No by-poll for Huzurabad, Badwel in the near future! పండుగల వరకు హూజూరాబాద్ ఉపఎన్నిక హుళ్లక్కే.!

By poll for huzurabad badwel after festive season says election commission

By-polls, Huzurabad assembly, Telangana, Badwel assembly, Andhra Pradesh, West Bengal, Odisha, Election commission of India, National Politics

The much-awaited by-elections to Huzurabad assembly seat in Telangana and Badwel assembly seat in Andhra Pradesh are not going to be held in the near future. The Election Commission of India made it clear in a statement on Saturday that the by-elections to these two assembly seats, along with 30 other vacancies in various state legislative assemblies and Union territories

పండుగల వరకు హూజూరాబాద్ ఉపఎన్నిక హుళ్లక్కే.!

Posted: 09/04/2021 04:22 PM IST
By poll for huzurabad badwel after festive season says election commission

తెలంగాణ‌లో హీట్ ఎక్కిస్తున్న హుజూరాబాద్ ఉపఎన్నికలను పండుగ‌ల సీజ‌న్ ముగిసిన తర్వాతనే నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేరకు రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించాయి. పండుగ‌ల సీజ‌న్ త‌ర్వాతే తమ రాష్ట్రాల్లో ఉపఎన్నికలు నిర్వహించాల‌ని తెలుగు రాష్ట్రాల ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు ఎన్నికల సంఘానికి విజ్ఞ‌ప్తి చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాలతోపాటు మ‌రో 12 ఇత‌ర రాష్ట్రాలు కూడా క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం, భారీ వర్షాలు, వ‌ర‌ద‌లు, పండుగ‌ల నేప‌థ్యంలో త‌మ రాష్ట్రాల్లో ఉపఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ శ్రేయ‌స్క‌రం కాద‌ని పేర్కొన్నారు. దాంతో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆయా రాష్ట్రాల విజ్ఞ‌ప్తుల‌ను మ‌న్నించి ఉప ఎన్నిక‌ల షెడ్యూల్ ఇవ్వ‌లేదు.

కానీ, ప‌శ్చిమ‌బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు మాత్రం ఉపఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు సుముఖ‌త వ్య‌క్తంచేశాయి. తమ రాష్ట్రాల్లో కరోనా పూర్తిగా అదుపులో ఉందని పశ్చిమ బెంగాల్‌, ఒడిశా ప్రధాన కార్యదర్శులు ఎన్నిక‌ల సంఘానికి లేఖ‌లు రాశారు. ఉపఎన్నికలు నిర్వహించే నియోజకవర్గాల్లో వరద ప్రభావం ఏమాత్రం లేదని, పూర్తి స్థాయిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని బెంగాల్‌ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో ఈసీ బెంగాల్ లో మూడు శాసనసభ నియోజకవర్గాలకు, ఒడిశాలో ఒక శాసనసభ నియోజకవర్గానికి ఉపఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల చేసింది. ఈ నెల 30న ఉపఎన్నిక‌లు జ‌రిపి అక్టోబర్ 3న ఓట్ల లెక్కింపు జరుపనున్నారు.

ఈసీ షెడ్యూల్ ప్ర‌కారం.. బెంగాల్లోని భ‌వానీపూర్‌, షంషేర్‌గంజ్‌, జాంగీర్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గాలకు, ఒడిశాలోని పిప్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఈ నెల 30న ఉప ఎన్నికలు జరుగ‌నున్నాయి. ఈ నెల 1న సీఎస్‌ల‌తో స‌మావేశ‌మైంది. ఈ స‌మావేశంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ స‌హా 12 రాష్ట్రాల సీఎస్‌లు ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు విముఖ‌త వ్య‌క్తం చేశార‌ని ఈసీ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం, పలు పరిశోధన సంస్థలు, సాంకేతిక నిపుణుల కమిటీలు, పలువురు నిపుణులు మూడో దశ కరోనా ప్రభావంపై ఇప్పటికే చేసిన హెచ్చరికలను కూడా దృష్టిలో పెట్టుకున్నామ‌ని పేర్కొన్న‌ది. కేంద్రం కూడా మూడో దశ కరోనా ప్రభావం గురించి రాష్ట్రాలకు పలు సూచనలు, మార్గదర్శకాలు ఇచ్చిన విష‌యాన్ని ఈసీ గుర్తుచేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles