Actor Rana Daggubati appears before ED in drugs case డ్రగ్స్ కేసులో రానా విచారణ పూర్తి.. 7 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ

Tollywood drugs case rana daggubati comes out from ed office in hyderabad

Tollywood drug scandal news, Rana Daggubati news, Rana Daggubati drugs case, rakul preet singh, enforcement directorate, Hyderabad Police, crime

Tollywood actor Rana Daggubati of 'Bahubali' fame has appeared before the Enforcement Directorate on Wednesday in connection with the drug scandal. ED has asked the actor to explain his banking transactions. Rana is one of the 12 Tollywood celebrities who were asked to appear before ED in connection with the 2017 drug scandal.

డ్రగ్స్ కేసులో రానా విచారణ పూర్తి.. 7 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ

Posted: 09/08/2021 08:45 PM IST
Tollywood drugs case rana daggubati comes out from ed office in hyderabad

టాలీవుడ్‌ డ్రగ్‌ కేసు, మనీలాండరింగ్‌ కేసులో హీరో రానా దగ్గుబాటి విచారణ ముగిసింది. రానా ఎన్ ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌ ​(ఈడీ) విచారణకు ఇవాళ ఉదయం హాజరైన సంగతి తెలిసిందే. దాదాపు 7 గంటల పాటు విచారణ కొనసాగింది. బ్యాంకు ఖాతాలతో పాటు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను రానా తన వెంట విచారణకు తీసుకొచ్చారు. ఆడిటర్స్‌, అడ్వకేట్స్‌తో కలిసి ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. పీఎంఎల్ఏ (PMLA) కేసులో మొదటిసారి రానా పేరు  తెరపైకి వచ్చింది. దీంతో మెదటిసారి సినీతారల డ్రగ్స్ కేసులో రానా విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

ప్రధాన నిందితుడు కెల్విన్‌తో లావాదేవీలపై రానాను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తనకు కెల్విన్‌ ఎవరో తెలియదని రానా చెప్పినట్లు సమాచారం. మనీ లాండరింగ్‌ కోణంలో 2015 నుంచి 2017 వరకు రానా బ్యాంకు ఖాతాల లావాదేవీలను అధికారులు పరిశీలించి, అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీశారు. ఇక​ ఎఫ్‌ క్లబ్ విషయమై రానాను పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే డ్రగ్స్ విక్రేత కెల్విన్‌తో పాటు సినీ ప్రముఖులు పూరీ, ఛార్మి, రకుల్‌, నందులను విచారించిన అధికారులు వారి వద్ద నుంచి కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles