British-era tunnel connecting Delhi Assembly to Red Fort ఢిల్లీ అసెంబ్లీ నుంచి ఎర్రకోటకు సొరంగ మార్గం..

British era tunnel connecting delhi legislative assembly to red fort found

secret tunnel at delhi assembly, tunnels in delhi, secret tunnel in delhi, delh assemply red fort, red fort secret tunnel, secret tunnel, delhi assembly, red fort, Delhi Assembly Speaker, Ram Niwas Goel, Britishers, reprisal, freedom fighters, Delhi, National

A secret tunnel connecting the Delhi Legislative Assembly to Red Fort was found at the assembly on Thursday. According to reports, the tunnel was used by Britishers to avoid reprisal while moving freedom fighters.

ఆంగ్లేయుల కాలం నాటి సొరంగ మార్గం.. ఢిల్లీ అసెంబ్లీ నుంచి ఎర్రకోటకు..

Posted: 09/03/2021 01:25 PM IST
British era tunnel connecting delhi legislative assembly to red fort found

దేశ రాజ‌ధాని ఢిల్లీలో బ్రిటీష‌ర్లు అప్పట్లో వినియోగించిన సొరంగ మార్గం ఒక‌టి బ‌య‌ట‌ప‌డింది. ఢిల్లీ అసెంబ్లీ హాలులోని ఓ గదిని దేశ స్వాతంత్ర్య సమరయోధుల కోసం కేటాయించే పనిలో భాగంగా జరుగుతున్న పనులలో ఆ ట‌న్నెల్ ను గుర్తించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఉవ్వెత్తున్న తమ గళాన్ని వినిపించిన స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల‌ను బంధించిన ఆంగ్లేయులు.. అప్పట్లో ఉద్యమకారుల నిరసనలు, అందోళనలతో ఎలాంటి అటంకం లేకుండా వారిని న్యాయస్థానానికి త‌ర‌లించేందుకు ఆ సొరంగాన్ని బ్రిటీష‌ర్లు వినియోగించిన‌ట్లు తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ నుంచి ఎర్ర‌కోట వ‌ద్ద‌కు ఆ సొరంగ మార్గం ఉన్న‌ట్లు గుర్తించారు.

దేశాన్ని బ్రిటీష‌ర్లు పాలించిన స‌మ‌యంలో ఆ మార్గం ద్వారా ఫ్రీడ‌మ్ ఫైట‌ర్ల‌ను త‌ర‌లించిన‌ట్లు ఢిల్లీ అసెంబ్లీ స్పీక‌ర్ రామ్ నివాస్ గోయ‌ల్ తెలిపారు. 1993లో ఎమ్మెల్యేగా ఎన్నికైన‌ప్పుడు తాను దీని గురించి వినేవాడిన‌ని, రెడ్ ఫోర్ట్‌కు అసెంబ్లీ నుంచి సొరంగ మార్గం ఉన్న‌ట్లు చెప్పేవార‌ని, దాని చ‌రిత్ర గురించి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశాన‌ని, కానీ క్లారిటీ రాలేద‌ని ఆయ‌న అన్నారు. అయితే ఇప్పుడు ఆ ట‌న్నెల్‌కు చెందిన ముఖ‌ ప్ర‌దేశాన్ని గుర్తించామ‌న్నారు. కానీ ఆ ట‌న్నెల్‌ను ఇప్పుడు తొవ్వ‌డం లేద‌ని, ఎందుకుంటే ఆ మార్గంలో మెట్రో పిల్ల‌ర్లు, సీవేజ్ నిర్మాణాలు ఉంటాయ‌న్నారు.

1912లో కోల్‌క‌తా నుంచి ఢిల్లీకి రాజ‌ధానిని మార్చేశారు. అంత‌క‌ముందు ఢిల్లీ అసెంబ్లీని సెంట్ర‌ల్ లెజిస్టేటివ్ అసెంబ్లీగా వాడేవారు. అయితే 1926లో అసెంబ్లీ ప్రాంగ‌ణాన్ని కోర్టుగా మార్చారు. ఇక స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల‌ను కోర్టుకు తెచ్చేందుకు ఈ ట‌న్నెల్ మార్గాన్ని వాడేవార‌ని స్పీక‌ర్ గోయ‌ల్ తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్స‌వ సంబ‌రాల నేప‌థ్యంలో ట‌న్నెల్ ప్రాంతాన్ని తాను సందర్శించానని, చెప్పిన రామ్ నివాస్ గోయల్.. త్వరలోనే దీనికి తగు మరమ్మతులు చేసి.. రానున్న ఆగస్టు 15 (పంద్రాగస్టు) నాటికి దేశ ప్రజల సందర్శనానికి వీలు కల్పించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles