Video Of Taliban Flying US Chopper With Body Dangling అమెరికా హెలికాప్టర్ కు ఒక వ్యక్తిని కట్టి గాల్లో చక్కర్లు

Taliban flying a us black hawk helicopter with a body hanging from it

taliban in afghanistan,US withdrawal,taliban news,US Withdrawal News,US troop withdrawal,taliban latest news,Taliban Takeover News, Taliban news, US Pullout, US Withdrawal From Afghanistan, Afghan-Taliban Crisis, Afghanistan news

A body dangled from a US military chopper being flown by the Taliban, reportedly over Kandahar in Afghanistan, in a chilling video shared on Tuesday by several journalists and what the Taliban claims is their official handle.

ITEMVIDEOS: తాలిబన్ల అరాచకం: హెలికాప్టర్ కు ఒక వ్యక్తిని కట్టి గాల్లో చక్కర్లు

Posted: 08/31/2021 03:14 PM IST
Taliban flying a us black hawk helicopter with a body hanging from it

ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి అమెరికన్‌ దళాలు ఉపసంహరించుకున్న కొన్ని గంటల్లోనే అరాచకం రాజ్యమేలుతొంది. కాబుల్ లని విమానాశ్రయం కేంద్రంగా తుపాకీ గుళ్ల వర్షం కురిపించిన తాలిబన్లు.. తరువాత ఆత్మహుతి దాడులు, రాకెట్ ప్రయోగాలు కూడా చేసింది. తమ తుపాకుల నీడలో అప్ఘన్ ప్రజలను భయాందోళనకు గురిచేయడమే కాకుండా ఎవరూ భయపడాల్సిన పనిలేదని కూడా స్పష్టం చేసింది. అయితే తాలిబన్లు చెబుతున్నది ఒకటి చేస్తున్నది మరోకటని ఈ వీడియో ద్వారా తేలిపోయింది. ఈ విషయాన్ని చెప్పడానికి సాక్ష్యంగా వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

ఈ వీడియో ఆఫ్ఘన్‌ కాందహార్‌ నగరం నుంచి వచ్చినట్లుగా తెలుస్తున్నది. అమెరికాకు చెందిన బ్లాక్‌ హాక్‌ హెలికాప్టర్‌కు ఒక వ్యక్తిని కట్టి వేలాడి తిప్పినట్లుగా ఆ వీడియోలో కనిపిస్తున్నది. హెలికాప్టర్‌ గాలిలో తిరుగుతున్నంత సమయం దానికి వేలుడుతున్న వ్యక్తి అనేక ఇండ్లను ఢీకొంటూ వెళ్లాడం కనిపించింది. చాలా మంది జర్నలిస్టులు ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. తాలిబాన్‌ ఒక వ్యక్తిని చంపి కందహార్ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న యూఎస్ మిలిటరీ హెలికాప్టర్‌తో ఎత్తుకెళ్లారని పేర్కొన్నారు.

అయితే, బాధితుడు ఎవరన్నది గుర్తించేందుకు వీలుగా వీడియో లేదు. అతడు గతంలో అమెరికా వ్యాఖ్యాతగా పనిచేసినట్లు ఊహాగానాలు మాత్రం వినిపిస్తున్నాయి. అయితే, ఇంకా ఎలాంటి నిర్ధారణ కాలేదు. అలాగే, చనిపోయిందీ, లేనిదీ కూడా తెలియరాలేదు. ఈ వీడియోపై చాలా మంది నెటిజెన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి ఘటనలు మున్ముందు చాలా చూడాల్సి ఉంటుందని ఒకరు కామెంట్‌ చేయగా.. దీనికి జో బైడెన్‌ కారకుడని మరొక నెటిజెన్‌ కామెంట్లు రాశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles