పట్టాలపై శవమైన ​జాతీయ ఖోఖో క్రీడాకారిణి..

Posted: 09/14/2021 09:06 PM IST
National level player found dead with clothes dishevelled on railway track in up s bijnor

ఉత్తరప్రదేశ్ ఓ జాతీయ ఖోఖో క్రీడాకారిణిని దారుణ రీతిలో హత్య చేసిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. దళితవర్గాలకు చెందిన యువతులపై జరగుతున్న అత్యాచారాలు చివరకు జాతీయస్థాయిలో ప్రాతినిథ్యం వహిస్తున్న దళిత క్రీడాకారిణి వరకు చేరాయి. 24 ఏళ్ల ఆ క్రీడాకారిణి బిజ్నోర్ రైల్వే స్టేషన్ లో తీవ్ర గాయాలతో, విరిగిన పన్ను, గోంతు, శరీరం పై రక్తపు గాయాలతో శవమై కనిపించింది. ఇంతటి దారుణానికి పాల్పడింది ఎవరో తేల్చే విషయంలోనూ పోలీసులు మీనమేషాలు లెక్కబెడుతూ.. అది తమ పరిధి కాదని, రైల్వే పోలీసులు పరిధి కాబట్టి వారే కేసు నమోదు చేయాలని చెప్పడం బాధితురాలి కుటుంబసభ్యులను తీవ్ర కలతకు గురిచేసింది.

పోలీసుల కథనం ప్రకారం... సెప్టెంబరు 10న మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. దళిత సామాజిక వర్గానికి చెందిన ఈ యువతి ఓ ఉద్యోగ ఇంటర్వ్యూకి వెళ్లి ఇంటికి తిరిగివెళ్లే క్రమంలో బిజ్నోర్ రైల్వే స్టేషన్ కు వచ్చింది. అక్కడ షాజాద్ అలియాస్ హమీద్ అనే వ్యక్తి కూలీగా పనిచేస్తున్నాడు. ఆ ఖోఖో క్రీడాకారిణి ఒంటరిగా ఉండడంతో ఆమెపై కన్నేసిన హమీద్... ఆమెను సిమెంటు స్లీపర్ల చాటుకు లాక్కెళ్లాడు. ఆ సమయంలో ఆమె ఓ ఫ్రెండ్ తో ఫోన్ కాల్ మాట్లాడుతుండగా, ఆమె కేకలు అవతలి వ్యక్తికి కూడా వినిపించాయి.

కొంచెం సేపటి తర్వాత ఆమె అరుపులు ఆగిపోయాయి. ఆమె ప్రతిఘటించడంతో హమీద్ ఆమె మెడకు దుపట్టా బిగించి హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఆపై, నిందితుడు ఆమె మొబైల్ ఫోన్ తో పరారయ్యాడని తెలిపారు. సిమెంటు స్లీపర్ల చాటున రక్తపుమడుగులో పడి ఉన్న ఆ యువతిని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కాగా, ఆమెపై అత్యాచారం చేసి చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హత్యకు పాల్పడిన హమీద్ ఇంటికి చేరుకున్న తర్వాత ఆమె ఫోన్ స్విచాఫ్ చేశాడు.

టెక్నాలజీ ఆధారంగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి చొక్కాపై రక్తపు మరకలు పడగా, వాటిని అతడి భార్య ఉతికి శుభ్రం చేసినట్టు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలంలో ఓ చెప్పు, రెండు చొక్కా గుండీలు లభ్యమయ్యాయి. కాగా, ఆమె ఫ్రెండ్ ఫోన్ కాల్ ఆడియో క్లిప్పింగ్ ను పోలీసులకు అందజేయడం కేసు విచారణలో ఎంతో ఉపకరించింది. నిందితుడు మాదకద్రవ్యాలకు బానిస అయ్యాడని, అతడికి భార్య, ఓ కుమార్తె ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles