తాను ఒకటి తలిస్తే.. దైవం మరోకటి తలచిందని పెద్దల నానుడి. అయితే దీనిని సందర్భానుచితంగా వాడుకోవడం మనకు మామూలే. ఇప్పుడు ఓ మహిళ విషయంలనూ అదే జరిగింది. అమె ఒకటి తలచి స్మిమ్మింగ్ పూల్ లోని నీటిలోకి దూకింది. కానీ అనుకోకుండా మరోటి జరగి అబాసు పాలైంది. ఓస్ అంతేనా అంటారా.. ఇప్పుడామె వీడియో ప్రపంచవ్యాప్తంగా అంతర్జాలంలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసిన వాళ్లు నవ్వును అపుకోలేకపోతున్నారు. అంతేకాదు నెట్టిజన్లు కూడా ఒక్కోక్కరు ఒక్కోలా స్పందిస్తూ.. వీడియోకు లైకులు, షేర్లు పెంచుతున్నారు.
అసలేం జరింగంటే.. అమె తన తలను నీటిలో తడవనీకుండా తీసుకున్న చర్యలే అమెను అబాసుపాలు చేసింది. అదెలా అంటే.. తన జట్టు తడవనీయకుండా అమె తన తలకు ఓ వీగ్ ను పెట్టుకోగా అది కాస్తా అమె జంప్ చేయగానే ఊడిపడింది. ఈ ఘటన చూడగానే అక్కడున్న వారు నవ్వు ఆపుకోలేకపోయారు. జార్జియాకు చెందిన కొందరు స్నేహితులు ఈత కోసం ఒక స్మిమ్మింగ్ పూల్‌కు వెళ్లారు. గ్రూప్‌లోని ఒక మహిళ డైవింగ్ బోర్డు పైనుంచి పూల్‌లోకి దూకింది. అయితే ఆమె తలకు ఉన్న విగ్ ఊడి డైవింగ్ బోర్డుపై పడింది. దీనిని చూసి అక్కడున్న వారు తెగ నవ్వుకున్నారు.
కాగా, అమెకు చెందిన ఈ నవ్వులు పూయించే వీడియోను అమె స్నేహితులు చిత్రీకరించగా, ‘హోల్డ్ మై బీర్’ ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘జుట్టు తడవడం ఆమెకు ఇష్టం లేదు’ అందుకనే అమె తన జట్టుకు విగ్ ను ఏర్పాటు చేసుకుంది. కానీ ఇలా జరగిందని దీనికి క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోపై నెటిజన్లు పలు కామెంట్లు చేశారు. ‘ఏమి జరుగుతుందో తెలుసుకుని ఆ జుట్టు తనను తాను కాపాడుకుంది’ అని ఒకరు, ‘పూల్‌లోకి దిగేందుకు ఇష్టపడని విగ్’ అని మరొకరు కామెంట్ చేశారు. విగ్ టిప్స్ కోసం మోహన్ లాల్, మమ్ముట్టిని ఆమె అడిగి ఉండాల్సిందని, మిషన్ విజయవంతంగా విఫలమైందంటూ మరికొందరు చమత్కరించారు.
She didn’t want to get her hair wet. pic.twitter.com/Dp9JcsRDQ8
— Hold My Beer (@HldMyBeer) August 29, 2021
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more