SC To Take Up Young Girl's Letter as PIL ప్రజాప్రయోజన వ్యాజ్యంగా బాలిక లేఖ: సుప్రీంకోర్టు

Supreme court to take up young girl s letter to chief justice on physical hearings

Chief Justice of India, NV Ramana, Justice Vineet Saran, Schools re-open, coronavirus, pandemic, supreme court, public interest litigation (PIL), Young girl, covid-19

A letter from a young girl to Chief Justice of India (CJI) NV Ramana has prompted the Supreme Court to register a public interest litigation (PIL) petition on courts resuming in-person hearings completely. Supreme Court judge Justice Vineet Saran today referred to a letter that a young girl has written to CJI, on courts beginning in-person hearings which were stalled last year due to the coronavirus pandemic.

ప్రజాప్రయోజన వ్యాజ్యంగా బాలిక లేఖను నమోదు చేసిన సుప్రీంకోర్టు

Posted: 09/04/2021 05:19 PM IST
Supreme court to take up young girl s letter to chief justice on physical hearings

దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. దేశ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు ఓ బాలిక లేఖ రాయగా, ఆ లేఖను ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యంగా సుప్రీంకోర్టు నమోదు చేసుకుంది. దేశంలో పాఠశాలలు తెరుచుకోవడంపై ఆ బాలిక సీజేఐకి లేఖ రాసింది. పాఠశాలల ప్రత్యక్ష తరగతుల నిర్వహణతో న్యాయస్థానాలతో న్యాయవాదుల వాదనలను పోల్చిన బాలిక.. పాఠశాలలను తెరుచుకోవడంపై తీర్పును వెలువరించిన న్యాయస్థానం.. కోర్టులకు మాత్రం ఎందుకు ఆ నిబంధనలు వర్తించవని ప్రశ్నించడంతో.. బాలిక రాసిన లేఖను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పిల్ గా నమోదు చేయాలని అదేశించారు.

పాఠశాలలు తెరుచుకోగా, కోర్టులు మాత్రం ఇప్పటికీ ప్రత్యక్ష కార్యకలాపాలకు దూరంగా వర్చువల్ విధానంలోనే కార్యాచరణ కొనసాగిస్తున్న వైనాన్ని ఆ బాలిక తన లేఖలో ప్రస్తావించింది. స్కూళ్లు తెరుచుకున్నప్పుడు కోర్టులు ఎందుకు తెరుచుకోవు? అని బాలిక ప్రశ్నించింది. సీజేఐని సన్మానించేందుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వినీత్ శరణ్ ఈ మేరకు వెల్లడించారు. ఈ లేఖను సీజేఐ ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించారని, త్వరలోనే దీనిపై విచారణ జరగనుందని తెలిపారు.

కరోనా మహమ్మారి వెలుగుచూసినప్పటి నుంచి దేశంలో కోర్టులు వర్చువల్ విధానంలోనే విచారణలు కొనసాగిస్తున్నాయి. న్యాయ వ్యవస్థ 2020 మార్చి నుంచి ఆన్ లైన్ విధానంలో నడుస్తోంది. సుప్రీంకోర్టులో సెప్టెంబరు 1 నుంచి పాక్షికంగా ప్రత్యక్ష విచారణకు అనుమతించినా, కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవుతారో, లేక వర్చువల్ గా వాదనలు వినిపిస్తారో న్యాయవాదులే నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించారు. అయితే న్యాయవాదుల్లో అత్యధికులు ఇప్పటికీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించేందుకే మొగ్గు చూపుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles