RTC bus wheels, rear axle come off while on the run రన్నింగ్ లో ఊడిన బస్సు చక్రాలు.. డ్రైవర్ చాకచక్యంతో తప్పిన ప్రమాదం

Rtc bus driver prevents mishap after wheels rear axle come off

APSRTC, RTC Bus, Agency area, East Godavari, tyres and rear axle come off, driver prevents mishap, Pathakota, Maredumilli, Andrha Pradesh, crime

Wheels and rear axle of a running RTC bus came off suddenly in East Godavari district on Saturday. On sensing danger, driver applied brakes and stopped the bus immediately. The mishap took place when the bus was heading to Pathakota from Maredumilli in the Agency area.

ITEMVIDEOS: రన్నింగ్ లో ఊడిన బస్సు చక్రాలు.. డ్రైవర్ చాకచక్యంతో తప్పిన ప్రమాదం

Posted: 09/04/2021 01:42 PM IST
Rtc bus driver prevents mishap after wheels rear axle come off

ఏపీలో వరుసగా ఆర్టీసీ బస్సు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళకు గురి చేస్తున్నాయి. నిన్నటికి నిన్న కర్నూల్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. అనంతపురం నుంచి కర్నూల్ వెళ్తున్న బస్సు డోన్ పట్టణంలోని ఫ్లైఓవర్‌పై అదుపుతప్పింది. ఫ్లైఓవర్​పై కారును తప్పించబోయి ఆర్టీసీ బస్సు రక్షణ గోడను ఢీకొట్టింది. ముందు టైర్ గాల్లో వేలాడుతూ అక్కడే ఆగిపోయింది. కొద్దిగా ముందుకు దూసుకెళ్లి ఉంటే పెనుప్రమాదం జరిగేది. ఈ ఘటన ఇంకా మరిచిపోక ముందే తూర్పుగోదావరి జిల్లాలో మరో ఆర్టీసీ బస్సు రన్నింగ్ లో ఉండగానే.. ప్రగతి చక్రాలు ఊడిపోయాయి. అనుభవజ్ఞడైన డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పింది.

జిల్లాలోని గోకవరం మండలం గుర్తేడుపాతకోటకు వెళ్లే ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు చక్రాలు రన్నింగ్ లోనే ఊడిపోయాయి. ఒక్కసారిగా అలా టైర్లు ఊడిపోవడంతో డ్రైవర్ వెంటనే బస్సును కంట్రోల్ లోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. అయితే, ప్రయాణికులెవరికీ ఏమి కాలేదు. ఎలాంటి నష్టం, గాయాలు జరగకుండా ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడటంతో డ్రైవర్, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్పును ప్రమాదానికి గురైనా ప్రయాణికులు ఏలాంటి గాయాలు కాకుండా బస్సును నిలిపేసిన డ్రైవర్ కు ప్రయాణికులు ప్రశంసిస్తున్నారు. కాగా ప్రమాద ఘటన సమయంలో బస్సు మెల్లిగానే వెళ్లడం కూడా టైర్లు ఊరిపోగానే అదుపు చేయడంలో దోహదపడిందని ప్రయాణికులు చెబుతున్నారు.

అయితే, బస్సు చక్రాలు ఊడిపోవడంపై సమాచారం అందుకున్న స్థానిక గ్రామాల ప్రజలు మాత్రం తమ రోడ్ల పరిస్థితిని ఏకరువు పెడుతున్నారు. తమ గ్రామాల నుంచి ద్విచక్రవాహనాలపై వెళ్తున్నా రోడ్డుపై వున్న గోతుల్లో పడటం వల్ల వారానికో పర్యాయం సర్విసింగ్ చేయాల్సి వస్తుందని.. ఇప్పటికైనా ఉచిత పథకాలను అపి.. రోడ్డు, విద్యుత్ సహా మౌలిక వసుతుల కల్పనపై దృష్టి సారించాలని అంటున్నారు. కాగా, మెయింటెనెన్స్ ఇష్యూస్ వల్లే బస్సు చక్రాలు ఊడిపోయినట్లు స్థానికులు అంటున్నారు. అయితే, డిపోల్లో బస్సులు వెళ్లే ముందర రెగ్యులర్ చెకప్ సరిగా చేయకపోయి ఉండటం వల్ల ఇలా చక్రాలు ఊడిపోయాయని మరికొందరు అంటున్నారు. బస్సు చక్రాలు ఊడిపోవడం విషయమై ఆర్టీసీ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే సురక్షిత ప్రయాణాలకు ప్రజలు ప్రజారవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీకే ప్రయారిటీ ఇస్తుండటం మనం చూడొచ్చు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles