Ganapati Bappa offered prayers in church by Christians చర్చిలో వినాయకుడు.. క్రిస్టియన్ల ప్రార్థనలు..

Hindu god lord ganapati offered prayers in church by christians

Ganesh Maharaj, god vinayaka, Hindus God, Ganapati bappa in Church, lord Ganesha chirstians prayers, prayers offered to lord ganapati, good gesture, church Father, Spain, Indians, Ganapati bappa, viral video, Viral news, Trending news

In Spain, Indians who organized the Ganesh festival asked the Church if they could take the Ganesh ji from the Church’s way. The church father asked them to bring Ganpati Bappa inside the church so that both Gods can meet with each other.

ITEMVIDEOS: చర్చిలో క్రిస్టియన్ల ప్రార్థనలను అందుకున్న వినాయకుడు..

Posted: 09/08/2021 07:58 PM IST
Hindu god lord ganapati offered prayers in church by christians

వినాయక చవితి పండుగ పర్వదినానికి మరో రెండు రోజుల సమయం ఉన్నా.. హిందువులు మరీ ముఖ్యంగా యువత గణనాధులను తమ మండపాలకు తీసుకువచ్చేందుకు అప్పడే అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు. అనేక మంది తమకు నచ్చిన వినాయక విగ్రహాలను తమ మండపానికి తీసుకువచ్చి పెట్టేస్తారు. ఇక ఇప్పటికే గణపతి మండపాల నిర్మాణాలు కూడా పూర్తై.. కేవలం అలంకరణ మాత్రమే మిగిలివుండేలా చూసుకుంటారు. పలు చోట్ల అలంకరణ కూడా ముగించేసి.. ఇక వినాయక ప్రతిష్టను చేసే కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేస్తుంటారు.

అయితే స్పెయిన్ లోని హిందువులు కూడా ఓ సంఘంగా ఏర్పాటి ప్రతీ ఏడాది అక్కడ గణపతిని ప్రతిష్టించి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఈ సారి అక్కడి హిందువులు ఏర్పాటు చేసుకున్న మండపాన్నికి వెళ్లే మార్గంలో ఓ చర్చి ఉంది. దీంతో వారికి ఏమైనా అభ్యంతరాలు వున్నాయోమోనని తెలుసుకునేందుకు వారు చర్చి ఫాదర్ ను కలసారు. దీంతో విషయం అర్థమైన చర్చి ఫాదర్.. ఈ మార్గాన్ని గణపయ్య తీసుకువచ్చేందుకు నిరభ్యంతరంగా వినియోగించు కోవాలని సమ్మతి తెలపడంతో పాటు తమ చర్చిలోకి కూడా తీసుకురావాలని కోరారు. అప్పుడు ఇద్దరు దేవుళ్లు కొంత సేపు మాట్లాడుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు.

దీంతో ఇవాళ ఉదయం హిందూ సంఘం ఆధ్వర్యంలో గణపయ్యను మండపాన్ని తీసుకువెళ్తూన్న భక్తులు.. భజనలు, కీర్తనల మధ్య చర్చి వద్దకు చేరుకున్నారు. ఇక చర్చి ఫాదర్ కోరిక మేరకు చర్చిలోనికి కూడా తీసుకెళ్లారు. అంతే ఒక్కసారిగా అక్కడి వాతావరణం మారిపోయింది. అప్పటివరకు చర్చిలో బైబిల్ పఠనం, ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవులు ఒక్కసారిగా చేతులు జోడించి బోజ్జ గణపయ్యకు నమస్కారాలు చేశారు. అంతేకాదు చర్చిలోని యేసు కీర్తనలతో బొజ్జ గణపయ్యను కీర్తించారు. చిన్నాపెద్దా అంతా కలసి చర్చిలో అలుముకున్న అహ్లాదకర, సామరస్యపూర్వక వాతావరణాన్ని తమ కరతాళధ్వనుల ద్వారా హర్షం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ganesh Maharaj  Ganapati bappa  Church  prayers  christians  good gesture  HIndu God  Viral video  Trending  

Other Articles