HC Stays reopening of educational institutions from Sep 1 తెలంగాణలో విద్యాసంస్థల పునఃప్రారంభంపై హైకోర్టు స్టే.!

High court stays telangana govt order to reopen schools from september 1

Telangana High Court, Telangana Government, Schools, Schools Reopen, Educational Institutions, Corona Third wave, CM KCR, Sabitha Indrareddy, Public Interest Litigation, PIL, Coronavirus, Educational institutions, Educational institutions in Telangana, Telangana

Telangana government has decided to reopen schools and colleges in Telangana from tomorrow after a halt for a long time. However, the Telangana High Court ruled that the opening of schools is not mandatory and imposed a week-long stay on the Government Order.

తెలంగాణలో విద్యాసంస్థల పునఃప్రారంభంపై హైకోర్టు స్టే.!

Posted: 08/31/2021 12:19 PM IST
High court stays telangana govt order to reopen schools from september 1

రాష్ట్రంలోని విద్యాసంస్థలతో పాటు ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు అన్ని పాఠశాలలను ప్రత్యక్ష విద్యాబోదనను నిర్వహించాలంటూ తెలంగాణ ప్రభుత్వం జారి చేసిన ఉత్తర్వులపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు స్టే విధించింది. రేపటి నుంచి విద్యాసంస్థలను పునఃప్రారంభించాలన్న నిర్ణయంపై స్టే విధించిన న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వంపై పలు ప్రశ్నలను సంధించింది. విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతులపై విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కూడా ఎలాంటి ఒత్తిడికి గురిచేయవద్దని ఆదేశించింది. ఇక తమ పిల్లలను ప్రత్యక్ష బోధనకు పంపిస్తామంటూ వారి తల్లిదండ్రుల నుంచి రాతపూర్వకంగా ఎలాంటి హామీలు తీసుకోరాదని ఆదేశించింది. ప్రత్యక్ష తరగతులపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూళ్ల యాజమాన్యాలపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాకూడదని ప్రభుత్వానికి ఆదేశాలను జారీ చేసింది. ఆన్ లైన్ బోధనను కొనసాగించాలని ఆదేశించింది.

సొంత భవనాలు లేని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు.. గత రెండేళ్లుగా పాఠశాలల నిర్వహణ లేకపోయినా భవన యజమానులకు లక్షల రూపాయలను అద్దెగా చెల్లిస్తూ.. అర్థికంగా కుంగిపోతున్నారని.. ఇక పాఠశాలలో ప్రత్యక్ష బోధన లేకపోతే.. విద్యార్థులు కూడా చదువుల్లో వెనుకబడిపోతారని భావించిన ప్రభుత్వం.. సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని ఇటీవల అదేశాలు జారీ చేసింది. అయితే కోవిడ్ నిబంధనల మేరకు బెంచికి ఒక్క విద్యార్థి మాత్రమే కూర్చునే వెసలుబాటు చేయాలని., తరగతి గదులను ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళ్లల్లో శానిటైజ్ చేయాలని కూడా అదేశించిన విషయం తెలిసిందే. ఇక ప్రభుత్వ అదేశాల మేరకు పాఠశాల యాజమాన్యాలతో పాటు విద్యాసంస్థలు కూడా అన్ని సిద్దం చేసుకున్న తరుణంలో.. హైకోర్టు తాజాఅదేశాలతో అందుకు బ్రేక్ పడింది.

అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పాఠశాలల పునఃప్రారంభంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. కరోనా వైరస్ తగ్గిందని చెప్పడానికి ప్రభుత్వం వద్ద ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని పిటిషన్ దారుడు తన పిటిషన్ లో ప్రశ్నించారు. స్కూళ్లలో చిన్న వయసు పిల్లలు ఉంటారని... వైరస్ వల్ల వారు ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. స్కూళ్లో సిబ్బంది, విద్యార్థులు అందరూ కలిపితే... వందల మంది ఉంటారని... దీని వల్ల కరోనా వైరస్ కమ్యూనిటీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. కరోనా థర్డ్ వేవ్ అక్టోబర్-నవంబర్ మధ్య తీవ్రస్థాయికి చేరుకునే అకాశాలు వున్నాయిని ఇప్పటికే అరోగ్యశాఖ నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంలో... ఇప్పటికిప్పుడు ప్రత్యక్ష బోధన వద్దని కోర్టును కోరారు. ఈ వాదనలను విన్న అనంతరం ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles