Hair-Raising Rescue Of Snake Hiding In Scooter పడగ తీసి.. కోరలు చాచిన నాగుపాము..

Watch the hair raising rescue of snake hiding in scooter

Snake rescue, Susanta Nanda, Snake video, Rescue Of Snake, Snake Hiding In Scooter, large water container, Twitter, social media, viral video

A hair-raising video shows the moment a snake emerged from inside a scooter and the novel method used to rescue it. The video shows the snake - which some on Twitter identified as a cobra - raising its head from inside the scooter as several people filmed the scene on their mobile phones. It goes on to show a man using a large water container to capture the reptile.

ITEMVIDEOS: పడగ తీసి.. కోరలు చాచి.. స్కూటీలోంచి వాటర్ క్యాన్ లోకి త్రాచు..

Posted: 09/08/2021 06:58 PM IST
Watch the hair raising rescue of snake hiding in scooter

వర్షాకాలంలో అందులోనూ వర్షాలు అధికంగా కురుస్తున్న నేపథ్యంలో భూమిలో లేదా పుట్టల్లో జీవించే పాములకు ఎంత కష్టమో.? అయితే వీటి విషయం మాత్రం ఎవరికీ పట్టదు. దీంతో అవి నీటి తడి లేని ప్రాంతాలను వెతుక్కుంటూ వెళ్లి తలదాచుకుంటాయి. ఇక తెలంగాణలో అందులోనూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఓ నాగుపాము కూడా ఇలానే సురక్షిత ప్రాంతమని భావించి ఓ స్కూటీలోకి దూరింది. అయితే దానికి అది అంత సురక్షితం కాదని తెలిసి.. తన వద్దకు వచ్చేవారిని కాటు వేస్తానని.. ఓ చిన్న రంద్రం ద్వారా కోరలు బయటకు చాస్తూ.. ఓ కంటితో చూస్తూ హెచ్చరించింది.

మామూలుగానే పామును చూస్తేనే భయభ్రాంతులకు గురైయ్యే జనం.. అందులోనూ నాగుపాము.. ఇక అది కూడా కోరలు చాస్తూ హెచ్చరిస్తూనే వుంది. దీంతో అక్కడున్న వారందరూ తీవ్ర భ‌య‌భ్రాంతుల‌కు గురయ్యారు. దీంతో స్థానికలు స్నేక్ క్యాచర్ (పాములు ప‌ట్టే వ్య‌క్తి)కు ఫోన్ చేశారు. అయితే అతడు విషపూరితమైన నాగుపామును పట్టుకున్న తీరు అత్యంత ప్రమాదకరమని అంటున్నారు నెట్ జనులు. ఆయన పామును పట్టుకున్న వీడియోలను తమ సెల్ ఫోన్లలో బంధించిన స్థానికులు దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.  ఈ వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ సుశాంత నంద త‌న ట్విటర్ పేజీలో పోస్టు చేశారు.

అయితే స్నేక్ క్యాచర్ పామును ఎలా పట్టాడో తెలుసా..? ఓ స్కూటీ ముందు భాగంలో నాగుపాము దూరిందని సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ ఓ రాడ్ తోఅక్కడకు చేరుకుని స్కూటీ టాప్ ను ఆ రాడ్ తో బలంగా లాగడంతో అది కాస్తా ఊడిరాగా, అందులోంచి చటుక్కున నాగుపాము బయటకు వచ్చింది. ఓ 20 లీటర్ల వాటర్ క్యాన్ ను తీసుకుని దానిలోకి నాగుపామును దూర్చాడు. తొలి ప్రయత్నంలో పాము పసిగట్టి తప్పించుకుంది. రెండో ప్రయత్నంలో అది అందులోకి దూరింది. ఇక దానికి కవర్ పెట్టి క్యాన్ లో బంధించాడు. ఇలా అత‌ను అక్క‌డికి చేరుకుని పామును రెండు నిమిషాల వ్యవధిలో పట్టుకుని బంధించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles